అల్లరి నరేష్ కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అల్లరి’ చిత్రంతో కెరీర్ ప్రారంభించి, హీరోగా 50 చిత్రాలు పూర్తిచేసుకున్నాడు అల్లరి నరేష్. ఈమధ్య వరుసగా సినిమాల్లో నటిస్తున్నా కూడా ఇతగాడికి అన్నీ అపజయాలే ఎదురవుతున్నాయి. తాజాగా మోహన్‌బాబుతో కలిసి నటించిన ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు నరేష్. తాజాగా ఓ క్రేజీ సినిమాలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నరేష్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ బ్యానర్‌లో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం రూపొందింది. ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని కూడా నిర్మించిన బ్యానర్ కావడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తినెలకొంది. జి.నాజేశ్వర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. నరేష్, నాగేశ్వర్‌రెడ్డిల కాంబినేషన్‌లో గతంలో ‘సీమశాస్ర్తీ’, ‘సీమటపాకాయ్’ చిత్రాలు రూపొందాయి. మరి ఈ క్రేజీ బ్యానర్‌లో నరేష్ సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.