S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాస్కర వాణి

07/12/2019 - 02:06

‘‘ఈ ఎన్నికల్లో మనం పోరాడింది ఒక పార్టీతో కాదు.. నిష్పాక్షిక వ్యవస్థలుగా మనం కీర్తించుకుంటున్న సంస్థలన్నింటినీ విపక్షాలపైకి ఎక్కుపెట్టారు.. అన్ని వ్యవస్థలనూ భాజపా, ఆరెస్సెస్ పూర్తిగా ఆక్రమించి ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరిచాయి’’-అంటూ గత వారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘కాడి’ కిందపడేసి వెళ్లిపోయాడు. దీన్ని కొందరు ‘త్యాగం’గా చిత్రీకరిస్తే, మరికొందరు ‘వ్యూ హం’గా చెప్తున్నారు.

07/05/2019 - 02:08

‘‘రాజకీయ వేదికపై ఆక్రమించుకొన్న స్వార్థపరుల గుంపునుండి మన పార్టీని వేరుగా ప్రజలు భావించగలగాలి. పదవులను చేజిక్కించుకోవడమే మన లక్ష్యంగా వారు భావించకూడదు. మనది కొన్ని విలువల, సూత్రాలపై ఆధారపడి వున్న రాజకీయ పార్టీగా వారు గుర్తించాలి. పదవులు, హోదాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం ఉన్మాదంగా ఎగబడేవారికి భాజపాలో స్థానం లేదు.

06/21/2019 - 02:05

‘రాజదండం మట్టిగరిచినపుడు ధర్మదండం దానిని ఉద్ధరిస్తుంది’ అనే మాటను ఓ గొప్ప తత్త్వవేత్త చెప్పాడు. హిందూ ధర్మం ధార్మిక లక్షణాలను పుణికిపుచ్చుకొన్నది. అందుకే శ్రీరాముడిని ధర్మస్వరూపంగా, గోవును ధర్మ స్వరూపంగా చెప్తూ వచ్చారు. దేనివల్ల సమాజానికి ఆధ్యాత్మిక ప్రవేశం కలుగుతుందో అదంతా ధర్మమే. ఈ ధర్మ స్వరూపానే్న కొందరు ‘హిందుత్వ’ అంటారు. ఇంకొందరు సనాతన, వైదిక, ఆర్య.. వంటి పేర్లతో పిలుస్తారు.

06/14/2019 - 01:51

‘దేశవ్యాప్తంగా ఐక్యతతో జీవిస్తున్న ప్రజానీకం మధ్య మతం,కులం,జాతి,ప్రాంతం అంటూ విభజన రేఖలను సృష్టించి, భయోత్పాత వాతావరణానికి హిందుత్వ కారణమవుతోంది.. ఇపుడు లౌకికవాదం వర్సెస్ హిందుత్వ అనే అంశంపై చర్చ జరగాలి.. మా పార్టీ లౌకిక భావాల రక్షణ కోసం పోరాడుతుంది.. మతోన్మాదుల చేతిలో ఈ దేశం ఉండడం అత్యంత ప్రమాదకరం’- ఈ అమృతవాక్కులు వెలువడింది సిపిఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నోటి నుండి..!

06/07/2019 - 01:50

గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస భారీ విజయం సాధించాక కేసీఆర్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసారు. ‘జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతారట కదా!’- అన్న పాత్రికేయులకు సమాధానం చెప్తూ ‘చంద్రబాబు నాయుడుకు రెండు హిం దీ ముక్కలు సక్కగ మాట్లాడనీకె రాదు; ఏం చెక్రం దిప్పుతడయా? ఊకెనె దిరుగుతాది చక్రం?’’ అని వ్యంగ్యంగా అన్నారు. పాత్రికేయులు, అక్కడున్న వాళ్లంతా గొల్లున నవ్వారు. నిజమే!

03/08/2019 - 01:45

‘ధ్వనికి ప్రతిధ్వని తప్పదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఈ రోజు నేను ఒక వ్యక్తిపై ఎమోషన్స్ వెళ్లగక్కితే, మళ్లీ నాకు అవి ఒక రోజు తప్పవు’ - అని ఓ ప్రసిద్ధ మానసిక తత్వవేత్త అన్నారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే అలాంటి ఎమోషన్స్ రెచ్చగొట్టి ఎన్నికల్లో విజయం సాధించాలని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సర్వే సర్వత్రా విన్పిస్తున్నమాట.

03/01/2019 - 01:41

భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్షగోయెంకా సోషల్ మీడియాలో ఓ ఫొటోను ట్వీట్‌చేసాడు. అది చాలా ఆసక్తికరంగా ఉంది. గుజరాత్‌లోని మీరట్ పట్టణంలో ఓ ధనవంతుల పెళ్లి ఊరేగింపు చాలా అంగరంగ వైభవంగా సాగుతున్నది. పెళ్లికొడుకు గుర్రంపై ఎక్కి ఊరేగింపుగా వస్తున్నాడు. అయితే విచిత్రంగా ఆ పెళ్లి కుమారుడికి ఓ శవయాత్ర ఎదురయ్యింది. శవం అడ్డురావడం శకునాల్లో మంచిదంటారు.

02/15/2019 - 01:23

పృథ్వీరాజ్ చౌహాన్ మన దేశంపైకి దండెత్తి వచ్చిన మహమ్మద్ ఘోరీని పదహారుసార్లు క్షమించడం నిర్హేతుకం. పదిహేడవసారి అతనికి అవకాశం దొరికింది. దాంతో ఈ దేశంలో విదేశీ శక్తులకు సంపూర్ణంగా బీజం పడింది. ఆనాటి నుండి భారత్ అనేక యుద్ధాలను ఎదుర్కొన్నది. ఇక్కడున్న హిందూ సమాజం మతపరమైన దమనకాండను తట్టుకొని అస్తిత్వాన్ని నిలబెట్టుకొంది.

02/08/2019 - 03:15

ఓ కుమారుడు తండ్రిని- ‘నాన్నా! ఒట్టు అంటే ఏంటి?’ అని ప్రశ్నించాడట. ‘పచ్చి అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు తరతరాలుగా వాడుతున్న టెక్నిక్‌రా కన్నా!’ అన్నాట్ట ఆ తండ్రి. మన దేశంలో అబద్ధాన్ని అతికినట్లు చెప్పేందుకు ఓ వర్గం మీడియా, దాని వెనుకున్న రాజకీయ వర్గాలు పడరాని పాట్లు పడుతున్నాయి. దొంగే ‘దొంగా దొంగా!’ అని అరుస్తుంటే నోళ్లువెళ్లబెట్టి చూడటం తప్ప ఇంకేం చేయలేని దుస్థితి.

01/31/2019 - 22:55

ఇజ్రాయిల్ స్వతంత్ర దేశంగా ఏర్పడ్డాక అక్కడి ప్రజాప్రతినిధుల మొదటి సభ ఓ ఆశ్చర్యకరమైన వ్యాఖ్య చేసింది. ‘్భరత్‌కు ధన్యవాదాలు.. ప్రపంచంలోని అన్ని వర్గాలచే అత్యాచారానికి గురైన మా జాతి, ఒక్క భారత్ నుండే అలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు..’ అన్న ఆ మాటను ఒక్కసారి- భారత్‌ను, హిందుత్వను ధ్వంసం చేయాలనుకొనే శక్తులు గుర్తుతెచ్చుకోవాలి.

Pages