S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/08/2016 - 05:49

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రోగ్రామర్, 1970వ దశకంలో ఈ-మెయిల్ విధానాన్ని ఆవిష్కరించడంతో పాటు సందేశాలను పంపించే పద్ధతికి బఅనే చిహ్నాన్ని ఎంపిక చేసిన రే టామ్లిన్‌సన్ (74) కన్నుమూశారు. టామ్లిన్‌సన్ 1971లో నేరుగా ఎలక్ట్రానిక్ మెసేజ్‌లను పంపించే పద్ధతిని కనుగొన్నారు. అంతకుముందు వినియోగదారులు కేవలం పరిమితమైన నెట్‌వర్క్‌లో మాత్రమే సందేశాలను రాసి పంపగలిగేవారు.

03/08/2016 - 04:07

లండన్: బ్రిటిష్ ప్రభుత్వం ఈ నెల 18వ తేదీ నుంచి అనేక కేటగిరీలకు చెందిన వీసా దరఖాస్తుల ఫీజులను భారీగా పెంచేందుకు సిద్ధమవుతోంది. దీని వలన బ్రిటన్‌లో నివసించేందుకు, పనిచేసేందుకు గత ఏడాది వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది భారతీయులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

03/07/2016 - 06:38

బాటన్ రోగ్: అమెరికా అధ్యక్ష పదవికోసం ప్రధాన పార్టీల్లో జరుగుతున్న పోటీ రానురాను రసవత్తరంగా మారుతోంది. ‘సూపర్ శనివారం’నాడు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ టెడ్ క్రుజ్, డెమోక్రాట్ బెర్నీ శాండర్స్‌లు కీలక విజయాలు సాధించడం ద్వారా తిరిగి పోటీలో నిలిచారు.

03/06/2016 - 07:17

బీజింగ్: టిబెట్‌ను దేశంలోని మిగతా భాగాలను అనుసంధానం చేస్తూ రెండో రైలు మార్గాన్ని చైనా నిర్మించనుంది. హిమాలయ ప్రాంతమైన టిబెట్‌కు మిగతా ప్రాంతాలతో కనెక్టివిటీ పెరగడంతో పాటుగా భారత్ సరిహద్దు ప్రాంతాలకు శరవేగంగా సైన్యాలను తరలించడానికి సైతం ఈ రైలుమార్గం ఉపయోగపడుతుంది.

03/06/2016 - 07:16

వాషింగ్టన్: ఓ వైపు భారత్, అమెరికా ప్రజా ప్రతినిధులు తీవ్ర వ్యతిరేకతల నడుమ అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాల విక్రయానికి సంబంధించి అధికారిక ఫెడరల్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

03/05/2016 - 07:14

ఎడెన్: దక్షిణ యెమెన్‌లోని ప్రధాన నగరం ఎడెన్‌లో శుక్రవారం సాయుధ దుండగులు ఒక వృద్ధాశ్రమంపై కాల్పులు జరపడంతో నలుగురు భారతీయ నర్సులతో పాటు కనీసం 16 మంది మృతి చెందారని భద్రతా అధికారులు చెప్పారు. ఎడెన్‌లోని షేక్ ఒత్మన్ ప్రాంతంలో ఉన్న వృద్ధాశ్రమంలోకి నలుగురు సాయుధ దుండగులు చొరబడి మొదట అక్కడున్న గార్డును కాల్చి చంపిన తర్వాత సిబ్బందిని కట్టేసి కాల్చి చంపినట్లు అధికారులు ఎఎఫ్‌పి వార్తాసంస్థకు తెలిపారు.

03/05/2016 - 06:58

వాషింగ్టన్: అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థుల చర్చలో యోగా అంశం చోటు చేసుకుంది. అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్, టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రుజ్ మధ్య వాడివేడిగా వాదోపవాదాలు జరుగుతుండగా, క్రుజ్ దీర్ఘశ్వాస తీసుకోవాలని ట్రంప్‌కు సూచించారు. ‘శ్వాస తీసుకో, శ్వాస తీసుకో, శ్వాస తీసుకో’ అని క్రుజ్ ట్రంప్‌తో అన్నారు. ‘నీవు చేయగలవు. నీవు దీర్ఘశ్వాస తీసుకోగలవు.

03/04/2016 - 08:36

న్యూయార్క్: సంపన్నవంతమైన దేశంగా అందరూ భావిస్తున్న అమెరికాలో అనేకమంది బాలల పరిస్థితి దయనీయంగా ఉందనే వాస్తవాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచ్చింది. దేశంలోని సుమారు 50 శాతం మంది పిల్లలు ప్రమాదకరమైన రీతిలో దారిద్య్ర రేఖకు సమీపంలో జీవిస్తున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది.

03/04/2016 - 06:48

వాషింగ్టన్, మార్చి 3: అమెరికా ప్రజల ఆదరణను విశేషంగా చూరగొంటూ మహా మంగళవారంలోనూ విజేతగా నిలిచిన రియల్ ఎస్టేట్ మొనార్క్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధినేతలకు గుదిబండగా మారారు! అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఏ పార్టీ నామినేషన్ కోసమైతే ట్రంప్ పోటీ పడుతున్నారో ఆ పార్టీ అధినాయకత్వమే ఆయన పాపులారిటీకి బెంబేలెత్తి పోవడం గందరగోళానికి దారితీస్తోంది.

03/03/2016 - 06:06

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికోసం రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీకి చెందిన హిల్లరీ క్లింటన్ మధ్య ముఖాముఖి పోటీ ఉంటుందనే విషయం దాదాపుగా ఖరారయింది.

Pages