S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

04/23/2018 - 21:51

మామూలు కోపం లెక్కలోకి రాదు. ఆ కోపంలో ముక్కంటి కంటిమంట వేడివేడిగా ప్రజ్వరిల్లాలి. త్రిశూలంపై మొనలా, కొనలా, వాడివాడిగా, భయం భయంగా ఆ కోపం గుచ్చుకోవాలి. అప్పుడే శత్రువు తోక ముడుస్తాడు. ఇంత మేలుకొలుపు ఈ అక్షరాలలో గాఢంగా ఉన్నది. అంతేకాదు-
‘‘దారి తప్పిన బాటసారుల కొరకు
దారిగానని పేదవారల కొరకు
వెలిగించు కాగడా! వెలిగించవోయి..’’

04/22/2018 - 22:09

దేవులపల్లి వారి తరువాత ఆ స్థానం వేదులవారినే వరించింది. ఆయనకంటె ఈయన మూడేళ్లు చిన్న. కృష్ణశాస్ర్తీ ప్రభావం వేదులమీద ప్రసరించినా- ఎవరి కలం వారిదే- ఎవరి గళం వారిదే. పద్యం చదివినా- పాటపాడినా-వేదుల స్వరముద్రకు నీరాజనం పట్టవలసిందే. కవితాగానం చేయటంలో కృష్ణశాస్ర్తీలా వేదుల కూడా మనోజ్ఞమైన శైలిని సొంతం చేసికొన్నారు. ఉపన్యసించినా అంతే! అది చమత్కారభరితమై ఉర్రూతలూగించేది.

04/20/2018 - 22:02

ఇలా ఎన్నో కవితా ప్రక్రియలు ఆయనలో ఉద్దీపన చెందాయి. ప్రక్రియలే అలా వుంటే ఆయన నేర్చిన భాషలూ అలాగే ఉన్నాయి. సంస్కృతం, హిందీ, బెంగాలీ భాషలలో ఆయన ప్రావీణ్యం సంపాదించగలిగారు. రవీంద్రుని కవితలు, బెంగాలీ నవలలు తర్జుమా చేశారు. ఏడు పదుల వయసులో కూడా వంగని హరివిలై ఒకానొక వంగ రచనకు అనువాద భిక్షనందించారు.

04/19/2018 - 22:06

గోధుమరంగు పంచెపై - మావిచిగురు అంచు...
దానిపై గౌతమీ నదిలా.. తళతళలాడే తెల్లటి చొక్కా...
ఆ రెండింటికి మరింత అలంకారంగా నల్లగా ఆ మనీషి..
మావిచిగురు - నలుపు- అనే పదాలు వినిపించేసరికి మనకేదో గుర్తుకు రాకమానదు.
అది తప్పనిసరిగా కోకిలే కావాలి.
అందులోను అది మామూలు కోకిలైతే వసంతం వాడిపోగానే మరచిపోతాం. కాని అది గౌతమీ కోకిల.

04/18/2018 - 21:16

భావములోను, భాషలోను పాత పాటలలోని యాస, స్వచ్ఛత కొత్త పాటలలో కొరవడ్డాయి. ఈ మార్పును సమర్థించుకుంటూ శ్రీ నండూరివారు ‘‘ఏ యెడను మార్పు సహజం. మార్పు గుణమున కాయెనా, దోషమున కాయనా, అను విషయమును సహృదయ లోకమే నిర్ణయించాలి’’ అని తమ కొత్త పాటల పీఠికలో విన్నవించుకున్నారు.

04/17/2018 - 22:06

వివాహానంతరం కొత్త దంపతులు చేసే తీర్థయాత్రల ప్రస్తావన కూడా యెంకి పాటల్లో కనిపిస్తుంది.
‘‘ఆవుల్ని దూడల్ని అత్తోరి కాడుంచి
మూటముల్లీ గట్టి ముసిలోల్లతో సెప్పి
యెంకీ నాతోటి రాయే- మన
యెంకటేశరుణ్ణి యెల్లి సూసొద్దాము’’-
‘‘ఆడనీ సుక్కాని రుూడనే గెడ యేసి
పడవెక్కి బద్రాద్రి పోదామా
బద్రాద్రి రాముణ్ణి సూదమా’’
‘‘యెంకితో తీర్తానికెల్లాలి

04/16/2018 - 21:44

శ్రీ నండూరి వారి యెంకి పల్లెపడుచు. ప్రకృతి సహజమైన జానపద సౌందర్యానికి ప్రతీక. ధర్మబద్ధమైన ప్రణయాన్ని మాత్రమే అంగీకరించే నాయిక. అందుకనే-
‘‘కన్ను గిలికిస్తాది, నన్ను బులిపిస్తాది
దగ్గరస కూకుంటె, అగ్గి సూస్తాది’’
అంటూ ఆమె హావభావాలను వర్ణిస్తారు శ్రీ నండూరి.
‘‘యెంకి వంటి పిల్ల లేదోయి, లేదోయి
యెంకి నా వంకింక రాదోయి, రాదోయి
మెళ్లో పూసల పేరు, తల్లో పూవుల సేరు

04/15/2018 - 22:14

ఆధునికాంధ్ర కవిత్వం మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఈ ప్రభావంవల్లనే మన తెలుగు సాహిత్య నందనంలో ఎన్నో సరికొత్త పోకడలు పల్లవించాయి. ప్రధానంగా ఆంగ్ల సాహిత్యంలోని రొమాంటిక్ పొయట్రీ అంటే కాల్పనిక కవిత్వ ప్రేరణతో ఆంధ్ర సాహిత్యంలో భావకవిత్వ ప్రభలు శ్రీకారం చుట్టుకున్నాయి.

04/15/2018 - 02:32

1940లో బెజవాడలో జరిగిన నవ్య సాహిత్య పరిషత్తు సప్త సమావేశానికి అధ్యక్షత వహించి ఉపన్యసించిన విశ్వనాథ సత్యనారాయణగారు గాని, తొలిసారిగా 1942లో నవ్య సాహిత్య చరిత్రను నవ్యాంధ్ర సాహిత్య వీధులు పేరిట పుస్తకంగా వెలువరించిన ఆచార్య కురుగంటి సీతారామయ్యగారు గాని, 1948లో పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వము పేరిట నవ్య సాహిత్య ధోరణుల్ని సమీక్షిస్తూ భారతి రజతోత్సవ సంచికలో వ్యాసం రాసిన కృష్ణశాస్ర్తీగారుగాని, ‘నూరేళ్ల

04/13/2018 - 21:09

ఆనందం ఒక సార్వత్రిక అనే్వషణ
కొంతమందికి, గతంలో ఎక్కడో విడిచిపెట్టేసినది.
మరి కొంతమందికి భవిష్యత్తులో కనుక్కోబోయేది
జీవితంలో ఇతర మంచి విషయాల్లానే
ఆనందం కూడా స్వతహాగా అంతుచిక్కనిది
అయితే దాన్ని పట్టుకోవడం దుర్లభం కాదు
నిజానికి చిన్నప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను
చదువై పోయి ఉద్యోగంలో చేరితే వస్తుందనుకున్నాను
మంచి జీతం వస్తే దొరుకుతుందనుకున్నాను

Pages