S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/06/2015 - 07:18

సామాజిక వెబ్‌సైట్లలో అనునిత్యం ఏదో ఒక సంచలనమే! ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో ఫొటోలు, పదునైన వ్యాఖ్యలను ‘అప్‌లోడ్’ చేయడం ఓ వేలం వెర్రిగా మారుతుండగా- వాటికి ‘లైక్’లు కొట్టడం మరో బిజీ వ్యాపకం! ప్రముఖ సామాజిక వెబ్‌సైట్ ‘ఇన్‌స్టాగ్రామ్’లో ప్రస్తుతం ఓ ఫొటో సంచలనం రేపుతోంది.

12/02/2015 - 21:38

ఎప్పటిలాగే ఈసారి కూడా భూమికలో ముగ్గుల పోటీ పెడుతున్నాం. మీ సృజనకు పదునుపెట్టి కొత్తకోణాల్లో ఆకర్షించే
అందమైన ముగ్గులు పంపండి. చుక్కల వివరాలు రాయడం మరువకండి. చుక్కలు, గీతలు - ఏ ముగ్గులైనా చూసేందుకు స్పష్టంగా ఉండాలి. పాతవాటిని తిరిగి పంపొద్దు. ముగ్గు వేసిన కాగితం మీద తప్పనిసరిగా మీ చిరునామా రాయండి.
ఇష్టమైతే ఫొటో పంపండి. వచ్చిన వాటిలో బాగున్న వాటిని వరుసగా ప్రచురిస్తాం.

12/02/2015 - 21:28

నేటి ఆధునిక సమాజంలోనూ ఆచారాల పేరిట జంతుబలులు యథేచ్ఛగా సాగుతుండగా, ఈ అనాగరిక పరిస్థితులపై ఓ మహిళ ధైర్యంగా పోరాడుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్‌లో సంప్రదాయబద్ధంగా జరిగే ‘గడిమై’ జాతరలో జంతుబలులు ఇవ్వడం ఆనవాయితీ. ఏటా గడిమై జాతరలో వేలాది జంతువులను హతమారుస్తారు. జంతుబలిని నిలిపివేయాలంటూ చాలాకాలంగా హిమాచల్ ప్రదేశ్‌లో కొందరు ఆందోళనలు చేస్తున్నా ఎలాంటి ఫలితం దక్కలేదు.

12/02/2015 - 02:05

ప్రపంచాన్ని భయపెడుతున్న ఎయిడ్స్ వ్యాధిని 2030 నాటికి తుదముట్టించాలని ‘యుఎన్ ఎయిడ్స్’ సంస్థ పిలుపునిచ్చింది. గతంతో పోలిస్తే ఈ ఏడాదికి ఎయిడ్స్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

12/02/2015 - 02:00

నేటి ఆధునిక యుగంలో అన్ని విషయాల్లో పద్ధతులు మారుతున్నట్లే ఆరోగ్యపు అలవాట్లలోనూ అనూహ్య మా ర్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బయటతినే ఆహార పదార్థాల వల్ల చిన్నారులు పలురకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒక విధంగా ఇందుకు తల్లిదండ్రులే కారణమవుతున్నారు. ఒకప్పుడు ఇంట్లో వండిన ఆహార పదార్థాలను మాత్రమే తినేవారు. నేటి ఉరుకులు, పరుగుల జీవనంలో తిండికి కూడా ఎంతోమంది తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

12/01/2015 - 05:23

నలుగురితో కలిసి సమాజంలో బతుకుతున్నప్పుడు ఎవరైనా సరే కొన్ని మర్యాదలు, మన్ననలు, పద్ధతులు పాటించక తప్పదు. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి మర్యాదలు చేయటం.. మనం ఎవరింటికైనా అతిథిగా వెళ్ళినప్పుడు వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూనే హుందాగా ప్రవర్తించటం.. ఈ పద్ధతులన్నీ మన వ్యక్తిత్వానికి వనె్నతెచ్చేవిగా ఉంటాయి.

11/25/2015 - 05:10

దేశ రాజధాని దిల్లీకి చెందిన అదితి చౌహాన్ 2015 సంవత్సరానికి సంబంధించి ‘ఆసియా ప్రాంత ఉత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారిణి’ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించింది. లండన్‌లో జరిగే ఆసియన్ ఫుట్‌బాల్ అవార్డుల ప్రదానోత్సవానికి ఆమె ఎంపికైంది.

11/25/2015 - 05:09

సాధారణంగా ఏభై ఏళ్లు పైబడిన మహిళలే ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ వ్యాధికి లోనవుతుంటారని అనుకుంటాం. కానీ, ఇటీవలి కాలంలో టీనేజీ యువతుల్లో సైతం ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవనశైలిలో మార్పులు, జన్యుపరమైన అంశాలు ఇందుకు కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.

11/25/2015 - 05:07

చలిగాలుల తీవ్రత పెరిగేకొద్దీ రాత్రి సమ యం సుదీర్ఘంగా అనిపిస్తూ, పగటి పూట ఎటూ తిరగలేక చాలామంది బద్ధకంగా ఫీలవుతూ ఉంటారు. ఈ కారణంగానే చలివేళ ఉత్సాహంగా ఉండేందుకు టీ, కాఫీలు మోతాదుకు మించి సేవిస్తుంటారు. వీటికి బదులు ‘బ్లాక్ టీ’ తాగడం ఉత్తమం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యరీత్యా కాఫీ కంటే టీ మేలని చాలామంది భావిస్తారు. నిజానికి మామూలు టీ కంటే ‘బ్లాక్ టీ’ తాగడం అన్ని విధాలా మంచిది.

11/24/2015 - 04:45

వ్యక్తిత్వ వికాసంతో పాటు నైతిక విలువలు అలవడేలా పిల్లల్ని పెంచడం తల్లుల బాధ్యత అని, వారిని అన్ని విధాలుగా తీర్చిదిద్దడంలోనే మాతృత్వపు మాధుర్యం దాగి ఉంటుందని ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే (40) అంటున్నారు. తల్లిగా తన కుమారుడి పెంపకంలో ఎదురైన అనుభవాలను, చవిచూసిన అనుభూతులను ఆమె ‘ది మోడర్న్ గురుకుల్’ పేరిట తాజాగా పుస్తక రూపంలో ఆవిష్కరించారు.

Pages