S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/05/2016 - 21:32

అచ్చు జిలేబీలా నోరూరించే ఈ జంగిల్ జిలేబీని చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకోనివారు ఎవరుంటారు.వీటిలోని గుజ్జు గులాబీ, ఎరుపు రంగుల్లోనేకాక మంచు వెనె్నలలా తెల్లగా ఉంటుంది. గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా, పొలం గట్లపై కనిపించే ‘సీమ చింతకాయ’ చెట్లు ఎలాంటి వాతావరణంలోనైనా మనగలుగుతాయి. వేడిని తట్టుకోగలగడం, ఎక్కువ రోజులు తాజాగా ఉండగలగడంతో సీమచింతకాయలు పట్టణ ప్రజలకు చేరువవుతున్నాయి.

04/02/2016 - 19:12

క్రింది దవడ కుడివైపు వాపు, నోరు తెరవలేనంత నొప్పి, ఇది ఒక పేషంట్ పడుతున్న బాధ. నొప్పితో కూడుకున్న పని అయినా అతని నోరు తెరచి పరీక్షించాల్సి వచ్చింది. క్రింద దవడ కుడివైపు ఉన్న ఆఖరి దంతం అడ్డంగా పడుకుని ఉన్నట్టు ఉంది. దానిమీద వాచిన చిగురు ఎర్రగా ఉంది. మందులు వాడి రెండు రోజుల తర్వాత వస్తే ఆ పన్ను తీసేద్దాం అని చెప్పా. ఆ పేషెంట్ తండ్రి తన జేబులోనుండి ఒక చీటి తీసి నాకు ఇచ్చాడు.

04/01/2016 - 23:59

ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని యుక్తవయసు ప్రారంభ దశలో వున్న విద్యార్థినులను అవకాశం చూసి కాటేయడానికి మేక తోలు కప్పుకున్న పులుల్లా వ్యవహరిస్తూ ప్రేమ, స్నేహం అంటూ బాలికలు నయవంచకుల వలలో చిక్కుకొని విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్న దృశ్యాలు నిత్యం అనేక ఛానళ్ళలో తిలకిస్తున్నాం, అనునిత్యం దినపత్రికల్లో పతాక శీర్షికల్లో చదువుతూనే ఉన్నాము.

03/31/2016 - 23:17

కనుమరుగవుతున్న ప్రాచీన క్రీడకు ఆమె ప్రాణం పోస్తుంది. ధైర్యానికి నిర్వచనం, ఆత్మస్థైర్యానికి నిదర్శనం. నమ్మకం అనే పునాదిపై ‘కలరిపయట్టు’కు పునర్ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ఆ క్రీడను అక్కున చేర్చుకుంది. చిన్ననాటి కలను సాకారం చేస్తూ గత 67 సంవత్సరాలుగా ఆమె తీవ్రంగా కృషి చేస్తున్నారు. దేహధారుఢ్యం, ఆత్మరక్షణలకు సంబంధించి ఎన్నో ప్రాచీన క్రీడలు మన దేశంలో వున్నాయి.

03/30/2016 - 23:02

‘‘మంచి ఉపాధ్యాయుడు సామాజిక వైద్యుడు’’ అని అంటారు. ఎగిరే గాలిపటానికి ఆధారం దారం ఎలాగో విద్యార్థులకు నైతిక విలువలు నేర్పే గురువు అలాంటివాడు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించే గురువుఆదర్శ సమాజ నిర్మాతగా మనగలుగుతాడు. పసి మనసులో గురువునాటే బీజాలే వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది. దీనిని ఆచరణలో చేసి చూపెట్టారు హానాను అల్ హ్రాబ్.

03/29/2016 - 21:09

ఈ సృష్టిలో బుద్ధిజీవి అయిన ప్రతి మనిషిలోనూ శక్తి సామర్థ్యాలకు ఏ మాత్రం కొదవలేదు. కాకుంటే అది ఏ పనిలో, ఏ రంగంలో, ఎంత శాతం అన్నది మాత్రం వాళ్ళ వాళ్ళ అభిరుచి, తెలివితేటలు, సాధన బట్టి విభిన్నంగా ఉంటుంది. కొంతమంది శారీరక శక్తిని ఉపయోగించి యుక్తితో కొన్ని పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ వుంటారు.

03/25/2016 - 20:58

ఉగ్రవాదం, శాంతి భద్రతల సమస్యకు నెలవైన జమ్ము-కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో నిరుపేద పిల్లలను విద్యావంతులను చేయడానికి కంకణబద్ధురాలై ఆమె నిర్విఘ్నంగా అక్షర యజ్ఞం చేస్తోంది. బెంగళూరులో మంచి జీతభత్యాలున్న ఉద్యోగాన్ని వదులుకుని సబహ్ హాజీ (30) తన సొంత ఊరైన బ్రెస్వానాకు చేతనైనంత సాయం చేద్దామని దీక్ష వహించింది. అక్షర కాంతులు ప్రసరిస్తేనే పల్లెలు ప్రగతి దారిలో పయనిస్తాయని ఆమె నిరూపించింది.

03/24/2016 - 22:44

‘ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న’ది పాత మాట. రాబోయే ఆ ఎవరి కోసమో ఎదురుచూస్తూ మనం ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం తెలివి తక్కువతనం. ఏ విషయంలోనయినా, ఎవరి విషయంలోనయినా ఈ మాటలు వర్తిస్తాయి. స్ర్తిల విషయంలోనే చూడండి..

03/23/2016 - 23:29

అనాథాశ్రమాల్లో జీవిత చరమాంకాన్ని గడుపుతున్న వృద్ధ వితంతువులు తొలిసారిగా ఆలయ ప్రాంగణంలో హోలీ వేడుకల్లో పాల్గొని ఆనందోత్సాహాలను పంచుకున్నారు. శతాబ్దాల తరబడి కొనసాగుతున్న మతపరమైన కట్టుబాట్లను ఛేదించి, హోలీ నాడు వేలాదిమంది వితంతువులు బృందావనం (యుపి)లోని గోపీనాథ ఆలయంలో రంగులు చల్లుకుని సంబరాలు చేసుకున్నారు.

03/22/2016 - 21:37

పండుగలు కొన్ని మతపరమైనవి మరికొన్ని మతేతరమైనవి. మన దేశంలో ప్రజలందరు కలసిమెలసి జరుపుకొనే పండుగలు అనేకం ఉన్నాయి. వాటిలో హోలీ ఒకటి. కుల, మత, ధనిక ,పేద అనే బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగే హోలీ పండుగ.
‘‘హోలీ’’ సరదాల పండుగ. జీవితోత్సాహాన్ని పునరుద్ధరించే పండుగ.
‘‘ఇది హోలీ! సోదరా! ఇది హోలీ!
హోలీ తల్లి! నీకు ఆశీర్వచనాలతో
మా పిల్లలు కలకాలం మనుతూ ఉండాలి!’’

Pages