S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/09/2016 - 04:18

పాండుచ్చేరి కూడా ఢిల్లీలాగే కేంద్ర పాలిత ప్రాం తం. మాజీ పోలీసు అధికారిణి కిరణ్ బేడీని అక్కడికి గవర్నర్‌గా పంపించారు కదా- సోమవారం కొత్త ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈలోగానే శ్రీమతి కిరణ్ బేడీ రాష్ట్రంలో వి.ఐ.పిల మోటా రు కార్లకు స్పెషల్ సైరన్‌లు ఉం డరాదని బ్యాన్ చేస్తూ ఆర్డర్ వేసింది. వి.ఐ.పిల కార్లకు వున్న ప్రత్యేక సదుపాయాలను ఆమె రద్దు చేసింది. వారేవా! గవర్నర్‌గారూ!!

06/09/2016 - 04:16

జాన్ మహమ్మద్ ఖిల్జీ పాకిస్తాన్‌లోని క్వెట్టా వాసి. వృత్తికి మెడికల్ టెక్నీషియన్ గానీ వైద్యం ప్రాక్టీసు పెట్టుకున్నాడు. అతనికి యిప్పుడు నలభై మూడు సంవత్సరాల వయసు. కానీ ముప్ఫయి అయిదుమంది సంతానం వున్నారు. ముగ్గురు భార్యలూ కలిపి ఖిల్జీకి ఇరవై ఒక్క మంది కూతుళ్ళనూ, పధ్నాలుగుమంది కొడుకుల్నీ కని యిచ్చారు. వాళ్లందరినీ అతను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు.

06/09/2016 - 04:12

బౌద్ధ సన్యాసులు నడిపే ‘పులుగుడి’లో వందకుపైగా పెద్ద పులులు, వాటి సంతానం బ్రతుకు వెళ్లదీస్తున్నాయి. బౌద్ధ సన్యాసులు దీన్ని ‘సంరక్షణాలయం’గా చెబుతున్నా- యిది కేవలం ‘అక్రమ వ్యాపార నిలయం’. టూరిస్టుల దగ్గరనుంచి పులులతో ఆటలకు, సెల్ఫీలకు విపరీతంగా పైసలు గుంజుతున్నారు.

06/07/2016 - 22:35

అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. రాష్ట్రం ఇంకా గాడిలో పడలేదు. ఇవాళ కాకపోతే రేపైనా ‘మీరు ఏం చేశారని’ ప్రజలు నిలదీయవచ్చు. వారు ప్రశ్నించకముందే జవాబు చెప్పేస్తే పోలా...అదీ అర్థవంతంగా, మార్కులు కొట్టేసేలా, మరోమాట లేకుండా...ఇదీ ఏపీ ముఖ్యమంత్రి ఎత్తుగడ. అందుకే ఆయన కష్టాల పల్లవి అందుకున్నారనిపిస్తోంది.

06/05/2016 - 05:33

వాతావరణ కాలుష్యం మనిషి జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాహనాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగ గాలిలో కలిసి అది తీవ్ర అనర్థాలకు దారితీస్తోంది. ఈ పొగ కాలుష్యం మనిషిలో అధిక రక్తపోటుకు కారణమవుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకోసం చైనాలోని గౌంగ్‌డాంగ్ ప్రొవిన్షియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌వారు నిర్వహించిన పదిహేడు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది.

06/05/2016 - 05:08

లాలాజలం ఎక్కువైతే దానివల్ల కలిగే బాధలు, చికిత్స కిందటివారం చూసాం. ఇప్పుడు లాలాజలం తక్కువైతే దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో చూద్దాం. లాలాజలం తక్కువైతే నోరు ఎండిపోతుంది. కొందరిలో అయితే లాలాజలం అసలు ఉత్పత్తే కాదు. వీరి బ్రతుకులు చాలా భయంకరంగా వుంటాయి. లాలాజలం తక్కువగా వున్నా అసలు లేకపోయినా ఈ క్రింది సమస్యలు ఎదురవుతాయి.
- నోరు ఎండిపోతుంది.

06/02/2016 - 22:57

బెల్లం రుచికి తియ్యగా వుంటుంది. ఇందులో పోషక పదార్థాలు లభిస్తాయి. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్స్, సెలీనియం, మాంగనీస్ లాంటి పోషక పదార్థాలెన్నో లభిస్తాయి. బెల్లం బంగారపు రంగులో వుంటుంది. ఇది ఎంత ముదురు రంగులో వుంటే పోషక పదార్థాలు అంత పుష్కలంగా లభిస్తాయి. క్యాండీలు, ఐస్‌క్రీములు, చాక్‌లెట్స్, చ్యవనప్రాశలాంటి వాటిల్లో బెల్లాన్ని వాడుతారు.

06/01/2016 - 21:50

మే 27న దీదీ మమతా బెనర్జీ కలకత్తా ‘ఎర్రవీధి’లో జనాలమధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు- సభలో హేమాహేమీ నాయకులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వీరందరితోపాటే శ్రీమాన్ లల్లూ ప్రసాద్ యాదవ్ ప్రక్కనే అంతెత్తు విగ్రహం కనుక- అందరి కంటా పడుతూ కాశ్మీర్ జనాల వృద్ధ నాయకుడు, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు జనాబ్ ఫారూక్ అబ్దుల్లాగారూ కూడా కెమెరాల దృష్టిని ఆకట్టుకుంటూనే వున్నాడు.

05/31/2016 - 23:34

సనా ఇక్భాల్ బైక్ రైడర్. ఇప్పటికే దేశంలోని 83 పట్టణాలను చుట్టేసింది. బైక్‌లో షికారు చేయటం ఈమె హాబీ కాదు. ఒంటరిగా, నిర్భయంగా బైక్ రైడింగ్ చేస్తూ విద్యార్థులతోనూ, యువతీ యువకులతో మమేకమైపోతుంది. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నట్లు నేటి యువత నిస్తేజంగా..నిర్వేదంగా బతుకు బండి లాగించేస్తోంది. అటువంటి యువతలో చైతన్యాన్ని నింపే పని చేపట్టి ఇలా దేశవ్యాప్తంగా బైక్ రైడింగ్‌కు ఉపక్రమించింది.

05/28/2016 - 23:26

సీజన్‌లో మాత్రమే లభించే చింతచిగురులో రుచికి పుల్లగా ఉంటుంది. పోషక పదార్థాలతోపాటు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చింతచిగురు ఎంతగానో ఉపయోగిస్తుంది. అజీర్తిని తొలగించి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. నెత్తురు పట్టేలా చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లూ ఉంటాయి. కామెర్ల వ్యాధి నివారణకు సాయపడుతుంది. కడుపులోని నులిపురుగులను చంపేసి వ్యాధుల నివారణకు తోడ్పడుతుంది.

Pages