S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/15/2015 - 01:49

ఆధునికత, సాంకేతికత, పరిశోధన అన్నవి ఏ ఒక్క కాలానికో పరిమితమైనవి కావు. మనిషి ఆవిర్భావంతోనే ఇవి కూడా అనాదిగా తమ ఉనికిని చాటుకుంటూ సమాజానికి తమ వంతు మేలు చేకూరుస్తున్నాయి. మనిషికి బట్ట కట్టుకోవడం తెలియని రోజుల్లో- రాళ్ళ రాపిడితో నిప్పును పుట్టించడం, పచ్చి మాంసాన్ని కాల్చుకుని తినడం, వ్యవసాయాన్ని కనిపెట్టడం వంటివన్నీ పరిశోధనలే! అప్పటి కాలానికి అవి ఆధునికత కిందికే వస్తాయి.

12/08/2015 - 21:45

మెదడుకు పదును పెట్టాలే గానీ.. సృజనకు ఎలాంటి సరిహద్దులూ లేవు. ‘కళకు కాదేదీ అనర్హం’ అన్నట్లు మనం నిత్యం వాడే సాదాసీదా వస్తువులతోనే అద్భుత దృశ్యాలను ఆవిష్కరించవచ్చు. టవల్స్‌ను పలురకాలుగా మడత పెట్టి విభిన్న ఆకృతులను రూపొందిస్తూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడం ఇపుడు చాలాదేశాల్లో ఓ ‘ట్రెండ్’గా మారింది. వివిధ రంగుల్లో, విభిన్న సైజుల్లో లభించే టవల్స్‌తో వింత వింత ఆకారాలను ఆవిష్కరిస్తున్నారు.

12/07/2015 - 22:31

ఒకప్పుడు పల్లెటూళ్లు ఎలా ఉండేవి..? తొలికోడి కూయగానే చిరు చీకట్లతోనే వళ్లు విరుచుకుని పల్లె నిద్ర లేచేది. పాలేర్లు వాకిలి ఊడ్చే పొలికట్టె చప్పుళ్ళు.. అరకలకు సిద్ధమవుతున్న ఎద్దుల మెడలోని గంటల గలగలలు, వంటింట్లో ఇల్లాలి చేతి మజ్జిగ కవ్వపు నాట్య రవళులు, చెట్లమీది పిచ్చుకలు చేసే కిచ కిచ శబ్దాలు.. ఒకటిని మించి మరొకటి శ్రవణపేయంగా, ప్రకృతి చేస్తున్న పాటకచ్చేరీలా ఉండేది.

12/06/2015 - 07:18

సామాజిక వెబ్‌సైట్లలో అనునిత్యం ఏదో ఒక సంచలనమే! ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో ఫొటోలు, పదునైన వ్యాఖ్యలను ‘అప్‌లోడ్’ చేయడం ఓ వేలం వెర్రిగా మారుతుండగా- వాటికి ‘లైక్’లు కొట్టడం మరో బిజీ వ్యాపకం! ప్రముఖ సామాజిక వెబ్‌సైట్ ‘ఇన్‌స్టాగ్రామ్’లో ప్రస్తుతం ఓ ఫొటో సంచలనం రేపుతోంది.

12/02/2015 - 21:38

ఎప్పటిలాగే ఈసారి కూడా భూమికలో ముగ్గుల పోటీ పెడుతున్నాం. మీ సృజనకు పదునుపెట్టి కొత్తకోణాల్లో ఆకర్షించే
అందమైన ముగ్గులు పంపండి. చుక్కల వివరాలు రాయడం మరువకండి. చుక్కలు, గీతలు - ఏ ముగ్గులైనా చూసేందుకు స్పష్టంగా ఉండాలి. పాతవాటిని తిరిగి పంపొద్దు. ముగ్గు వేసిన కాగితం మీద తప్పనిసరిగా మీ చిరునామా రాయండి.
ఇష్టమైతే ఫొటో పంపండి. వచ్చిన వాటిలో బాగున్న వాటిని వరుసగా ప్రచురిస్తాం.

12/02/2015 - 21:28

నేటి ఆధునిక సమాజంలోనూ ఆచారాల పేరిట జంతుబలులు యథేచ్ఛగా సాగుతుండగా, ఈ అనాగరిక పరిస్థితులపై ఓ మహిళ ధైర్యంగా పోరాడుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్‌లో సంప్రదాయబద్ధంగా జరిగే ‘గడిమై’ జాతరలో జంతుబలులు ఇవ్వడం ఆనవాయితీ. ఏటా గడిమై జాతరలో వేలాది జంతువులను హతమారుస్తారు. జంతుబలిని నిలిపివేయాలంటూ చాలాకాలంగా హిమాచల్ ప్రదేశ్‌లో కొందరు ఆందోళనలు చేస్తున్నా ఎలాంటి ఫలితం దక్కలేదు.

12/02/2015 - 02:05

ప్రపంచాన్ని భయపెడుతున్న ఎయిడ్స్ వ్యాధిని 2030 నాటికి తుదముట్టించాలని ‘యుఎన్ ఎయిడ్స్’ సంస్థ పిలుపునిచ్చింది. గతంతో పోలిస్తే ఈ ఏడాదికి ఎయిడ్స్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

12/02/2015 - 02:00

నేటి ఆధునిక యుగంలో అన్ని విషయాల్లో పద్ధతులు మారుతున్నట్లే ఆరోగ్యపు అలవాట్లలోనూ అనూహ్య మా ర్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బయటతినే ఆహార పదార్థాల వల్ల చిన్నారులు పలురకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒక విధంగా ఇందుకు తల్లిదండ్రులే కారణమవుతున్నారు. ఒకప్పుడు ఇంట్లో వండిన ఆహార పదార్థాలను మాత్రమే తినేవారు. నేటి ఉరుకులు, పరుగుల జీవనంలో తిండికి కూడా ఎంతోమంది తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

12/01/2015 - 05:23

నలుగురితో కలిసి సమాజంలో బతుకుతున్నప్పుడు ఎవరైనా సరే కొన్ని మర్యాదలు, మన్ననలు, పద్ధతులు పాటించక తప్పదు. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి మర్యాదలు చేయటం.. మనం ఎవరింటికైనా అతిథిగా వెళ్ళినప్పుడు వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూనే హుందాగా ప్రవర్తించటం.. ఈ పద్ధతులన్నీ మన వ్యక్తిత్వానికి వనె్నతెచ్చేవిగా ఉంటాయి.

11/25/2015 - 05:10

దేశ రాజధాని దిల్లీకి చెందిన అదితి చౌహాన్ 2015 సంవత్సరానికి సంబంధించి ‘ఆసియా ప్రాంత ఉత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారిణి’ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించింది. లండన్‌లో జరిగే ఆసియన్ ఫుట్‌బాల్ అవార్డుల ప్రదానోత్సవానికి ఆమె ఎంపికైంది.

Pages