సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు 7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శనివారం ఉదయం రాజిరెడ్డి పరవాడ వెళ్లి రాత్రికి తిరిగి రావడం నిజం కాదని దర్యాప్తులో తెలుసుకున్నాడు యుగంధర్. రాజిరెడ్డి శనివారం ఉదయం తన సెల్ నుంచి రాంప్రసాద్‌కి ఓ కాల్ చేశాడు. అలాగే మధ్యాహ్నం రెండుకి మరో కాల్ చేశాడు. రాంప్రసాద్‌ని కారులో ఎక్కించుకుని రాజిరెడ్డి తీసుకెళ్లడం రెండు గంటలకి డ్యూటీకొచ్చిన వాచ్‌మెన్ చూశాడు. ఆ శనివారం నెలలో రెండోది కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పని చెయ్యదు. అంటే సుందరం అబద్ధం చెప్పాడు. అన్నింటికంటే ముఖ్యంగా సుందరం, రాజిరెడ్డి తమ తండ్రుల పేరు మీద బ్యాంక్ లోను తీసుకున్నట్టు కనుక్కున్నాడు యుగంధర్.
మరునాడు పోలీస్ కమిషనర్ని ఆఫీసులో కలిసి తన దర్యాప్తు వివరాలు చెప్పాడు యుగంధర్.
‘హారిబుల్...’ కమిషనర్ అన్నాడు.
‘యస్ సార్!’
కొన్ని క్షణాలు ఆలోచించి అడిగేడు కమీషనర్.
‘కోర్టులో కేసు నిలవడానికి బలమైన ఆధారాలు ఏమైనా దొరికాయా?’
‘హత్యకి ఉపయోగించిన కత్తి మీదే కాదు ఖాళీ సీసాల మీద కూడా వేలిముద్రలు లేవు సార్!’
ప్రశ్నార్థకంగా చూశాడు కమీషనర్.
‘పరిస్థితుల్నిబట్టి మోటివ్ ఆధారంగా హంతకుల్ని గుర్తించాను. నేరం చేసినట్టు ఇద్దరూ స్టేషన్‌లో అంగీకరించారు. కేసు కోర్టుకి వెళ్లాక ఇద్దరూ బెయిల్ మీద బయటికొస్తారు. దర్యాప్తులో చెప్పిన విషయాలు చెప్పలేదంటారు. హత్య జరిగిన సమయంలో రాజిరెడ్డి పరవాడలో ఉన్నట్టు ఎవరో సాక్ష్యం చెబుతారు. అలాగే సుందరం కూడా సాక్ష్యం ఏర్పాటు చేసుకుంటాడు’
‘అంటే కేసు పోతుంది కదా?’
‘అవును సార్!’
కాసేపు వౌనం తర్వాత యుగంధర్ ముఖంలోకి చూశాడు కమీషనర్.
‘ఇంతవరకూ మన సిటీలో ఇలాంటి నేరం జరగలేదు. దీన్ని ఉపేక్షిస్తే ల్యాండ్ మాఫియా కార్యక్రమాలు అధికమవుతాయి. మరిన్ని నేరాలు జరుగుతాయి. కేసుని ఆధారం చేసుకుని ల్యాండ్ మాఫియాకి తిరుగులేని హెచ్చరిక పంపాలి. నగరం ప్రశాంతంగా ఉంచడానికి మనం ఈ పని చేపట్టాలి...’
కమీషనర్ ఏం చెబుతున్నాడో అర్థం చేసుకునే ప్రయత్నంలో వౌనంగా ఉన్నాడు యుగంధర్.
‘నీకింకా పెళ్లి కాలేదు. మంచి పోలీస్ ఆఫీసర్ అనే పేరు ప్రజల్లో ఉంది. అవునా?’
యుగంధర్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.
‘పెందుర్తి పోలీసుస్టేషన్‌లో పని చెయ్యాలనే ఆసక్తి నీకుందా?’
‘లేదు సార్!’
‘ఆ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పోతిన మల్లయ్యపాలెం స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్ అడుగుతున్నాడు. అతని ఇద్దరు పిల్లలు మధురవాడ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నారట. అందుకని నిన్ను పెందుర్తి ట్రాన్స్‌ఫర్ చేస్తాను’ చెప్పాడు కమీషనర్.
‘మీ ఇష్టం సార్!’
అప్పుడు చెప్పాడు ఏం చెయ్యాలో.
తెల్లబోయేడు యుగంధర్.
5
రాజేష్ సొంత ఊరికి విశాఖపట్నం నుంచి రెండు గంటల ప్రయాణం.
శనివారం సాయంకాలం బయలుదేరి తల్లిదండ్రులతో గడిపి సోమవారం ఉదయం డ్యూటీకి వస్తాడు. మిగతా రోజుల్లో ఓ రూము తీసుకుని ఉంటూ మెస్‌లో తింటాడు. ఎలాంటి వ్యసనాలు లేకపోవడంతో కాలం ప్రశాంతంగా గడుస్తోంది. తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని వత్తిడి చేస్తున్నారు. రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత మాత్రమే చేసుకుంటానని చెప్పేశాడు.
ఎందుకంటే ఇప్పుడతను ప్రొబెషనరీ ఆఫీసర్. ఈ మధ్య కాలంలో సంవత్సరం సెలవు పెట్టడంతో ప్రొబెషన్ పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది. రాజేష్ మనసులో ఎన్నో కోరికలున్నాయి. బి.టెక్ తర్వాత టెస్ట్ రాసి బ్యాంక్‌కి సెలెక్ట్ అయ్యాడు. నిజానికి అతనికి ఇంకా చదువుకోవాలని ఉంది. ఉద్యోగం వచ్చాక దాన్ని వదిలేసి చదువుకోవడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకుంటే పూర్తిగా ఇరుక్కుపోతాడు. అందుకే తల్లిదండ్రుల్ని రెండు సంవత్సరాలు ఆగమన్నాడు.
తల్లిదండ్రులది కులాంతర వివాహం. ఆ సంగతి తెలియకుండా ఇరవై ఏళ్లు పెరిగాడు. బి.టెక్ చదువుతుండగా ఇంట్లో ఏవో కాగితాల కోసం వెదుకుతుంటే తల్లి స్కూల్ సర్ట్ఫికెట్ కనిపించింది. తల్లి కులం అందులో చూసి తెల్లబోయేడు.
ఆ కాలంలో తండ్రి ఊరుని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడట. ఈ కారణం చేతనే ఇరువైపుల బంధువులు ఆ ఇద్దర్నీ దూరంగా ఉంచారు. దృఢమైన వ్యక్తిత్వం తండ్రిది. తనకి న్యాయం అనిపిస్తే ఎంత కష్టమైనా చేసి చూపిస్తాడు. ఈ లక్షణం వల్లనే గ్రామంలో అతనికి మంచి పేరుంది. తండ్రి మాటకు ఎదురు చెప్పదు తల్లి.
అలాంటి వారి కొడుకు కాబట్టే మంచి లక్షణాలు వచ్చాయి రాజేష్‌కి. ఎక్కడో అమెరికాలో చనిపోయిన మిత్రుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకోవడానికి అదే కారణం. ఇప్పుడు దాని గురించి అడిగేవాళ్లు లేకపోయినా ఆత్మసాక్షి అంగీకరించలేదు.
ఆలోచిస్తూ యధాలాపంగా ఓ చెక్కు మీద సంతకం చేసి ఓ క్షణం ఆగేడు. దాని అకౌంట్ నెంబర్ కాగితం మీద రాసుకుని క్యాష్ కౌంటర్‌కి పంపాడు. ఏదో పని ఉన్నట్టు క్యాష్ కౌంటర్‌లోకి నడిచాడు. అంతకు ముందు తను సంతకం చేసిన చెక్కు ఎవౌంట్ తీసుకున్న వ్యక్తిని పరీక్షగా చూసి వెనక్కి వచ్చాడు.
వర్కింగ్ అవర్స్ అయిపోయాక లంచ్ తొందరగా ముగించి సిస్టమ్ ముందు కూర్చున్నాడు. నోట్ చేసుకున్న అకౌంట్ ఫైల్ ఓపెన్ చేశాడు. అది ఎల్.్భపతి పేరు మీదున్న అకౌంట్. అంతకు ముందు నెట్ సెంటర్ నుండి రాసమణి సెల్ నెంబర్ ద్వారా తీసుకున్న చిరునామా నిజమైంది కాదు. ఇప్పుడు ఏకంగా తిమింగలం చిరునామా చిక్కింది.
చిరునవ్వు అతని పెదవుల మీద కదిలింది.
* * *
ఎప్పటిలా ఉదయం ముద్దాయిల్ని సెల్ నుంచి బయటకు తీశాడు స్టేషన్ సెంట్రీ. అందరూ స్టేషన్ వెనుకనున్న టాయిలెట్స్ వైపు నడిచారు. ఓ కానిస్టేబుల్ రైఫిల్‌తో దూరంగా నిలబడి, వాళ్లని గమనించసాగాడు. కొందరు ముద్దాయిలు టాయిలెట్స్‌లోకి దూరారు.
రాజిరెడ్డి సిగరెట్ వెలిగించుకుని ఓ రాయి మీద కూర్చున్నాడు.
‘ఈ రోజు కోర్టులో హాజరు పెడతారా మనని?’ సుందరం అడిగేడు. తలూపి చెప్పాడు రాజిరెడ్డి.
‘నిన్న ఉదయం అరెస్ట్ చేశారు కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో హాజరు పెట్టాలి. మెజిస్ట్రేట్ రిమాండ్‌కి పంపుతాడు’
‘బెయిల్ దొరుకుతుందా?’ సందేహం వ్యక్తం చేశాడు సుందరం.
నవ్వేడు రాజిరెడ్డి.
‘ఇంటరాగేషన్‌లో నేరం అంగీకరించడం, ఆ తర్వాత కోర్టులో నేరం చెయ్యలేదనడం మామూలే. కోర్టుకి సాక్ష్యం కావాలి కాని తర్కం కాదు’
‘మన పథకం ఎక్కడ దెబ్బతింది?’ గొంతు తగ్గించాడు సుందరం.
‘పథకంలో లొసుగు లేదు. సాధారణంగా పోలీసులు తమకి ఉపయోగం లేని కేసుల్లో కష్టపడి పని చెయ్యరు. అందుకే చాలా కేసులు పరిష్కారం లేకుండా మూలన పడుతుంటాయి. కాని మన దురదృష్టం కొద్దీ మిగతా వారికి భిన్నమైన పోలీసు అధికారి ఈ స్టేషన్‌లో ఉన్నాడు’ చెప్పాడు రాజిరెడ్డి.
‘నాకు భయంగా ఉంది’
‘్భయం దేనికి? పోలీసులు వాళ్ల పద్ధతిలో వాళ్లు కేసు పెడతారు. మన పద్ధతిలో మనం బయటకొస్తాం. ఒకసారి బయటకొస్తే కేసు తారుమారవుతుంది..’ నవ్వి, ఓ టాయిలెట్ ఖాళీ అవడంతో మరో కొత్త సిగరెట్ వెలిగించుకుని అటు కదిలేడు.
అతని వైపు చూస్తూ ఉండిపోయేడు సుందరం.
రాంప్రసాద్‌ని అడ్డు తొలగించాలన్న ఆలోచన రాజిరెడ్డి బయటపెట్టినప్పుడు వ్యతిరేకించాడతను. కాని బ్యాంకు అప్పు వడ్డీతో పాపంలా పెరిగిపోయింది. మొత్తం సొమ్ము వ్యాపారంలో చిక్కుకు పోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేదు. కొంతకాలం ఆగమని కోరినా రాంప్రసాద్ కుదరదన్నాడు. లోను ఇవ్వడం తను చేసిన తప్పని, అత్యాశకు పోయి ఇరుక్కుపోయారని, సొమ్ము కట్టకపోతే చర్య తీసుకుంటానని తెగేసి చెప్పాడు. దానితో రాజిరెడ్డి బుర్రలో ఊపిరి పోసుకున్న పథకానికి తలూపాడతను.
ఓ గంట తర్వాత సుందరం, రాజిరెడ్డిలను విజిటర్స్ రూములో కూర్చోమని మిగతా ముద్దాయిల్ని సెల్‌లో ఉంచారు. స్టేషన్ అటెండర్ ఓ పార్లర్ నుంచి టిఫిన్ ప్యాకెట్లు తెచ్చి వారిద్దరికీ ఇచ్చాడు. టిఫిన్ తిన్నాక కాఫీ, సిగరెట్లు, వక్కపొడి తెచ్చాడు. రాత్రిలేని మర్యాద తెల్లారేసరికి కనిపించడంతో ఆశ్చర్యంగా అడిగాడు రాజిరెడ్డి,
‘ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు?’
‘ఇన్స్‌పెక్టర్‌గారు రైటర్‌కి ఫోన్ చేసి చెప్పారట...’
యుగంధర్ లాంటి వ్యక్తి తమ పట్ల శ్రద్ధ చూపించాడంటే ఏదో కారణం ఉంటుంది. తమని జాగ్రత్తగా చూసుకోమని ఎవరో చెప్పి ఉండాలి. ఎవరు చెప్పి ఉంటారు? ఆలోచించాడు రాజిరెడ్డి. కాని జవాబు తట్టలేదు. సిగరెట్ కాలుస్తూ వౌనంగా కూర్చున్నాడు. కాని ఆలోచనలు బుర్రలో పరిగెడుతున్నాయి.
ప్రస్తుతం భూముల మీద పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. మంచి లాయర్ని ఏర్పాటు చెయ్యమని స్నేహితునికి చెప్పాడు. అవసరమైతే కారు అమ్మేసి డబ్బు రెడీ చెయ్యమన్నాడు. రాంప్రసాద్‌ని హతమారిస్తే బ్యాంక్ లోను నుంచి బయటపడవచ్చునని, అతనికి ఇచ్చిన వాటిలో మిగిలిన సైట్లు సొంతమవుతాయని ఆశించాడు. హత్యకి మోటివ్ కనుక్కోవడం అసాధ్యమని భావించాడు.
కాని అంతా తలకిందులైంది.
రాంప్రసాద్ తమ పార్ట్‌నర్ అని తెలుసుకోవడంతో దర్యాప్తు ఊపందుకుంది. తప్పుడు పత్రాలతో తామిద్దరికీ లోన్ ఇచ్చిన విషయం తెలియడం వల్ల మోటివ్ అర్థమై పోయింది. ఇప్పుడు సమర్థుడైన లాయర్ని పెట్టుకుని కేసు నుంచి బయటపడాలి.

(మిగతా వచ్చే సంచికలో)

-మంజరి 9441571994