S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/16/2018 - 03:14

పిడికెడు మట్టిని తీసుకొని
స్నానించాను
దేహం కొత్త పరిమళాలు
వెదజల్లుతోంది
చెమటను శ్వాసించిన మట్టి
కొత్త పూల చెట్లను
వికసింపజేస్తోంది
దేహం
కొత్త పూల వెలుగులో
ప్రకాశిస్తోంది
నెత్తిపై కొత్త చెట్లు
మొలకెత్తాయ
రకరకాల కాయలు, పళ్లు
విరగకాస్తున్నాయ
దేహం మట్టిని
తయారుచేసే కర్మాగారమైంది

04/09/2018 - 00:34

ఎండలో కాగుతున్న
ఆ కానుగ చెట్టు
నాకు మిట్టమధ్యాహ్నం
నదీ స్నానం చేసినట్లుంది!

నీడ పట్టునే్న ఉండే నాపై
ఆ చెట్టుకెందుకంత మమకారం?
పరహితార్థంగా పాఠం చెబుతున్నట్లుంది

వేడిమిని ఎదిరించి
మూలకు కూర్చున్న ఆ మట్టికుండ కూడా
నా దాహానికి చలువ పందిరి వేస్తున్నది
నేనేం ప్రత్యుపకారం చేయకపోయనా
మట్టి ఇంకా రక్తస్పర్శన కోల్పోలేదు!

04/02/2018 - 00:25

శృతిలో ఉందంటే
ఆ పాటలో
ప్రాణం ఉన్నట్లే కదా!

సాంత్వన కల్గిందంటే
ఆ జలధార
జీవధార అయనట్లే కదా!

మది పులకించిందంటే
ఆ గానంలో
గాంధర్వం ఉన్నట్లే కదా!

పరవశం కల్గిందంటే
ఆ శ్వాసలో
ఓ పరిమళం ఉన్నట్లే కదా!

హృదయాంతరాళాన్ని
తాకిందంటే
ఆ కవితలో
ఓ రసానుభూతి ఉన్నట్లే కదా!

04/02/2018 - 00:23

నా కవితా విహంగం
ఊహల రెక్కలు కట్టుకుని
స్వేచ్ఛగా విహరిస్తుంది

నా కవితా జలపాతం
జన జీవన స్రవంతిలో
స్వచ్ఛంగా ప్రవహిస్తుంది

నా కవితా మలయ మారుతం
ఆశను శ్వాసగా మార్చుకుని
నిశ్చయంగా నినదిస్తుంది

నా కవితా విలయతాండవం
విప్లవాన్ని ఊపిరి చేసుకుని
నిర్భయంగా నాట్యం చేస్తుంది

04/02/2018 - 00:22

ఏకాంతం ఏకాంతమంటూ
ముద్దుగా పిలుచుకునే ఒంటరితనమెందుకో
ఒకోసారి మారం చేస్తుంది
నిజాల లెక్కలు తేల్చాల్సిందేనని
అహానికి ఎదురుతిరుగుతుంది

బాహ్యానికి అంతరాళానికీ మధ్య
అడ్డుగోడలా నిలబెట్టిన నిర్లిప్తత
ఇక వల్లకాదంటూ చేతులెత్తేస్తుంది
లోలోన నీలపు బరువు ఉవ్వెత్తున పొంగుతుంటే

04/02/2018 - 00:20

నీ చిలిపి కళ్ళతో సంకెళ్ళు తొడిగావు
నీ చిరునవ్వుల తేనె ఊబిలో
నన్ను నిట్టనిలువునా ముంచెత్తావు
ఇంకేముంది
కలలతో కడుపు నింపుకొంటూ
నీ కాళ్ల చెంత పడివుంటా
వెనె్నల కూసే స్వరం కోసం
మెరుపై కురిసే స్పర్శ కోసం..

- డాక్టర్ డి.వి.జి. శంకరరావు,
9440836931

04/02/2018 - 00:17

నా కన్నీళ్లను
నీ తలగడ గుండెలో పొదువుకుని
నా దుఃఖాన్ని
నీ దుప్పటి ఒడిలో దాచుకుని
నా వెక్కిళ్ళకు
నీ కీచురాళ్ళ రొదను జతచేసి
నా ఓదార్పుకు
నీ స్వప్నాలను ఊహగా ఇచ్చేసి
నా కష్టాలకు
నీ చీకటిని తోడిచ్చి
నా సంతోషాలకు
నీ వెనె్నలను పంచి
వెళ్ళిపోయావా
వేకువ వచ్చేసి మళ్లిపోయావా
మెలకువనిచ్చేసి...

03/25/2018 - 22:08

ఆకాశపు తెరమీద
ఎన్నో ఎనె్నన్నో వర్ణాలు!
పశ్చిమాన సిందూరపు సూరీడు
రౌద్రపు రంగంటుకొని ఖిన్నుడై
తొలి సంధ్య మొదలు మలి సంధ్య దాక
ఏ దారుణ దమనాలు గాంచాడో
ఏ మారణ హోమాలు కన్నాడో!

ఓవైపు వినూత్న ఆధునిక విమానాలు
ఆశాజీవుల నిండుగ నింపుకొని
మరోవైపు చంద్రుడిపై ఆవాసానికి
నివాసాలు నిర్మించ దూసుకెళ్తూ రాకెట్టులు!

03/25/2018 - 22:07

ఎర్రని ఎండలో
సెగలు కక్కుతున్న తారురోడ్డు నీడలో
గాలి మేడలో సైరన్ల జోరులో
సాగుతున్న ఆమె జీవన వేదనను
ఒక్కసారన్నా తిలకించారా?
సమ్మెట పైకెత్తి
ఊపిరి పీల్చలేక సన్నని రొదతో
సగం చినిగిన మురికి బట్టలతో
మిలమిల మెరిసిపోతూ
తరగని వెనె్నల కనుల అందాన్ని
పసివాడని దేహాన్ని, మసివాడిన గాయాల్ని
రక్తం చిందుతున్న హస్తాల్ని

03/25/2018 - 22:03

వృథాగా
ఎవరి హృదయాన్ని
పగలగొట్టొద్దు!
అది అద్దం వంటిది
పగిలిన ప్రతి ముక్కా
నీ క్రూరత్వానే్న గుణిస్తది!
రాయి విసరడం ఎంత తేలికో
గాయం ఊరుకుంటదా?
మానినా మరకై గుర్తుపెట్టుకుంటది!
స్వీయ గాయాలే లెక్కలేనన్ని
గణించడం పూనుకుంటే
జీవితం కురచనవుతది!
నీకూ నాకూ పెద్ద తేడా ఏముంది చెప్పు?
దారులు వేరుగావచ్చు

Pages