S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాస్కర వాణి

09/07/2018 - 00:09

ఐదేళ్ల వెండితెర ఎప్పుడు మూతబడుతుందా? అని ఎదురుచూస్తున్న రాజకీయ ప్రేక్షకులకు కేసీఆర్ ‘శతాభిషేకం’ చేసుకొనే భారీ చిత్రం ఎట్టకేలకు విడుదల చేశారు. తెలంగాణలో రాజకీయ పితలాటకం ముగియగానే, వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టుమీద దాచుకొన్న అస్త్రాలన్నీ ఒక్కొక్కటీ బయటకు తీస్తున్నారు.

08/31/2018 - 00:19

అధి బ్రిటీషు ప్రభుత్వం అతివాద స్వాతంత్య్రవీరులపై ఉక్కుపాదం మోపుతున్న రోజులు. ఓ కుట్ర కేసులో రాంప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరీ, అష్ఫఖుల్లా ఖాన్‌లను 1927 డిసెంబర్ 19న ఉరితీయాలన్న తీర్పు వెలువడింది. ఈ సందర్భంగా అష్ఫఖుల్లా తన స్నేహితులకు, కుటుంబానికి- ‘నేను బలిపీఠంపై నిలబడి ఇది రాస్తున్నాననడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నాకు చాలా తృప్తిగా ఉంది.

08/23/2018 - 23:37

అమెరికాలో ఉన్న తమ కొడుకును చూద్దామని ఓ వృద్ధ దంపతులు అక్కడికి టూరిస్ట్ వీసాపై వెళ్లారట. అక్కడే ఉద్యోగం చేస్తున్న ఆ కొడుకు స్నేహితుడు తల్లిదండ్రులతోపాటు భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. వాళ్లింట్లో భోజనం ముగించి, చేయి కడుక్కునేటపుడు తండ్రి చెవిలో కొడుకు మెల్లగా- ‘నాన్నా! మనం వీళ్లింట్లో భోజనం చేసినందుకు మా స్నేహితుడికి థాంక్స్ చెప్పు’ అన్నాట్ట. వెంటనే ఆ పెద్దాయన ‘బాబూ!

08/17/2018 - 00:18

కాంగ్రెస్ ఫార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన తెలంగాణ కాంగ్రెస్ నేత ల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. 2014 నుండి కేసీఆర్ వరుస వ్యూహాలతో కుదేలవుతున్న కాంగ్రెస్‌కు రాహుల్ పర్యటన కొత్త జవజీవాలను అందించిందని చెప్పలేం గాని సామాన్య కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు కావలసినంత సంతోషం ఇచ్చింది.

08/09/2018 - 23:30

మహాభారత యుద్ధం తీవ్రంగా సాగుతుండగా- అభిమన్యుడి మరణంతో హతాశుడైన అర్జును డు సైంధవుడిని వధిస్తానని శపథం చేస్తాడు. ఆ శపథం ప్రకారం శ్రీకృష్ణుని సహాయంతో ‘సైంధవ వధ’ జరిగింది. దీంతో దుర్యోధనుని దురభిమానం దెబ్బతిని కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుని నిందించడం మొదలుపెట్టాడు. ‘పాండవ పక్షపాతి, తేనె పూసిన కత్తి’ అంటూ గురునిందకు పాల్పడ్డాడు. దాంతో మరుసటి రోజు యుద్ధంలో ద్రోణుడు శర పరంపరతో రెచ్చిపోయాడు.

08/03/2018 - 00:11

ఒకప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి ‘జనసంఘ్’లో, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో ఒక నిబద్ధుడైన కార్యకర్త ఉండేవాడు. ఆయన పేరు దారపనేని కోటేశ్వరరావు. మంచి విద్యావంతుడు. రైతులకు సంబంధించిన అనేక విషయాలు కూలంకషంగా చెప్పగల వ్యక్తి. ఆ జిల్లాలో భాజపా ఎదుగుదలకు అంతగా అవకాశం లేకున్నా, నిబద్ధుడైన కార్యకర్తగా ఆయన నిలబడ్డాడు. ‘కమ్యూనిస్టుల కోట’లో భాజపా సిద్ధాంతాల కోసం పనిచేశాడు.

07/26/2018 - 23:17

రష్యా శాస్తవ్రేత్త, వ్యోమగామి యూరీ గగారిన్ ప్రపంచంలోని విజ్ఞానవేత్తల్లో ప్రసిద్ధుడు. బహుశా చంద్రుడిని అతి దగ్గరగా, భూమిని అత్యంత దూరం నుంచి చూసినటువంటి మొట్టమొదటి వ్యోమగామి ఆయనే. భూమికి తిరిగివచ్చి ఆశ్చర్యంతో యూరీ ఒక ప్రకటన చేశాడు. ఆ క్షణంలో భూమి కొంతభాగం సోవియట్ రష్యాగా, కొంతభాగం అమెరికాగా, కొంతభాగం భారత్‌గా, కొంతభాగం చైనాగా కనిపించడం చూసి ఆశ్చర్యపోయానని అన్నాడు.

07/19/2018 - 22:52

ఒక పిచ్చివాడు దున్నపోతు ఎక్కి వెళ్తున్నాడట. మరో పిచ్చివాడు అది చూసి-‘ఒరేయ్! నువ్వు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం ఎంత ప్రమాదమో తెలుసా?’ అన్నాడట. పోలీసులు చూస్తే నీకు ఫైన్ కూడా వేస్తారన్నాడు. వెంటనే దున్నపోతుపై ఉన్న పిచ్చివాడు ‘లేదురా! దీనిపై ఎక్కితే హెల్మెట్ అవసరం లేదు.. కిందకు చూడు ఇది ఫోర్ వీలర్’ అన్నాట్ట. మన దేశంలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం ఈ సంభాషణ లానే వుంది.

07/12/2018 - 23:08

‘అవతారం’ అనే మాటకు ‘పైనుండి క్రిందకు రావడం’ అని అర్థం. శ్రీరాముడిగా విష్ణువే భువిపైకి వచ్చాడని హిందువుల విశ్వాసం. భగవంతుడు సాధారణ మానవుడిగా అవతరించి జీవిస్తే ఎలా వుంటుందో వాల్మీకి ఈ లోకానికి తెలపాలనుకొన్నాడు. అందుకే రాముడిని కథానాయకుడిగా ఎన్నుకొన్నాడు. శ్రీ రాముని గుణాల్లో అత్యుత్తమైనవి వాల్మీకి మహర్షిని ఆకర్షించాయి. అందుకే రామాయణం ప్రారంభంలో 24 శ్రీరాముని ఉత్తమ గుణాలు ప్రస్తావించబడ్డాయి.

07/05/2018 - 23:49

లంకలోని అశోకవనంలో ఛింతిస్తూ సీతాదేవి కూర్చుంటే రోజూ ఉదయానే్న రావణుడు తన మందీ మార్బలంతో అక్కడికి వచ్చి- ‘నన్ను పెళ్లిచేసుకో’ అని ఆమెను కోరేవాడు. సీత మాత్రం రావణుని వైపు కనె్నత్తి చూడకుండా గడ్డిపరకను ముందు పెట్టుకొని మాట్లాడేది. దీంతో సీతను లొంగదీసుకోలేకపోయానని రావణుడు ఓ రోజు దీనంగా కూర్చున్నాడు. భార్య మండోదరి రావణుడి వద్దకు వచ్చి తానో ఉపాయం చెప్తానని అన్నది. రావణుడు ఆశగా భార్య వైపు చూశాడు.

Pages