S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/17/2020 - 22:18

అరిషడ్వర్గాల్లోని మదము అహంకారాన్ని సూచించే లక్షణం. అధికత్వ భావన ప్రదర్శనమే అది. గర్వం దాని మరో రూపం. మన పురాణేతిహాసాల్లోని చాలా పాత్రలు అహంకారానికి మచ్చుతునకల్లా కనబడుతుంటాయ. దుర్యోధనుడు అభిమానధనుడు. అహంభావమే అతని లక్షణంగా కనిపిస్తాడు. మహాభారతం ఉద్యోగ పర్వంలో కృష్ణరాయబార ఘట్టంలో చెప్పవలసిన హితవు ఎవరు చెప్పినా లక్ష్యపెట్టడు దుర్యోధనుడు.

02/17/2020 - 22:13

జన్మకు ఓ శివరాత్రి అంటూ ఉంటాం కదా. జన్మలో ఒక్కసారైనా శివరాత్రి జాగరణ చేస్తే ఆ మనిషి తరిస్తాడని ఆ సామెత తాత్పర్యం అన్నమాట.
శివుడు, రాత్రి, జాగరణ అనే మూడు సాంకేతిక పదాలే. శివుడు అంటే వెలుగు, జ్ఞానం,. రాత్రి అంటే చీకటి , అజ్ఞానం, ఇక జాగరణ అంటే వెలుగును గుర్తించే ప్రయత్నం అన్నమాట.

02/16/2020 - 23:45

కాశీని జీవితంలో ఒక్కసారన్న దర్శించాలన్నది భారతీయుల ఆకాంక్ష గా ఉంటుంది. కాశీలో మరణించినవారికి శివసాయుజ్యం తప్పక లభ్యమవుతుందని అంటారు. కాశీని దర్శించినవారు గంగానదినీ దర్శించుకుంటారు. గంగాస్నానం ఎంతో పవిత్రం. కాశీలో గంగాస్నానం చేసినవారు ఎవరైనా కాలభైరవుని దర్శనం చేసుకున్నవారు శివప్రీతులు అవుతారనే ఐతిహ్యం ఉంది.

02/16/2020 - 23:43

మహాదేవుని ప్రమథగణాలలో ముఖ్యుడు మరియు వాహనమూ అయిన నంది మానవాళికీ ఆహారం అందించేందుకు ఎద్దురూపంలో సహాయ పడుతున్నాడు. ఆవులు పాడినిస్తే ఎద్దు పంటలు పండించే రైతుకు శాయశక్తులా సాయపడుతుంది.

02/16/2020 - 23:41

తమలపాకును ముతె్తైదువులకు తాంబూలం ఇవ్వడానికి వాడుతారు. ఏ పూజలోనైనా తమలపాకులను ఉపయోగిస్తుంటారు. ఆంజనేయస్వామికైతే తమలపాకులతో అర్చనాదులను నిర్వహిస్తారు. మృష్టాన్నభోజనం తిన్నతరువాత జాజి లాంటి సుగంధ ద్రవ్యాలతో కలిపి చక్కని తాంబూల సేవనం చేసేవారున్నారు. తాంబూలం వేసుకొంటే ఎంతో మానసిక తృప్తినే కాక మంచి ఆరోగ్యమూ కలుగుతుందనేవారున్నారు.

02/16/2020 - 23:29

అలసిన నా శరీరం సేదతీరాలంటోంది.
ఇంకా తీరం రాలేదు...

తొలి కిరణం ఇంకా భువినే చేరలేదు...
గడియ యైనా భారంగా గడుస్తోంది

ఎందాకా ఈ ప్రయాణం....
అలసిన నా శరీరం భారవౌతోంది....

నేస్తమనే ఊతం
ఎపుడు వచ్చేనో.....

దిగులు మేఘంకరిగేదెన్నడో
అడగడునా ఆటంక కంటకాలే

నేస్తమనే ఆసరా తో
తరువుతీరం అతిదగ్గరనుకొన్నా

02/12/2020 - 22:26

గోదావరీ నదీ దక్షిణ తీరమున పరివ్యాపితమైయున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, ఉత్తర దక్షిణ భారతీయులకు సేతువై నిలిచిన ఈప్రాంత నాగరికత కాల ప్రవాహంలో కొట్టుకొని పోయినా, ఔత్సాహికులైన చారిత్రక పరిశోధకుల అవిరళ కృషి ఫలితంగా కథలుగా, గాధలుగా, నోళ్ళలో, రాళ్ళలో, ఆకులలో, రేకులలో, ఆక్కడక్కడా నిక్షిప్తమైయున్న చరిత్ర కొంతవరకు వెలుగులోనికిరాగలిగింది.

02/12/2020 - 22:25

దేహాత్మ వివేకము లేనపుడు అహంకారం ఉదయిస్తుంది. అవిద్యా సంబంధం వలననే మనకు అవివేకం కలుగుతుంది. అంటే వివేకం దూరమవుతుందన్నమాట. అవిద్యా సంబంధం వలననే కర్మ కలుగుతుంది. ఆ కర్మను నశింపచేయుటయే శకటాసుర వృత్తాంతం అంటారు. అది ఎట్లనో చూద్దాం.

02/12/2020 - 22:23

త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాదులు తపస్సుల ద్వారా మానవులు మోక్షం పొందారు., కలియుగంలో దానధర్మాలు, దైవారాధన, నామ పారాయణ, నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభతరమైన మోక్షమార్గాన్ని దైవం ప్రసాదించాడు. దానధర్మాలు ఎవరికున్నంత వారు దానం చేసుకోవచ్చు. ఈ దానం చేసేది కూడా మనస్ఫూర్తిగా చేస్తే చాలు. ఆడంబరాలకు పోనవసరం లేదు.

02/11/2020 - 22:33

చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ చెప్పింది ఆచరించేవారు కొద్ది మందే ఉంటారు. చెప్పేవారు కూడా వారు చెప్పినదాన్ని ఆచరించరు. అందుకే వాళ్లు చెప్పింది విన్నవాళ్లకు హృదయపులోతుల్లోకి వెళ్లి వారిలో పరివర్తన తీసుకొని రాదు. ఎపుడు శ్రోతల్లో మార్పును ఆశిస్తారో అపుడు ఆ ప్రవక్త ముందు తాను చెప్పేది ఆచరించి ఆతరువాత ఇతరులకు చెప్పాలి.

Pages