అంతర్జాతీయం

బంగ్లా ఆలయంపై బాంబు దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10 మందికి గాయాలు
ఢాకా, డిసెంబర్ 5: బంగ్లాదేశ్ ఉత్తర ప్రాంతంలో మధ్యయుగం నాటి ఒక దేవాలయ ప్రాంగణంలో శనివారం కొంత మంది గుర్తుతెలియని దుండగులు నాటు బాంబులతో దాడికి పాల్పడటంతో 10 మంది ప్రజలు గాయపడ్డారు. హిందూ పండుగ ‘రష్ మేళా’ను పురస్కరించుకుని దినాజ్‌పూర్‌లో కాంతాజీ దేవాలయం వద్ద వేలాది మంది భక్తులు గుమిగూడినప్పుడు ఈ దాడి జరిగింది. బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ చాందసవాదులు గత కొంత కాలం నుంచి వరుసగా జరుపుతున్న దాడుల్లో ఇది తాజా దాడి. ‘రష్ మేళా’ సందర్భంగా కాంతాజీ ఆలయం వద్ద 5 వేల మందికి పైగా భక్తులు ఓపెన్ ఎయిర్ షోను తిలకిస్తుండగా దుండగులు మూడు నాటు బాంబులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో దాదాపు 10 మంది గాయపడ్డారని, వీరిలో చాలా మందికి స్ప్లింటర్లు (బాంబుల్లో అమర్చిన మేకులు, గాజు పెంకులు) గుచ్చుకున్నాయని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ దాడి జరిగిన అనంతరం ముగ్గురు వ్యక్తులను నిర్బంధించి ప్రశ్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘దీనిపై ముమ్మర దర్యాప్తు నిర్వహిస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ముగ్గురు వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం’ అని స్థానిక కహ్రోల్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారి అబ్దుల్ గఫూరుద్దెద్ వివరించారు.