S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/25/2019 - 22:20

సాహితీ నందనవనంలో వికసించిన సుమానివి
అనురాగం, అభిమానం, ఆప్యాయతలతో
తల్లిగా, చెల్లిగా, భార్యగా, బోధకురాలిగా
విద్యుక్త ధర్మ నిర్వహణలో ఓపికకు మరో రూపంతో
సమాజానికి మీ సాహితీ సమర్పణ శ్లాఘనీయం

03/25/2019 - 22:16

ఒక వౌనం యుద్ధ వ్యూహం
ఇంకో వౌనం బుద్ధ ధ్యానం

ఒక వౌనం తీరని వేదన
ఇంకో వౌనం అంతః శోధన

ఒక వౌనం నిగ్రహ ప్రకటన
ఇంకో వౌనం నిరసన ఉద్ఘాటన
ఆగ్రహంపై పరిచిన ఆచ్ఛాదన
వినమ్రంగా దాగివున్న విస్ఫోటన

03/25/2019 - 22:11

సంక్షిప్తం కాని భావాలను
నిక్షిప్తం చేయడానికి
అక్షరాలు పడే ఆవేదన
ఎంతని చెప్పగలం?
ఊహా విహారం కన్నా ముందే
ఊరేగుతున్న అల్లిబిల్లి ఆలోచనలు
అక్షరాల అంతరిక్షాన్ని
అందుకోవాలని పడే తపన
తలపుల తపోదీక్షకు
తలుపులు తీసే సమయాన
‘కలం’ కాలంతో పోటీపడి
కలలు కంటుంది - కలవరపడుతుంది
ఆ స్వాప్నిక జగత్తులో మత్తులో

03/25/2019 - 22:09

నిత్య జీవితంలో
ఎన్ని కరువులు
చినుకు పడక
చెరువైనా నిండేదెలా
చెలకలు పండేదెలా

03/18/2019 - 21:56

ఆమె వేళ్లలోంచి
క్షణంలో రాలిపడుతుంది
రెండు నిలువుగీతలు
రెండు అడ్డగీతలు
ఉదయస్తున్న సూర్యకిరణాలను తెంపి
నేలమీద అతికించినట్టు.
మధ్యలో చుక్క
ఒక జీవబిందువు తొణికిసలాడుతున్నట్టు
అంత పెద్ద వాకిలికి
ఆ ముగ్గు ఒక చిరునవ్వు.

నిద్రమబ్బు కాస్త
నిగనిగల మెలుకువగా విప్పారినట్టు
ఎవరికో ఎవరికో
స్వాగతం పలుకుతున్నట్టు.

03/18/2019 - 21:55

గుండెనుండి ఆ ముల్లుని తీయకండి
దాన్నలా వదిలేయండి
అది కదిలినంత కాలం గుండెల్లో
గాయం రక్తపు గుటక వేస్తుంది
శ్రామిక బానిసత్వ చిత్రానికి
సూర్యోదయం ఓ కొత్త రంగు బహుకరిస్తుంది
జీవితం తొడుక్కున్న వెట్టి సంకెళ్లు
కదిలినప్పుడల్లా నిత్యం
కన్నీటి పాటకి కొత్త లయ సమకూరుతుంది
ఆ ముల్లే కదా! నా వునికి పునాది
నా సాంత్వనారహిత స్వతంత్ర రణానికి నాంది

03/18/2019 - 21:53

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కవిసంధ్య, జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన కవితల పోటీలో మొదటి బహుమతి బి.శివప్రసాద్ కవిత ‘స్మృతుల ఊరేగింపు’, రెండవ బహుమతి సీ.ఎస్.రాంబాబు కవిత ‘చీకటి చిరునవ్వు’, మూడవ బహుమతి సమ్మెట విజయ కవిత ‘ఆసరా’ ఎంపికయ్యాయ.

03/18/2019 - 21:52

ప్రగతిశీల సాహితీ ప్రయాణికుడు, కవి మువ్వా శ్రీనివాసరావు తల్లిదండ్రుల పేర ప్రతి ఏటా ఇస్తున్న మువ్వా పద్మావతి రంగయ్య సాహితీ పురస్కారానికి 2017 సంవత్సరానికి ప్రముఖ సినీ గేయ రచయత సుద్దాల అశోక్‌తేజ, 2018 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి దేవీప్రియ ఎంపికయ్యారు.

03/18/2019 - 21:50

నీ ప్రపంచంలో నువ్వుంటావని
మిత్రులు బంధువులు అంటూ వుంటే
చిన్న పాప తెల్లకాగితంపై
గీసిన ఆకారం లేని గీతల్లాగా
చిక్కుపడ్డ దారంలాగా
ఆలోచనలు కమ్ముకున్నాయ

అప్పుడే మనసు మాటలాడింది
మెరుపులా ప్రశ్నించింది కూడా
నీది నిజంగా ఏ లోకమని
నాలో ఉండీ ఎలా అడిగావని
ఉరుములా గర్జిద్దామనుకున్నా
కాని తనని ప్రశ్నించలేదు
ఆ సాహసం చేయలేను మరి

03/11/2019 - 02:10

ఆర్థినీ, ఆలంబననూ
అమ్మలో ఆవిష్కరిస్తూ
ఒద్దికనూ, ఓదార్పునూ
ఆలిలో అనుగ్రహిస్తూ
‘మహిని..’ తనలో నింపుకుంది మహిళ మహిమాన్వితులాయ్యింది సబల.

Pages