మెయిన్ ఫీచర్

మండే ఎండతో జాగ్రత్త సుమా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకుందం వయసు అరవై ఏళ్లు. పనిమీద పొరుగూరు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యేసరికి బాగా ఎండెక్కింది. బస్టాండ్‌కు వచ్చేసరికి కళ్ళు తిరిగి బెంచీపై వాలిపోయాడు. పక్కనున్న ప్రయాణికులు వెంటనే ముఖాన చల్లటి నీళ్ళు చల్లి తగిన సపర్యలు చేయడంతో ముకుందం బతికి బయటపడ్డాడు.
***
రాజమ్మ వ్యవసాయ కూలీ. ప్రతిరోజూ పనికి వెళ్లనిదే పూట గడవదు. ఎప్పటిలా ఆ రోజు కూడా పనికెళ్లింది. పని చేస్తున్నపుడు ఒక్కసారిగా తల తిరిగినట్లనిపించి గట్టుపై వాలిపోయింది. సహచర కూలీలు పక్కనున్న చెట్టుకిందికి తీసుకెళ్ళారు. చల్లటి నీళ్ళు ముఖాన చల్లి ఉపశమనం చేశారు. చాలా సేపటికిగానీ ఆమె కోలుకోలేదు.
***
పాండు ఇంటర్ చదువుతున్నాడు. పొరుగూరికి సైకిల్‌మీద వెళ్లి పరీక్షలు రాసి తిరిగి ఇంటికి బయలుదేరాడు. మధ్యాహ్నం వేళ బాగా ఎండ కాస్తోంది. కొద్ది దూరం వచ్చాక ఒంట్లో బాగా నీరసం అనిపించి సైకిల్ దిగి రోడ్డు పక్కన పడిపోయాడు. అతని అదృష్టం బాగుండి వెనకాల కారులో వస్తున్న ఆ వూరి పెద్దాయన గమనించి, వెంటనే కారులో తీసుకొని దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చాడు. దాంతో పాండు ఆపద నుండి బయటపడ్డాడు.
***
వేసవి కాలంలో వచ్చిందంటే చాలు వయసుతో సంబంధం లేకుండా చాలామంది వడదెబ్బకు గురవుతుంటారు. ఉన్నట్లుండి వీపరీతమైన తలనొప్పి, హైటెంపరేచర్‌తో వడదెబ్బ వస్తుంది. వెంటనే తగిన చికిత్స అందకపోతే ఒక్కోసారి ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉంది. అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరం పనిచేసే తీరు దెబ్బతింటుంది. ఎండ ప్రతాపంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. చర్మం పొడిబారినట్లవుతుంది. విపరీతమైన దప్పికతో నాలుక పిడచకట్టుకుపోతుంది. శరీరంలోని ద్రవ పదార్థాలు విపరీతంగా ఖర్చయిపోవటంవల్ల ఉష్ణోగ్రతను నిరోధించటం కష్టమవుతుంది. ఫలితంగా కండరాలు, కీళ్ళు నొప్పులు అధికమవుతాయి. గుండె వేగం పెరిగి, ఒక్కోసారి అపస్మారక స్థితిలోకి జారిపోయే ప్రమాదముంది. వడదెబ్బ తగిలిన వ్యక్తికి శరీరంపై బట్టలు తొలగించి, చన్నీటితో తడిపిన గుడ్డతో తుడవాలి. చల్లటి గుడ్డను కప్పాలి. ఎండ తగలని నీడ ప్రదేశంలోకి చేర్చాలి. బాగా గాలి తగిలేలా చూడాలి. రోగి చుట్టూ గుంపుగా చేరరాదు. అపస్మారక స్థితిలో ఉన్నట్లయితే వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందేలా చూడాలి. నుదుటిపై, చంకల్లోనూ, మోకాళ్ళ వద్ద ఐస్‌ముక్కలు వుంచాలి. పండ్ల రసం, కొద్దిగా ఉప్పు కలిపిన ద్రవాలు తాగించాలి.
వడదెబ్బ వయసు మళ్లినవారికి, చిన్నపిల్లలకే కాదు, యుక్తవయసు వారికీ తగిలే వీలుంది. శరీరంలో ద్రవ పదార్థాల శాతం తగ్గినట్లయితే ఎవరైనా వడదెబ్బ బారిన పడే అవకాశం వుంది. అయితే, ఎక్కువగా వృద్ధులకు ఈ సమస్య అధికంగా ఉంటుంది. సమస్య వచ్చిన తర్వాత బాధపడటం కంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారినుండి తప్పించుకోవచ్చు. వీలైనంతవరకు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్ళకూడదు. వెళ్లినా ఎండ ముదిరే లోపు తిరిగి ఇంటికిగాని, మరో సురక్షితమైన చోటుకుగాని చేరాలి. తప్పనిసనిగా బయటకు వెళ్లాల్సి వస్తే తలకు క్యాప్ పెట్టుకొని వెళ్ళటం మంచిది. చేతిసంచీలో వాటర్ బాటిల్ ఉంచుకుని దాహం వేసినట్లు అనిపిస్తే తాగాలి. తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలుంటే చెట్టు నీడకు గానీ, మరేదైనా సురక్షిత చోటికయినా చేరాలి. మొండిగా ముందుకుపోతే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది.
వ్యవసాయ కార్మికులు, ఇతర పనుల్లో వుండే కూలీలు వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. వ్యవసాయ పనులు ఉదయం పూట చేసుకొనేలా చూసుకోవాలి. పొద్దునే్న వెళ్లి మధ్యాహ్నం లోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. అలా అయితే ఎండ ముదిరే సమయానికి పని ముగించుకొని ఇంటికి చేరవచ్చు. మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకొని సాయంత్రం వేళ పనులు పూర్తిచేసుకొనేలా ప్లాన్ చేసుకోవాలి.
విద్యార్థులకు వార్షిక పరీక్షలు వేసవిలోనే వుంటాయి. ఎన్నో ఏళ్ళుగా వస్తున్న ఈ షెడ్యూల్ ఎట్టి పరిస్థితు ల్లోనూ మారదు. పిల్లలే తగిన జాగ్రత్తలు తీసుకొని ఎండబారిన పడకుండా చూసుకోవాలి. ఎండ పెరగకముందే పాఠశాలకు చేరుకోవాలి. అల్పాహారం, వాటర్ బాటిల్ వంటివి బ్యాగులో వుంచుకోవాలి. సైకిల్‌పై కన్నా బస్సు లేదా ఆటోలో వెళ్లడం మంచిది. వడదెబ్బ బారిన పడినవారు కోలుకోడానికి కొంత సమయం పడుతుంది. గనుక రోగి బంధువులు గానీ, సన్నిహితులు గానీ ఆందోళన చెందకుండా తక్షణ వైద్య సహాయం అందేలా చొరవ చూపాలి.
**