S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాస్కర వాణి

08/23/2019 - 02:09

కశ్మీర్‌లో 370, 35ఎ రద్దు తర్వాత సగటు భారతీయులంతా ఉద్విగ్నతకు లోనయ్యారు. ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల ‘గ్రాఫ్’ ఆకాశమంత ఎత్తుకు చేరింది. ఈ ఇద్దరూ అవలంబించిన ‘స్ట్రాటజీ’ వారి చాణక్యాన్ని మరింత రాటుదేల్చి దేశ ప్రజల్లో వారి పట్ల అభిమానం పెరిగింది. ఇప్పటివరకూ పార్లమెంటు లోపలా బయటా మోదీ ప్రసంగాలను మాత్రమే జనం సీరియస్‌గా విన్నారు.

08/16/2019 - 02:05

మోదీ ప్రభుత్వం కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దుచేయగానే మన ప్రతిపక్షాలతో పాటు దాయాది దేశమైన పాకిస్తాన్ ఆందోళన ప్రకటించింది. పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశం ఏర్పరచి, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొన్ని దుర్వ్యాఖ్యలు చేశాడు. పాక్ ప్రధాని నుండి అంతకన్నా ఎక్కువ ఆశించలేం. ‘్భరత్‌లో భాజపా ప్రభుత్వం నాజీ మనస్తత్వం వున్న ఆర్‌ఎస్‌ఎస్ హిందూ ఆధిపత్య భావజాలంతో పనిచేస్తోంది.

08/08/2019 - 22:42

‘దేశం బతికున్నపుడు నీవు మరణిస్తే కలిగే నష్టం ఏమిటి? నీ దేశం సర్వనాశనమైపోతుంటే నీవు జీవించి ఉండి ప్రయోజనం ఏంటి?’- ఇలాం టి నినాదాలు స్వాతంత్య్ర సమరంలో ఉండేవి. నిజమే! డెబ్భై ఏళ్ళ నుండి దేశాన్ని నాశనం చేస్తున్న రాచపుండుకు మందు వేస్తుంటే- కొందరికి కడుపులో రగులుతున్న ‘రాజకీయ మంట’ను చూసి ఈ తరం నవ్వుకుంటున్నది. 370, 35ఏ ఆర్టికళ్ల రద్దు, కశ్మీర్‌ను విభజించడం- ఈ రెండూ సాహసోపేత నిర్ణయాలే.

08/02/2019 - 02:00

ఇటీవల ఓ వ్యక్తి అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కాడు. దివంగత రాజీవ్ గాంధీ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసి, రాజీనామా చేసి బయటకొచ్చి ‘జాతీయవాద ముస్లిం’గా తన భావాలను స్వేచ్ఛగా ప్రకటించిన నేత ఆరీఫ్ మహమ్మద్ ఖాన్. ఇందిరా గాంధీ మరణానంతరం అఖండ మెజారిటీతో అధికార పీఠం ఎక్కిన రాజీవ్ గాంధీకి- కాంగ్రెస్‌ను తన చేతులతో పెంచాలన్నా, ముంచాలన్నా.. రెండు అవకాశాలు ముందు నిలబడ్డాయి.

07/26/2019 - 02:19

ప్రముఖ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిని ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ- ‘‘మనం ఎన్నో క్రిమికీటకాలను చంపుతున్నాం కదా! దానిపై మీ అభిప్రాయం ఏమిటి?’’ అన్నాడట. ‘‘యుద్ధాల పేరుతో సాటి మనిషిని చంపేవారు ఇంత సున్నితంగా ఎలా ఆలోచించగలుగుతారు? స్వయంగా మీరే ఆ పని చేయకున్నా, అలాంటి చర్యలకు అనేక విధాలా సహకరించే మీరు క్రిమికీటకాల గురించి ఎంత బాధపడిపోతున్నారండీ?

07/19/2019 - 02:33

ఈ దేశంలో గత డెబ్బయి ఏళ్ళ నుండి ‘లెఫ్ట్ లిబరల్ మీడియా’ ప్రజల మేధస్సును పాలిస్తోంది. వాళ్ళు చెప్పిందే వార్త. కానీ నేడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, సోషల్ మీడియా అవతారం విస్తృతంగా, విశృంఖలంగా కొనసాగుతున్నది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, టిక్‌టాక్.. వంటివి ఇపుడు జనం చేతిలోకి వెళ్లాయి.

07/12/2019 - 02:06

‘‘ఈ ఎన్నికల్లో మనం పోరాడింది ఒక పార్టీతో కాదు.. నిష్పాక్షిక వ్యవస్థలుగా మనం కీర్తించుకుంటున్న సంస్థలన్నింటినీ విపక్షాలపైకి ఎక్కుపెట్టారు.. అన్ని వ్యవస్థలనూ భాజపా, ఆరెస్సెస్ పూర్తిగా ఆక్రమించి ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరిచాయి’’-అంటూ గత వారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘కాడి’ కిందపడేసి వెళ్లిపోయాడు. దీన్ని కొందరు ‘త్యాగం’గా చిత్రీకరిస్తే, మరికొందరు ‘వ్యూ హం’గా చెప్తున్నారు.

07/05/2019 - 02:08

‘‘రాజకీయ వేదికపై ఆక్రమించుకొన్న స్వార్థపరుల గుంపునుండి మన పార్టీని వేరుగా ప్రజలు భావించగలగాలి. పదవులను చేజిక్కించుకోవడమే మన లక్ష్యంగా వారు భావించకూడదు. మనది కొన్ని విలువల, సూత్రాలపై ఆధారపడి వున్న రాజకీయ పార్టీగా వారు గుర్తించాలి. పదవులు, హోదాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం ఉన్మాదంగా ఎగబడేవారికి భాజపాలో స్థానం లేదు.

06/21/2019 - 02:05

‘రాజదండం మట్టిగరిచినపుడు ధర్మదండం దానిని ఉద్ధరిస్తుంది’ అనే మాటను ఓ గొప్ప తత్త్వవేత్త చెప్పాడు. హిందూ ధర్మం ధార్మిక లక్షణాలను పుణికిపుచ్చుకొన్నది. అందుకే శ్రీరాముడిని ధర్మస్వరూపంగా, గోవును ధర్మ స్వరూపంగా చెప్తూ వచ్చారు. దేనివల్ల సమాజానికి ఆధ్యాత్మిక ప్రవేశం కలుగుతుందో అదంతా ధర్మమే. ఈ ధర్మ స్వరూపానే్న కొందరు ‘హిందుత్వ’ అంటారు. ఇంకొందరు సనాతన, వైదిక, ఆర్య.. వంటి పేర్లతో పిలుస్తారు.

06/14/2019 - 01:51

‘దేశవ్యాప్తంగా ఐక్యతతో జీవిస్తున్న ప్రజానీకం మధ్య మతం,కులం,జాతి,ప్రాంతం అంటూ విభజన రేఖలను సృష్టించి, భయోత్పాత వాతావరణానికి హిందుత్వ కారణమవుతోంది.. ఇపుడు లౌకికవాదం వర్సెస్ హిందుత్వ అనే అంశంపై చర్చ జరగాలి.. మా పార్టీ లౌకిక భావాల రక్షణ కోసం పోరాడుతుంది.. మతోన్మాదుల చేతిలో ఈ దేశం ఉండడం అత్యంత ప్రమాదకరం’- ఈ అమృతవాక్కులు వెలువడింది సిపిఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నోటి నుండి..!

Pages