ఆదుర్తి, డూండీలను మరచిపోలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశ్రీ ఆడియో ఫంక్షన్‌లో హీరో కృష్ణ

కృష్ణ, విజయనిర్మల, నరేష్ ప్రధాన తారాగణంగా ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ సాయిదీప్, బాలురెడ్డి, షేక్ సిరాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీశ్రీ’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. శ్రీశ్రీ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ సీడీని, ఆడియో సీడీని, థియేటర్ ట్రైలర్‌ను మహేష్‌బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ఈ సినిమాలో నాన్నగారి గెటప్ చూస్తే తన చిన్నతనం గుర్తొచ్చిందని, ఆయనకు పెద్ద అభిమానినంటే తానేనని, ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా వుందని తెలిపారు. పరిశ్రమకు వచ్చిన 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా తనను పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బారావు, నిర్మాత డూండిని తాను తలచుకోవాలని, వారితో చేసిన రెండు చిత్రాలను ఎప్పటికీ మరిచిపోలేనని కథానాయకుడు కృష్ణ తెలిపారు. మరాఠిలో వచ్చిన ఈ కథను దర్శకుడు చెప్పగా బాగా నచ్చి, తన కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని నటించానని ఆయన అన్నారు. అప్పటికీ ఇప్పటికీ కృష్ణలో ఏ మాత్రం ఉత్సాహం తగ్గలేదని, తనకు నాకు ఉన్న అనుబంధం ఆయన అలసిపోకుండా సినిమాలు చేస్తూనే ఉండాలని నటులు కృష్ణంరాజు తెలిపారు. హీరో కృష్ణతో కలసి తాను నటిస్తున్న 48వ చిత్రం ఇదని, తమ అభిమానులకు తప్పక నచ్చుతుందని నటి విజయనిర్మల అన్నారు. సామాన్యుడికి అన్యాయం జరిగితే చూసి రగిలిపోయే ప్రతి ఒక్కరూ శ్రీశ్రీనే అన్న కానె్సప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు ముప్పలనేని శివ అన్నారు. యూత్‌ను, ఫ్యామిలీని ఆకట్టుకునే విధంగా రూపొందిన ఈ చిత్రంలో కృష్ణ నటన హైలెట్‌గా ఉంటుందని నిర్మాత సాయిదీప్ తెలిపారు. కార్యక్రమంలో సుధీర్‌బాబు, ఇ.ఎస్.మూర్తి, కోదండరామిరెడ్డి, రాజేంద్రప్రసాద్, శివాజీరాజా, నరేష్, ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. సాయికుమార్, పోసాని, మురళీశర్మ, సోఫియా, తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: రామ్ కంకిపాటి, కెమెరా: సతీష్‌ముత్యాల, సంగీతం: ఇ.ఎస్. మూర్తి, దర్శకత్వం: ముప్పలనేని శివ.