S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

04/30/2019 - 18:26

కొద్దిగా నీళ్లు, రెండు చెంచాల రాగిపిండి, ఓ బెల్లం ముక్క.. ఈ మూడింటితో తయారయ్యే రాగిజావ నిజంగానే ఆరోగ్య ప్రదాయిని. వేసవికాలంలో దీన్ని రోజుకోసారి తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతో పాటు మరెన్నో లాభాలు ఉన్నాయి.
* రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

04/29/2019 - 18:22

అమ్మను, ఆవకాయను మరువలేమనే తెలుగు నానుడి అందరికీ తెలిసిందే.. అక్షరమాలలోని ‘అ’ అమ్మ, ‘ఆ’ ఆవకాయ అని చెప్పుకునే రీతిలో మన జీవితాలతో పెనవేసుకుపోయిన నిత్య నూతన అరుణ వర్ణం మన అచ్ఛమైన తెలుగు ఆవకాయ. ఆవకాయని పప్పుతో కలిపి, దానికి కమ్మటి నెయ్యి జోడిస్తే, స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లుగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ, కందిపొడి కలిపి అమ్మమ్మ పిల్లలందరికీ ముద్దలు కలిపి పెడుతుంటే ఆహా...

04/26/2019 - 19:35

వేసవికాలంలో అనారోగ్య సమస్యలు అంటే.. ఫ్లూ, కళ్ల కలక, మీజిల్స్, దగ్గు, జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే మ రింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహార విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందువల్ల ఏది పడితే అది తింటే కడుపులో మంట, అజీర్తి సమస్యలు, వేడి చేసి మోషన్స్ వంటివి వేధిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం తినాలో తెలుసుకుందాం..

04/22/2019 - 19:25

వేసవి ఎండల్లో దాహానికి అందరూ మార్కెట్లో దొరికే పానీయాలను వాడతారు. కానీ పూర్వకాలం పెద్దవారు దాహానికి బార్లీ, సబ్బా, సగ్గుబియ్యం, దబ్బ ఆకులు, నిమ్మ ఆకులతో కుండల్లో వేసవి పానీయాలను తయారుచేసేవారు. మజ్జిగలో పంచదార వేసి స్వీట్ లస్సీ, నిమ్మకాయ లస్సీల్లా రకరకాల లస్సీలను తయారుచేసి పిల్లలకు తాగించేవారు. అలాగే పండ్లముక్కల్లో మీగడ పెరుగు వేసి పిల్లలు, పెద్దలు తినేవారు.

04/15/2019 - 23:07

తెలుగువారి శుభకార్యాల్లో అప్పడాలు, వడియాలు, ఒరుగులు, ఊరగాయలు.. తప్పనిసరి. ఒకవైపు ఎండలు, మరోవైపు పెళ్లిళ్లు.. అయినాసరే ఇంటింటా వడియాలు, అప్పడాల సందడే.. ఇక ఆలస్యమెందుకు.. మనం కూడా పెట్టుకుందాం వెరైటీ వడియాలు.. ఎర్రటి ఎండలో సూర్యుడికి నైవేద్యం పెడదాం.. ఆయన రుచి చూసి మనకు మరింత రుచిగా అందిస్తాడు.
*
తెలగపిండితో..
కావలసిన పదార్థాలు
తెలగపిండి: అరకప్పు

04/08/2019 - 19:48

వేసవి ముదురుతోంది. పిల్లలు, పెద్దలు ఎండల్లో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు వివిధ రకాల పానీయాలను సేవిస్తుంటారు. అలాంటిదే శ్రీరామనవమి రోజు తాగే పానకం కూడా.. కేవలం పండుగ రోజే కాదు.. వేసవిలో తరచూ ఆ పానకాన్ని తాగితే వడదెబ్బ తాకదు. శరీరంలోని వేడిని తగ్గించవచ్చు. మరి శ్రీరామనవమిరోజు చేసే
పానకంతోపాటు వివిధ రకాల పానీయాల (షర్బత్తుల) తయారీ చూద్దామా..

04/07/2019 - 22:26

కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం శరీరాన్ని పదిలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సీజన్‌లో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ముఖ్యం నీరు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటుంటే శరీరం నిర్జలీకరణ కాకుండా ఉంటుంది. అలాగే మసాలా ఆహారపదార్థాలను, వేడిచేసే ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల కడుపులో మంట వంటివి వస్తాయి. పైగా నీటిని తక్కువ తీసుకుంటూ, ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది.

04/01/2019 - 19:13

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితంలోని అన్ని అనుభవాలు కలిగినదైతేనే అర్థవంతం అని చేపే భావం ఇమిడి ఉంది ఇందులో.. ‘ఉగాది పచ్చడి’ ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన పదార్థం. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనమైన తీపి, పులుపు, కారం ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడిని తింటారు.

03/25/2019 - 19:19

ఒక్కోసారి కూరలు తినాలనిపించవు.. ముఖ్యంగా వేసవికాలంలో అన్నం సహించదు.. ఏ కూరలూ రుచించవు.. ఇలాంటి సమయాల్లో నోటికి కారంగా, కమ్మగా ఏదో తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు వేడివేడి అన్నంలో మనసుకు నచ్చిన పొడిని వేసుకుని, కాసింత నెయ్యి కలుపుకుని తింటే నోటికి ఎంతో రుచిగా అనిపిస్తుంది. అలాంటి రుచిని, ఆరోగ్యాన్ని అందించే రకరకాల పొడులను చూద్దామా..

తెలగపిండి

03/21/2019 - 22:05

పిల్లలకైనా, పెద్దలకైనా బిస్కెట్లు అంటే ఎంతో ప్రీతి.. సాయంత్రం వేళల్లో పాలతో కానీ, టీతో కానీ రెండు బిస్కెట్లు తింటే ఆ మజాయే వేరు. అవి ఇంట్లో చేసుకున్న బిస్కెట్లయితే మరింత మజా, ఆరోగ్యం కూడా.. మరి ఈ బిస్కెట్లను
ఇంట్లో ఎలా తయారుచేయాలో తెలుసుకుందామా..
*
టూటీ ఫ్రూటీ కుకీస్
కావలసిన పదార్థాలు
వెన్న: కప్పు
బేకింగ్ పౌడర్: చెంచా
యాలకుల పొడి: చెంచా

Pages