తెలంగాణ

అచ్చంపేట పంచాయతీ బరిలో 60 మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 26: అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో మొత్తం 60 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముఖ్యంగా అధికార టిఆర్‌ఎస్ తరపున 20 వార్డులకు 20 మంది అభ్యర్థులతో పాటు మరికొందరు రెబెల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. టిక్కెట్లు రాని పలువురు నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా తెరాసను అడ్డుకునేందుకు మహకూటమిగా కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు ఏర్పడ్డాయి. 20 వార్డులకు గాను కాంగ్రెస్ 13 వార్డుల్లో టిడిపి-4, బిజెపి-3 వార్డులకు పోటీ చేస్తున్నాయ. అయితే బి-్ఫం దక్కని దాదాపు 12 మంది కాంగ్రెస్ నాయకులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోకుండా మహాకూటమికి రెబెల్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. టిడిపి, టిఆర్‌ఎస్‌లో కూడా రెబెల్ అభ్యర్థుల బెడద వెంటాడుతోంది. కేవలం మూడు వార్డులకు బిజెపి పోటీ చేస్తుండగా, నాలుగు వార్డులకు తెదేపా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మూడు పార్టీలు ఏకం కావడంతో గెలుపు అంత సునాయాసంగా ఉండదని భావిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజులు అచ్చంపేటలోనే మకాం వేశారు.