S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/29/2018 - 22:45

అద్దంలో...
మనల్ని మనం చూసుకున్నప్పుడు
అమ్మ ఒడిని చేరినంత ఆనందం!

ఒంటరిగా...
దాని ముందు నిల్చుంటే చాలు
చిన్న పిల్లలమైపోతాం!
మన వదనాన్ని
పురివిప్పిన మయూరిలా
నాట్యమాడిస్తూ... వెక్కిరింతలతో...
దానికి చెక్కిలిగింతలు పెడతాం!

ఎంత గొప్పది అద్దం!
అబద్ధమసలే ఎరుగదు!
అంతా నిజమే చూపుతుంది!

10/29/2018 - 22:41

కొందరి మేధోసంపత్తి
సమాజ శ్రేయస్సును కోరింది
ప్రాణాంతక వ్యాధుల
గుట్టును రట్టు చేసి
జీవన సౌభాగ్యాన్ని అందించింది

కొందరి అభ్యుదయ భావాలు
సంఘాన్ని సంస్కరించింది
దురాచారాలను దునుమాడి
కొత్త వసంతాలు పూయంచింది

దగాపడ్డ ఓ ఆత్మాభిమానం
తన జాతి
ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొంది
నల్లసూరీడై
నలు చెరగులా భాసించింది

10/22/2018 - 06:39

జీతాల్లో లింగభేదాలున్నట్టే
ఉద్యోగులలోనూ ఒప్పంద భేదాలుంటాయ
చట్టాలు వాటి దారిన అవి వెళ్తుంటాయ
ఆడకూలీలనూ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులనూ
తప్పించుకుని తిరుగుతాయ
సమానమైన పనికి సమాన వేతనం -
అంటూ ధర్మపన్నాలు వల్లించే
సమాన ప్రతిఫల చట్టం
ఈ అసమ సమాజం అడుతున్న బూటకం
సంజయ రాజ్యంలో
ప్రజాస్వామ్య వలువలు ఒలుస్తూ
ఎర్ర శాలువలా కప్పుకునేందుకు

10/22/2018 - 06:37

బొట్టుబొట్టుగా కారుతోంది నెత్తురు
ఆ వస్త్రం రుధిర నదిలో ముద్దయ్య
పాదాల మీదుగా లోహ చెప్పుల మీదుగా
రక్త బిందువులను నేలపైకి రాలుస్తోంది

10/22/2018 - 06:34

కవిసంధ్య, సాహిత్య సాంస్కృతిక సంస్థ, యానాం సాహిత్యంలో జీవన సాఫల్య కృషికి ప్రతి ఏటా ఇచ్చే శిఖామణి సాహితీ పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి, విమర్శకులు, సీనియర్ పాత్రికేయులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఎంపికయ్యారు. అక్టోబరు 28న సా. 5 గంటలకు యానాంలో జరిగే పురస్కార ప్రదానోత్సవ సభలో శ్రీకాంతశర్మకు పదివేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు.

10/15/2018 - 07:08

నీ చూపు ఇంకా విస్తృతం కావాలి
ఎప్పటికీ రాని - ఎవ్వరూ కనరాని
రేపటి కోసం రేయింబవళ్లు
ఎంతకాలమని - ఆ ఎదురుచూపు?
ఇంకెంత సేపని ఈ ఏవగింపు
మేలుకో కళ్లు తెరు
వర్తమాన వాస్తవాన్ని
చేదైనా, తీపైనా, ఏమైనా
తనివితీరా ఆహ్వానించు!
తపన తీరా అనుభవించు!
గతమెందుకు అవగతమవ్వాలి?
గతంలోని అనుభవసారాన్ని
వెతుక్కునే ప్రయత్నంలో వృథాగా

10/15/2018 - 07:07

అరచేతిలో
వైకుంఠం చూడలేకున్నా
దిక్కుచూపే ఐదువేళ్ల
హస్త సాముద్రికాన్ని
భవిష్యత్ చిత్రపటాన్ని
దర్శించే ఆశాజీవుల
భ్రమావరణంలో
ఇక దిక్కులే మాసిపోతే?
మీటలు నొక్కి నొక్కి
దిక్కు తెలిపే చేతివేళ్లు
రోజూ బట్టలుతికే వేళ్లు
ఆస్తిపాస్తుల లావాదేవీల
నడుమ నలిగిన
బొటనవేలి ముద్రలు
బయోమెట్రిక్ హాజరీపై

10/15/2018 - 07:12

మిత్రమా,
ఈ క్షణం నీకొక New Gen కవితని వినిపించాలె
నువ్వు రెడీనా... ఇక ఇను

10/01/2018 - 00:23

మా వాకిట్లో వున్న వటవృక్షం
చీకట్లో వెలుగులు చిమ్ముతుంది
వెనె్నల్లో వనె్నలు చిగురిస్తుంది
కనె్నపిల్లలా గారాలు పోతుంది
కన్నతల్లిలా కరుణ కురుస్తుంది

10/01/2018 - 00:16

ఎప్పటికైనా తప్పదు కదా
మనసు బీడుపడిన నేలగా ఎంతకాలం?
తన్మాత్రలు పూసరవెల్లులై
పరిగెట్టినంత దూరం
ఒకే ఒక్క కల కోసం నిరీక్షిస్తూ
ఇంకెంత జీవితాన్ని కోల్పోతావ్!
నీ కళ్లని స్వప్న దర్శనానికి డొనేట్ చేసినప్పుడే
ప్రపంచం నీనుండి దూరమైపోయంది
ఎవరి పెదవులపై
రెండు చిరునవ్వు పూల కోసం
జీవితాన్ని పంచుపర్వతంలా కరిగించావో

Pages