S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/28/2018 - 00:59

నువ్వు...
అధికారాన్నిచ్చే అద్భుతానివి
ప్రజాస్వామ్యానికే
తొలి ఆరాధ్య దైవానివి

వాగ్దాన మ్యానిఫెస్టో
మరుగు మందు పూయబడ్డ
పార్టీ కల్పవృక్షానివి

అయదేళ్ళు
నిన్ను పాతాళానికి తొక్కేసినా
మళ్లీ ఎన్నికల్లో
కేవలం నాయక స్పర్శ తగిలితేనే
త్రివిక్రముడవై ఉబ్బితబ్బిబ్బైపోతావు

05/28/2018 - 00:54

1. మొన్న...
మబ్బుల ఊరి చివర చెరువులో కొమ్మల నీడలు
ఈతకొడుతుండేవి
వాములోంచి ఎగిరిన గడ్డిపోసలు
ఎద్దుకొమ్ముల్ని ముద్దాడేవి
పసుపురంగు పూసుకుని పడమర మెరిసిపోతుండేది
మిరప చేనును సీతాకోక
కంటి రెప్పలతో
కాపుకాస్తుండే
పందిరి మీద బీరతీగలు,
మల్లెమొగ్గల్ని ముద్దాడినట్టు
మనుషుల మధ్య ప్రేమలు పెనవేసుకునేవి
మట్టిమీద పడ్డ నాగలి గీతలు

05/21/2018 - 03:54

నీ పూజ కోసం పూజ పుస్తకం పట్టుకొని
పూజ చేద్దామనుకున్నాను ప్రభు
ఇంతలో
నిశ్శబ్దంలో ఓంకార నాదం గ్రహించమని, వచించమని
ప్రవచిస్తున్న ప్రవచనకారుల ఛానల్
ఛానల్‌ను చటుక్కుమని మార్చేసిన పిల్లవానికి
ప్రశ్నించు, ప్రశ్నించు, ప్రశ్నించడం నేర్చుకోమన్న
విప్లవ భావాల అభ్యుదయవాది పిలుపుతో
మరో ఛానల్
ఠపక్‌మని కోపంతో టీవీని ఆపుచేసిన చిన్నవాడు

05/21/2018 - 03:52

తొలితరం తెలంగాణ సాహితీవేత్తలలో పొట్లపల్లి రామారావుగారు విలక్షణమైన కవి, రచయిత, నాటక కర్త, కథకుడు. సాహితీ రంగంలో అన్ని ప్రక్రియలలో విశిష్టమైన కృషి సలిపి తమదైన ముద్రవేశారు. అధ్యయనం, ఆచరణ, ఉద్యమమే ఊపిరిగా బతికి తన జీవితాన్ని అక్షరబద్ధం చేసిన నిరుపమానమైన భూమి పుత్రుడు. తన మస్తిష్కాన్ని మధించి, అక్షరాలకు రూపమిచ్చి, జ్ఞానజ్యోతి సమారాధనలో, సృజించిన అమూల్యమైన సాహితీ సంపదను తెలుగువారికి అందించారు.

05/14/2018 - 00:49

నీటి అల ఒడ్డున పాకుతున్న ప్రతిబింబంలోకి
దగ్ధమయ్యే దేహపు ఎడారిలో
కొంత చీకటిని
ఒక చిగురును వదలి వెళ్లినట్లు
అతడొక స్వప్నగీతాన్ని రాసి
ఈ ప్రపంచానికి బహుమతిగానిచ్చాడు
వేల సిరాచుక్కల మెదడు కదలికల్లో
చైతన్యమంతా రంగరించి...
మసిపూసిన మారేడుకాయలాంటి
డొల్ల బతుకులోకి
అమృతబాండమేదో కవ్వమేసి చిలికినట్లు
కొన్ని అలికిడులను

05/14/2018 - 00:44

పూల గిలకల సంగీతం మెరుపులతో
ఈ వసంతం మెరుస్తుందా!!
చిగుళ్ల సంతకాల వసంతం
జ్ఞాపకాల కరుణాక్షరాలతో
నిరంతర స్వప్నాల
ఆకుపచ్చని నిరక్షరాస్యతని
పంచి పెడుతుందా....

05/14/2018 - 00:41

అస్తమయాన్ని ఆహ్వానిస్తూ ఆకాశం
మినుకు పొడుపుల్లో
ఋక్షాక్షర శిల్ప ప్రబంధవౌతుంది

మసక వెలుతురు దీపజాలంలో పడి
మయ వుంపుగొని
చీకటి మాటల్ని చుట్టుకుంటుంది

బుద్ధి బంధితాలైన జల్పదృశ్యాలు
ఆనందకారకాలై
నిభృతావేశ నైసర్గికాలవుతాయ

ఆరుబైలు
అర్ధనగ్నంగా చేస్తున్న అభినయానికి
ఇళ్ళు కళ్ళు మూసుకుంటాయ

05/07/2018 - 00:23

మొన్న
పిచ్చుకల్ని పైకెత్తేసినాం
రెక్కల టపటపలు తప్ప
ఒక్క పిచ్చుక ఎగిరిన జాడలే
ఏ ఆకాశహర్మ్యంలోను
కిచకిచల రావం వినపడలే

నిన్న
కోకిలలను గుంపులు
గుంపులుగా చేర్చినాం
గళం మీద గళమెత్తి పాడినా
వసంతం గొంతు విప్పలే
ఏ ఖాళీస్థలంలోను
ఒక్క మొక్కైనా మొలవలే

05/07/2018 - 00:07

నడిచి నడిచి వేసారి
తలెత్తి చూశానోసారి
నుదుటిన పూసిన
జంట ఇంద్రధనుస్సులు
వాటి కింద సాంద్రీకృత
సమ్మోహన సరస్సులు
ఆపేక్షతో విరబూసిన చక్షువులని
అమృతపు చలివేంద్రాల్లా...
మహేంద్రజాల కేంద్రాల్లా
అయస్కాంత కెరటాల సంద్రాల్లా
దప్పిక తీరింది... నడక తప్పింది
మజలీ ఇదేగా మరు జన్మ దాకా!

05/07/2018 - 00:19

వౌనం భయపెట్టేంత వౌనం
చిరు శబ్దం సైతం లేని నిశ్శబ్దం
చిన్నపిల్లల అలికిడి లేక
ఇల్లు ఇల్లులా లేదు
మేము మేములా లేము

చిన్న మనుమరాండ్లిద్దరు
ఎండకాలం వాళ్లమ్మ దగ్గరికి
ముసాఫిర్‌గా పోయండ్రు
పోస్ట్ రోజూ తీసుకునే
మనుమరాలి ఆనవాలు లేక
పిల్లలు లేరా అని
పోస్టుమాన్ ఆరా తీస్తున్నాడు

Pages