సబ్ ఫీచర్

ఎసిడిటీ ఎందుకు వస్తుందంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎసిడిటీ (కడుపులో మంట) లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా నానాటికీ పెరుగుతోంది. భోజనం తిన్న తర్వాత కడుపులో మంట, అజీర్తి, పుల్లటి తేన్పులు ఉన్నట్లు అనిపిస్తే కచ్చితంగా ఎసిడిటీ బారిన పడినట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదరంలోని గాస్ట్రిక్ గ్రంధుల నుంచి అధికంగా ఆమ్లాలు విడుదల కావడం వల్లే ఎసిడిటీ ఏర్పడుతుంది. ఈ ఆమ్లాల వల్ల ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, మద్యపానం, ధూమపానం, అతిగా ఉప్పు వాడడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఎసిడిటీకి కారణాలవుతున్నాయి. అజీర్తి, కడుపులో మంట, వాంతులు, ఛాతీతో పాటు కడుపు పైభాగంలో నొప్పి, ఏదీ రుచిగా అనిపించక పోవడం, శ్వాసలో ఇబ్బందులు, గొంతు సంబంధ సమస్యలు కూడా ఎసిడిటీ వల్ల వచ్చే అవకాశం ఉంది. అతిగా తినడం వల్ల అజీర్తి సమస్య ఏర్పడితే అది కొన్నాళ్లకు ఎసిడిటీగా మారే అవకాశం ఉంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం తప్పదు. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే ఎసిడిటీ నుంచి బయటపడొచ్చు. భోజనం చేయడానికి అరగంట ముందు చిన్న అల్లం ముక్కను తినడం మంచిది. అధికంగా పీచు కలిగిన వెల్లుల్లిని వంటకాల్లో విరివిగా వాడితే ఉదరంలో ఆమ్లాల ఉత్పత్తిని అరికట్టవచ్చు. గ్లాసుడు నీటిలో చెంచాడు జీలకర్రను నానబెట్టి, ఆ నీటిని రోజుకోసారి తాగితే కడుపులో మంట తగ్గుతుంది. ఉదయానే్న పరగడుపున తులసి ఆకుల రసాన్ని తాగితే జీర్ణశక్తి వృద్ధి చెందడమే గాక కడుపులో వికారం తగ్గుతుంది. ఉదయం పూట ‘టీ’లో కాసిన్ని పుదీనా ఆకులను వేసుకుని తాగాలి. పుదీనా ఆకుల రసాన్ని తాగినా మంచి ఫలితం ఉంటుంది.