S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

04/30/2016 - 23:20

పాలు - 1 లీటరు
పంచదార - 1 కప్పు
ఏలకులు - 5
కొబ్బరి పాలు - 2 కప్పులు
కిస్‌మిస్ - 24
ముందుగా పాలు కాచి చల్లార్చి పంచదార, కిస్‌మిస్, కొబ్బరిపాలు చేర్చి జ్యూసర్‌లో త్రిప్పి ఐస్‌ఫ్రూట్స్ కోన్స్‌లో పోసి డీప్ ఫ్రిజ్‌లో పెట్టండి. తెల్లని పాల ఐస్‌ఫ్రూట్ రెడీ.

04/30/2016 - 23:18

మిల్క్ మెయిడ్ - 1/2 కప్పు
పాలు - 1/2 లీటరు
చాక్‌లెట్ పౌడర్ - 4 చెంచాలు
ఏలకులు - 5
లవంగాలు - 5
పంచదార - 1/2 కప్పు
జీడిపప్పు ముక్కలు - 12
కొబ్బరి - 2 చెంచాలు
తేనె - 1/2 కప్పు

04/30/2016 - 23:25

వేసవిలో ఐస్‌ఫ్రూట్స్ బండి గంట వినగానే పిల్లలు వారి వెనకాల, డబ్బులు పట్టుకుని పెద్దలు పరుగుపెట్టి తీరాలి. కడుపులో చల్లదనం కోసం ఐస్ ఫ్రూట్స్ పిల్లలతో పెద్దలు తినే అలవాటు కొందరికి. మిల్క్, చాక్‌లెట్, మ్యాంగో, ద్రాక్ష, పైనాపిల్, బాదం మిక్స్ ఐస్‌ఫ్రూట్స్ మనకు దొరుకుతాయి. వాటిని ఇంట్లో చేసుకుని పిల్లలు, పెద్దలు, అతిథులు అంతా ఇష్టంగా తినవచ్చును.
వీటిని ఐస్‌బార్స్ అని కూడా అంటున్నారు.

04/23/2016 - 23:15

ఏకాలంలోనైనా పెరుగు మన నిత్యజీవితం భాగ మవుతోంది. భోజనం చివరిలో పెరుగన్నం తినకపోతే కడుపు నిండినట్లు అనిపించదు. వేసవి కాలంలో దీనికి సంబంధించిన పదార్థాలు తీసుకుంటే కడుపు కాస్త చల్లగా ఉంటుది. ఇందులో సంపూర్ణ పోషక విలువలు వున్నాయ. వేసవిలో నిమ్మ మజ్జిగ, దబ్బ మజ్జిగ, దద్ద్యోజనం, పెరుగువడ, పొట్ల, ఆనప, తెల్ల గుమ్మడి, కొబ్బరి వంటి పెరుగు పచ్చళ్లు చేస్తూ ఉంటారు.

పుటికీలు

04/22/2016 - 22:15

మనం దైనందిన జీవితంలో రోజూ వివిధ రకాల పదార్థాలను ఆహారంగా తీసుకుంటాం. ఆహార పదార్థాల ఎంపిక కేవలం రుచి, ఆకలిపై ఆధారపడి ఉండకూడదు. శరీర పోషణకు అవసరమయ్యే పదార్థాలను గుర్తించి మెలగాలి. కొన్ని పదార్థాలు తీసుకోవడంలో కొందరు నామోషీ అనుకుంటారు. ఆ కోవకు చెందినవే పీచు పదార్థాలు. పీచు పదార్థాల ఆవశ్యకతను గుర్తించక అనారోగ్యం పాలవుతారు.

04/16/2016 - 22:10

మొలకలు నిత్యం తినడం మంచి ఆరోగ్యం. ప్రోటీన్ శాతం అధికం. ముఖ్యంగా పొట్టు పెసలతో వంటకాలు మంచి బలవర్ధకాలు. మొలకలు రుబ్బి వడలు, దోశెలుగా కూరగాయలతో వండితే మంచిది. పెసరట్లు అందరికీ తెలిసినవే. అల్లం, ఉల్లి, క్యారెట్, చల్లి రుచికరమైన వంటలుచేస్తారు. పొలిపుర్ణం, బూరెలు, బొబ్బట్లు, హల్వా, చంద్రకాంతలు, డోక్ల వంటివి చేసుకుంటే ఎంతో రుచి! వంటికి చలువ చేస్తుంది.

04/13/2016 - 22:07

తక్కువ ధరకు దొరికే పామాయిల్‌ని చిన్నచూపు చూడకండి. ఎన్నో రకాల పోషకాలతోపాటు ఫ్యాటీ ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లతోపాటు కేన్సర్, బి.పి వంటి జబ్బుల్ని తగ్గించే విటమిన్ ఇ ఇందులో సమృద్ధిగా లభిస్తుంది. హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగిన మోతాదులో వుంటూ శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరకుండా సహాయపడుతుంది.

04/13/2016 - 04:44

జామకాయ పేదవాడి ఆపిల్‌గా పేరుపడింది. ఆరోగ్యానికి ఈ ఫలాహారం చాలా మంచిదని న్యూట్రిషన్లు చెప్తారు. అందులోనూ జామకాయ ఆరోగ్యానికి, అందానికి కూడా అద్భుతమైన ఫలం. జామపండులో వున్న విటమిన్ ఎ, సిలు మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు జామకాయ ఒక వరం లాంటిదని చెప్పాలి.

04/10/2016 - 00:22

శ్రీరామనవమినాడు ప్రతి ఇంట పానకం, వడపప్పు, పిండి వంటలు ఉంటాయ. పెసరపప్పు వంటలు తప్పనిసరి. బొబ్బట్లు, పాయసం, పులిహోర, కమ్మని పెసరగారెలు, బూరెలు రకరకాల పిండి వంటలు నివేదన చేస్తారు. దీనివల్ల ఆయురారోగ్య
ఐశ్వర్యాలు, శాంతి సౌఖ్యం లభిస్తాయని పెద్దల చెబుతారు.

ఖర్జూరం బొబ్బట్లు

04/08/2016 - 21:13

ఖర్జూరపు పండ్లను చూస్తే నోరూరని వారుండరేమో! ఇసుక ఎడారులలో పుట్టిన ఈ అమృత ఫలాలు, కేవలం రుచికే ప్రాశస్త్యం కాదు. అసంఖ్యాకమైన పోషక విలువలను తనలో దాచిన ఖర్జూరం తింటే ఆరోగ్య సమస్యలు మీకు సలామ్ చేసి పారిపోతాయి. ఖర్జూరపు పండ్లు కలిగించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే అవి మీకు నేస్తాలుగా మారతాయి. తాజా పండ్లను తినటం లేదా సలాడ్స్‌లో కలిపి తింటే కూడా చాలా మంచిది.

Pages