రాష్ట్రీయం

రైతు సంక్షేమమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వ్యవసాయ బడ్జెట్‌ను శుక్రవారం విధాన మండలి ప్రవేశపెట్టింది. రాష్ట్ర కార్మిక, క్రీడా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పాటునిచ్చే కీలకమైన రంగమని, రైతుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా రూపుదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్యం తీసుకుంటుందని మంత్రి ప్రకటించారు. సమగ్ర వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రైవేటు భాగస్వామ్యంను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు 45 కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో అనేక భాగస్వామ్యాలు, పెట్టుబడులు కోసం ఆసక్తిని చూపుతున్నారని మంత్రి వెల్లడించారు. రైతు సాధికార సంస్థ, హరిత, పొలం పిలుస్తోంది, చంద్రన్న రైతు క్షేత్రాలు వంటి కార్యక్రమాలను చేపడుతూ కర్షకుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతోందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు నాయకత్వంలోని టిడిపి ప్రభుత్వం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో రెండంకెల వృద్ధిరేటును, రైతాంగం యొక్క సమగ్ర సుసంపన్న స్థితిని కఖచ్చితంగా సాధిస్తామని గంటపాటు సాగిన వ్యవసాయ బడ్జెట్ ప్రసంగంలో మంత్రి వివరించారు. శుక్రవారం మండలి చైర్మన్ చక్రపాణి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం పదకొండు గంటల వరకు కొనసాగి, గంట సేపు వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటల తరువాత తిరిగి ప్రారంభమైన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఏకగ్రీవ పంచాయితీల
అభివృద్ధికి రూ. 80కోట్లు
మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు ప్రశ్నోత్తరాల పర్వం అసక్తి కరంగా కోనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో నిర్వహించిన సాధారణ ఎన్నికలలో 1835 గ్రామపంచాయితీలకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయాని, వాటిలో కనీస సదుపాయాల ఏర్పాటు కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో 80 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. సభ్యులు అదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు, డివి సూర్యనారాయణరాజు గ్రామ పంచాయితీలకు ప్రత్యేక ప్రోత్సహక నిధులపై ఆడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ పంచాయితీలు ఇప్పటి వరకు రూ. 800 కోట్లు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. అందులో కేవలం రూ.400 కోట్లు జారీమానాల రూపంలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకుని గ్రామ పంచాయితీల విద్యుత్ బిల్లులో 400 కోట్ల రూపాయాలను మాఫీ చేయాలని ఏపి విద్యుత్ రెగ్యులేటరి బోర్డుకు సూచించారని మంత్రి వివరించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో దాదాపు 2500 మంది గ్రామపంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా బర్తీ చేస్తామని మంత్రి అయ్యన్న పాత్రుడు శాసన మండలిలోప్రకటించారు. పంచాయంరాజ్ శాఖలో కార్యదర్శుల భర్తీకి సంబంధించిన ప్రశ్నను సభ్యులు అంగర రామమోహన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానామిస్తూ రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ పరంగా ఏలాంటి పనులు చేపట్టలేకపోతున్నామని చెప్పారు. చైర్మన్ చక్రపాణి సభను సోమవారానికి వాయదా వేశారు.

కేసుల పరిష్కారానికి
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
అభయ గోల్డ్ కంపెనీ బాధితులకు సహయం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలపాల్సిందిగా అంగర మోహన్ అడిగిన ప్రశ్నకు హోంమంత్రి చిన్నరాజప్ప సమాధానమిస్తూ విజయవాడలోని మెసర్స్ శ్రీ ఆభయ గోల్డ్ ఇన్‌ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన చర, స్థిర ఆస్తులను జప్తుచేశామని వెల్లడించారు. ఈ క్రమంలో గత ఫిబ్రవరి మాసం 20న ప్రభుత్వ పరంగా అదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో వుందని, ప్రభుత్వ పరంగా బాధితులకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని మండలిలో హోంమంత్రి హామీ ఇచ్చారు. ఆభయ గోల్డ్‌తో పాటు మరో 11 కంపెనీల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, ఇలాంటి కేసులు త్వరిత గతిన పరిష్కారం అయ్యేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఎర్పాటు చేస్తున్నట్లు చిన్నరాజప్ప ప్రకటించారు.

ధర్మవరం, మదనపల్లిలో మెగా చేనేత క్లస్టర్లు
ధర్మవరం, మదనపల్లిలో చేనేత కార్మిక సొసైటీలకు మెగా క్లస్టర్‌లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపినట్టు చేనేత శాఖ మంత్రి కె రవీంద్రబాబు స్పష్టం చేశారు. మహ్మద్ జానీ, రత్నాబాయి అడిగిన ప్రశ్నకు మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం 2011 జనాబా లెక్కల ప్రకారం 7163 క్లస్టర్‌లను ఏర్పాటు చేస్తే దానిని ప్రస్తుతం 9 వేలకు పెంచుతామని తెలిపారు. వ్యక్తిగత చేనేత కారుల రుణాలను, బృంద రుణాలను, 50 శాతం విద్యుత్ టారిఫ్ రాయితీని వినియోగించుకుంటూ, 5 హెచ్‌పి కంటే తక్కువ కనెక్షన్‌తో ఉన్న మినీ మరమగ్గాలకు ఇచ్చిన రుణాలను కూడా మాఫీ చేయాలని పి.కోటయ్య అధ్యక్షతన గల నిపుణుల కమిటీ సిఫారసు చేసిందని, వాటిని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
విధాన మండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్న అచ్చెన్నాయుడు

పోలీసుల అదుపులో అవినాశ్ అనుచరులు
జగ్గయ్యపేట రూరల్, మార్చి 13: రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప పేరు చెప్పుకుంటూ మానవ హక్కుల సంస్థ ముసుగులో వసూళ్లకు పాల్పడి హైదరాబాదు పోలీసుల ఎదుట లొంగిపోయిన అవినాశ్ అనుచరులు గోపాలరావు, రామకృష్ణను శుక్రవారం వేకువఝామున కృష్ణా జిల్లా సరిహద్దు గరికపాడు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవినాశ్ కేసుకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లలో వీరు ఉన్నట్లు గుర్తించిన కాకినాడ పోలీసులు నాలుగు రోజులుగా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అవినాశ్ లొంగిపోడంతో వీరి కదలికలపై దృష్టిపెట్టిన కాకినాడ పోలీసులు సెల్‌టవర్ లొకేషన్ ద్వారా గుర్తించారు. అవినాశ్ అనుచరులిద్దరూ హైదరాబాదు నుండి రాజమండ్రి వెళ్తున్న విషయం పసిగట్టి వారిని అనుసరిస్తూ రాష్ట్ర సరిహద్దులో ప్రవేశించే సమయంలో నందిగామ డిఎస్పీ రాధేష్ మురళికి సమాచారం అందించారు. ఆయన సర్కిల్ పోలీసులు, హైవే మొబైల్ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద నిఘా పెట్టిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. వీరిని అదుపులోకి తీసుకున్న విషయం మీడియాలో రావడంతో చిల్లకల్లు పోలీసులు ప్రత్యేక వాహనం ద్వారా వేరే ప్రదేశానికి తరలించారు.
స్వైన్‌ఫ్లూతో వ్యక్తి మృతి
నాదెండ్ల, మార్చి 13: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామంలో స్వైన్‌ఫ్లూ సోకి శుక్రవారం చిన్నం చిన్నబాబు(47) అనే వ్యక్తి మృతి చెందాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఇతను 10రోజుల క్రితం పనుల కోసం ఒంగోలుకు వెళ్లాడు. అక్కడ అనారోగ్యంపాలై తీవ్ర జ్వరంతో వారంరోజుల క్రితం చికిత్స కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వైద్యులు మెరుగైన చికిత్స కోసం చిన్నబాబును గుంటూరు తరలించారు. రక్తం శాంపిల్స్‌ను హైదరాబాద్‌కు పంపించడంతో స్వైన్‌ఫ్లూగా అక్కడి వైద్యులు నిర్ధారించారు. శుక్రవారం ఉదయం చిన్నబాబు మృతిచెందాడు. మృతదేహాన్ని ఇర్లపాడు గ్రామానికి తీసుకొచ్చారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆరోగ్య కార్యకర్త మృతి
కొల్లూరు : గతంలో కొల్లూరులో ఆరోగ్య కార్యకర్తగా పనిచేసి బదిలీపై భట్టిప్రోలు మండలంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న నీలి మాణిక్యం(46) స్వైన్‌ఫ్లూ బారినపడి విజయవాడలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈ సమాచారంతో గుంటూరు జిల్లా వైద్యాధికారిణి పద్మజరాణి ఆదేశాల మేరకు మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇంటింటి సర్వే, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించటంతోపాటు వ్యాధి బారినపడిన వారిని గుర్తించే పనుల్లో వైద్యసిబ్బంది నిమగ్నమయ్యారు. ఇంటింటికీ వెళ్లి జ్వరం, దగ్గు వంటి ఇబ్బందులతో బాధపడేవారి వివరాలు సేకరించి డిఎంహెచ్‌ఓకు నివేదిక పంపనున్నట్లు వైద్యశాఖ సిబ్బంది తెలిపారు.
521 అడుగులకు సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్, మార్చి 13: శ్రీశైలం జలాశయం నుండి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోవడంతో శుక్రవారం సాయంత్రానికి నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 521 అడుగులకు చేరుకుంది. ఇది 151.130 టీఎంసీలకు సమానం. తాగునీటి అవసరాల కోసం కుడికాలువకు 5,036 క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 9000 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1350 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లోగా 15,356 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోవడంతో ప్రస్తుతం సాగర్‌లో విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 833.90 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 53.7549 టీఎంసీలకు సమానం. ఎగువ జలాశయాలైన రోజా, తుంగభద్ర నుండి శ్రీశైలం జలాశయానికి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయినట్లు సాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కావలి, మార్చి 13: నెల్లూరు జిల్లా కావలి సమీపంలో శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పమిడి విద్యాసంస్థల కరస్పాండెంట్ పమిడి వెంకట సుబ్బయ్య(55) టిడిపి సీనియర్ నాయకులు కలిగిరి మండలానికి చెందిన మన్నవ చంద్రవౌళి (49) జలదంకి మండలం జమ్మలపాలెం నుంచి కావలి పట్టణానికి కారులో వస్తుండగా శుక్రవారం వేకువ జామున రెండుగంట ప్రాంతంలో స్థానిక బుడంగుంట ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటసుబ్బయ్య, చంద్రవౌళి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే కారులో ప్రయాణిస్తున్న మృతుడు చంద్రవౌళి సోదరుడు చిన్నారావు తీవ్ర గాయాలపాలు కాగా తొలుత కావలి ప్రైవేటు వైద్యశాలకు అక్కడ నుంచి చెన్నై గ్లోబుల్ వైద్యశాలకు బంధువులు తరలించారు. కారు డ్రైవర్ బంధువు ఆనందరావు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఏరియా వైద్యశాలకు తరలించారు.
మాటమీద నిలబడే నేత జగన్: కోలగట్ల
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 13: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయ సాధనకు తాను కృషి చేస్తానని వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్ధి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని, రాజకీయాల్లో జగన్ మాదిరి నాయకులు లేరన్నారు. రాజకీయంగా వెనకబడిన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన తనకు టిక్కెట్ ఇవ్వడం సంతోషకరమన్నారు. తాను ఎన్నికైన తర్వాత ప్రజల సమస్యలను తెలుసుకుని చట్ట సభల్లో వాణిని బలంగా వినిపస్తానన్నారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు.
విద్యార్థులపై సర్పంచ్ భర్త వీరంగం
మధిర, మార్చి 13: ఖమ్మం జిల్లా మధిర మండలం ఖమ్మంపాడు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ చైర్మన్ వీరంగం వేసి విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. బాధిత విద్యార్థులు, గ్రామస్థులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8.45 గంటల సమయంలో పాఠశాలలోకి వచ్చిన ఎస్‌ఎంసి చైర్మన్, ఆ గ్రామ సర్పంచ్ భర్త షేక్ బాజీ పాఠశాల ఆవరణలో ఉన్న ఏడో తరగతి విద్యార్థులు మాటూరి శ్రీనివాస్, పచ్చల వినయ్, ఆరో తరగతి విద్యార్థులు మాదినేని వీరబాబు, భూక్యా గోపి, భూక్యా సాయి, ఐదో తరగతి విద్యార్థి పవన్‌ను ఎలాంటి కారణం లేకుండానే విద్యుత్ వైర్‌తో చితకబాదాడు. విద్యార్థుల ఒంటిపై వాతలు తేలి చర్మం చిట్లి రక్తం కారింది. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఎస్‌ఎంసి చైర్మన్‌పై పాఠశాల ఉపాధ్యాయుడు తళ్ళూరి ఆంజనేయులు మధిర రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఎస్‌ఐ గాంతుల శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. పాఠశాల వద్దకు వెళ్లి విచారణ జరిపారు. విద్యార్థులను కొట్టిన బాజీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నేటి నుంచి భక్తులకు ముందస్తు వసతి సౌకర్యం
తిరుపతి, మార్చి 13: వేసవికాలం నేపధ్యంలో శ్రీవారిని దర్శించుకోడానికి తిరుమలకు వచ్చే భక్తులకు వసతి పొందే సులభ సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు దృష్టి సారించారు. ఇందులో భాగంగా శనివారం నుంచి ముందస్తు వసతి సౌకర్యాలు పొందే సౌకర్యం కల్పిస్తున్నారు. ఏప్రిల్ పది నుంచి ఇ-దర్శన్ కౌంటర్లలోను, ఏప్రిల్ 14 నుంచి ఇంటర్నెట్ ద్వారా భక్తులు వసతి సౌకర్యాన్ని కూడా కల్పించేందుకు టిటిడి రంగం సిద్ధం చేస్తోంది.

పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
విజయవాడ డిఆర్‌ఎం అశోక్‌కుమార్
రాజమండ్రి, మార్చి 13: యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గోదావరి పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతామని విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్ వెల్లడించారు. పుష్కరాలకు కేంద్రబిందువైన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్లను శుక్రవారం ఆయన తనిఖీచేశారు. ఈసందర్భంగా రాజమండ్రిలో తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. పుష్కరాల్లో ఉండే రద్దీకి అనుగుణంగా తగినన్ని రైళ్లు నడుపుతామని, ఎన్ని ప్రత్యేక రైళ్లు నడపాలన్న అంశంపై చర్చిస్తున్నామన్నారు. పుష్కరాల్లో రోజుకు లక్ష మంది ప్రయాణీకులను అదనంగా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. పుష్కరాల పనులు జూలై నాటికి పూర్తి చేస్తామన్నారు. రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో తూర్పురైల్వే బుకింగ్ వైపు 4వ ప్లాట్‌ఫారంతో పాటు, ఎస్కలేటర్, ఫుట్‌ఓవర్ వంతెన నిర్మిస్తున్నామన్నారు. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా తొక్కిసలాట జరగకుండా స్టేషన్ లోపలికి, బయటికి వెళ్లేందుకు 4 ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే అదనపు టిక్కెట్ బుక్కింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు డిఆర్‌ఎం చెప్పారు. పుష్కరాల్లో గ్రామీణ ప్రయాణీకుల సౌకర్యార్థం కొన్ని స్టేషన్లలో ప్యాసింజర్ రైళ్లకు ప్రత్యేక హాల్టులు కల్పిస్తామన్నారు. అంతకు ముందు ఆయన రాజమండ్రి రైల్వేస్టేషన్‌లోని ఫుట్‌ఓవర్ వంతెన, విఐపి గేటు, తూర్పుబుకింగ్ కౌంటర్, 4వ ప్లాట్‌ఫారం, వెయిటింగ్ హాళ్లు, పుష్కరాల పనులను పరిశీలించారు. పనుల ప్రగతిపై డిఆర్‌ఎం అశోక్‌కుమార్ సంతృప్తి వ్యక్తంచేశారు.
హామీలు మాఫీ చేసే బడ్జెట్

అనంతపురం టౌన్, మార్చి 13: ఎన్నికల హామీలను మాఫీచేసే బడ్జెట్‌ను తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ ప్రజల్లో విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు. అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేయాల్సిన బడ్జెట్‌లో టిడిపి ప్రభుత్వం చేతగానితనాన్ని బయటపెట్టుకుని దద్దమ్మగా మారిందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో భాగస్వాములుగా ఉన్న టిడిపి, బిజెపి నిధులు తీసుకురావటంలో వైఫల్యం చెందాయన్నారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీకి నిధుల కేటాయింపు జరగలేదన్నారు. హంద్రీనీవా రెండవదశకు చాలినన్ని నిధుల కేటాయించలేదన్నారు. పోలవరానికి పది వేల కోట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే కేంద్రం మొండిచేయి చూపించిందన్నారు. అలాగే పోలవరానికి నిధులు రాబట్టడంలో టిడిపి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. పట్టిసీమను ఏడు మాసాల్లో పూర్తిచేస్తామనటం నిధులు బొక్కడానికేనని ధ్వజమెత్తారు. పోలవరమే సాగునీటి సమస్యల పరిష్కారానికి శరణ్యమన్నారు. వాటర్‌గ్రిడ్ ఊసేలేదన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ బడ్జెట్‌లో పేర్కొనడాన్ని రఘువీరా తప్పుబట్టారు. అంగన్‌వాడీల వేతనాలు పెంచుతామని టిడిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొందని, అయితే అధికారంలోకి వచ్చాక మాటమార్చడం క్షమార్హం కాదన్నారు. ఇంటిలో ఉద్యోగం, నిరుద్యోగభృతి తదితర ఎన్నికల హామీల ప్రస్తావనే లేకపోవడాన్ని బట్టి చూస్తే ఏరుదాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా ఉందన్నారు. గవర్నర్ ఉపన్యాస సారాంశాన్ని ప్రభుత్వ బడ్జెట్ ప్రతిబింబించలేదన్నారు. ప్రతిపక్షాలు బడ్జెట్‌ను వ్యతిరేకించి సవరణలు జరిగేలా చూడాలని ఆయన కోరారు.
అంగన్‌వాడీల ఆందోళనకు రఘువీరా మద్దతు
న్యాయమైన డిమాండ్ల కోసం అనంతపురం నగరంలో అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళనకు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మద్దతు పలికారు. శుక్రవారం నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు రఘువీరా సంఘీభావం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల వేతనాలు పెంచాతామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని ఆ తరువాత మాటమార్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో రాష్ట్రంలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరిగిన అంగన్‌వాడీల ఆందోళనలో ప్రసంగిస్తున్న పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి

రామకృష్ణ అరెస్టుకు నిరసనగా వైకాపా వాకౌట్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన సమయంలో పార్లమెంటులో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ తదితరులను నాన్ బెయిల్ కింద అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వైకాపా శుక్రవారం అసెంబ్లీలో జీరో అవర్‌లో సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత జగన్ మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం రాజకీయ నేతలను వేధించే విధంగా నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం మాత్రమే సిపిఐ నేతలు అనంతపురంలో ఆందోళన చేశారన్నారు. రోజుల తరబడి సిపిఐ నేతలను జైల్లో పెట్టడం భావ్యం కాదని, వారిని వెంటనే విడుదల చేయాలని, నాన్‌బెయిలబుల్ కేసులను ఎత్తివేయాలన్నారు. అంతకు ముందు వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ, గత నెల 27వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప జిల్లా పర్యటన సందర్భంగా వైకాపా ఎమ్మెల్యేలను జిల్లా కలెక్టర్ అవమానపరిచారని, సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇస్తున్నట్లు జీరో అవర్‌లో తెలిపారు. తమను అవమానించిన జిల్లా కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా కలెక్టర్ ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గండిపేట జలాశయంకు సంబంధించిన కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారన్నారు. తాము బయలుదేరే సమయానికి ఈ మీటింగ్‌కు రావద్దని కోరారన్నారు. టిడిపి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాఘవేంద్ర సాగునీటి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి ఎమ్మిగనూరు ప్రాంతంలో మెట్ట ప్రాంత రైతులకు సాగునీటిని అందించాలన్నారు.
మత్స్య పరిశ్రమ అభివృద్ధికి చర్యలు
రాష్ట్రంలో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, వ్యవసాయేతర భూమి మదింపు పన్నును కూడా మాఫీ చేశామని, సాంకేతిక మద్దతు, వ్యాధి నియంత్రణ, శిక్షణ సదుపాయాలను కల్పిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం శాసనసభలో ఎమ్మెల్లే ఐ ఆనందరావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ మత్స్య పరిశ్రమను వృద్ధి వాహకంగా గుర్తించామన్నారు.
పన్ను ఎగవేసే గ్రానైట్ కంపెనీలపై చర్యలు
పన్నులు ఎగవేసే గ్రానైట్ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని గనుల శాఖ మంత్రి పీతల సుజాత శాసనసభకు హామీ ఇచ్చారు. టిడిపి ఎమ్మెల్యే డి నరేంద్రకుమార్ తదితరులు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ వర్తమాన సంవత్సరంలో మైనింగ్ ద్వారా 193 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు.
ఆక్రమణదారులను ఖాళీ చేయిస్తాం
నంద్యాల పట్టణంలో రోడ్లను ఆక్రమించుకుని వాహనాల రాకపోకలకు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్న ఆక్రమణదారులను తొలగిస్తామని, దీనిపై ఇప్పటికే పొలీసులు, రోడ్లు భవనాల శాఖకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి శిద్దారాఘవరావు శాసనసభకు తెలిపారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నంద్యాలలో ఫ్లైవోవర్ వంతెన కింద అనదికారికంగా దుకాణాలను నిర్వహిస్తున్న విషయం వాస్తవమేనన్నారు.