తెలంగాణ

పనులు ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: ప్రజా ధనాన్ని కాంట్రాక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ దోచిపెడుతున్నారని కాంగ్రెస్ నేత డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని విమర్శించిన కేసీఆరే ఇప్పుడు వారికి కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని విమర్శించారు. గాంధీభవన్‌లో ఆదివారం నాగం మీడియాతో మాట్లాడుతూ, 2400 కోట్ల విలువ చేసే బీటీ రోడ్ల కాంట్రాక్ట్‌ను ఒకే టెండర్ ద్వారా ఆంధ్రప్రాంత కాంట్రాక్టర్‌కు అప్పగించాలని చూస్తున్నాడని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన సొమ్మును తిరిగి కక్కించే వరకు పోరాడుతానని నాగం హెచ్చరించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశాడని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే పరిస్థితిని తీసుకొచ్చింది ప్రభుత్వమే కాదా? అని ప్రశ్నించారు. సెల్ఫ్ డిస్‌మిస్ అని 50 వేల మంది కార్మికులను సీఎం కేసీఆర్ రోడ్డు పాల్జేశాడని విమర్శించారు. కొత్త సెక్రటరేయేట్ నిర్మాణం కూడా కాంట్రాక్టుల్లో కమీషన్ కోసమేనని నాగం ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దీవాలా తీయించి కేసీఆర్ తన ఆస్తులను మాత్రం పెంచుకున్నాడని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిందన్నారు. తెలంగాణలో జరుగుతున్నంత అవినీతి దేశంలో మరే రాష్ట్రంలో జరగడం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై గతంలో గవర్నర్ నరసింహన్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కొత్త గవర్నర్ అయినా కేసీఆర్ అవినీతి పాలనపై దృష్టిసారించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై డబ్బా కొట్టుకోవడం తప్ప ఎకరం పొలానికి చుక్క నీరు రాలేదని నాగం ధ్వజమెత్తారు.