S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/28/2016 - 00:42

లాహోర్, మార్చి 27: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రక్తపాతం సృష్టించారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారం లాహోర్ కిటకిటలాడిన ఓ పిల్లల పార్కునే లక్ష్యంగా చేసుకుని విరుచుకు పడ్డారు. భయానక విస్ఫోటనంతో రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఆత్మాహుతి దాడిలో అనేక మంది పిల్లలు, మహిళలు సహా 56మంది మరణించారు.

03/27/2016 - 02:41

హిల్లా, మార్చి 26: ఇరాక్‌లో శుక్రవారం రాత్రి ఇస్కందరియా నగరానికి సమీపంలో ఓ ఫుట్‌బాల్ మైదానంలో జనం మధ్యలో మానవ బాంబు పేల్చేసుకోవడంతో కనీసం 41 మంది మృతి చెందగా మరో 105 మంది గాయపడ్డారు. ఇస్కందరియా పట్టణానికి దగ్గర్లోని అల్ అసిరియా గ్రామంలోని చిన్న ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన స్థానిక టోర్నమెంట్ తర్వాత విజేతలకు ట్రోఫీని ప్రదానం చేసే సమయంలో మానవ బాంబు పేల్చేసుకున్నాడని స్థానిక పోలీసు అధికారి చెప్పారు.

03/26/2016 - 17:11

కొట్టాయం: లిబియాలో జరిగిన ఫిరంగి దాడిలో కేరళకు చెందిన నర్సు, ఆమె కుమారుడు మరణించారు. ఈ మేరకు ఇక్కడికి సమాచారం అందింది. ఓ అపార్ట్‌మెంటులో ఉంటున్న సును అనే నర్సు తన 18 నెలల మగశిశువుతో నిద్రిస్తున్న సమయంలో ఫిరంగి దాడి జరిగింది. ఆ సమయంలో ఆమె భర్త విపిన్ ఇంట్లో లేకపోవడంతో బతికి బయటపడ్డాడు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్లు కేరళ సిఎం ఊమెన్ చాందీ తెలిపారు.

03/26/2016 - 12:20

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలోని ఇస్కాన్‌దరియా వద్ద ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా శనివారం ఉదయం ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో మేయర్ సహా 30 మంది మరణించారు. గాయపడిన దాదాపు 70 మందిని ఆస్పత్రికి తరలించారు. ఐసిస్ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

03/26/2016 - 03:58

బారిలోషె, మార్చి 25: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లాటిన్ అమెరికా వాహ్యాళిపై రిపబ్లికన్లు చిరెత్తిపోతున్నారు. ఓ పక్క ఐసిస్ ఉగ్రవాదులు రక్తపాతం సృష్టిస్తూంటే ట్యాంగో డాన్స్ చేస్తావా..కుటుంబ సభ్యులతో ప్రపంచం పట్టని ఆనందంలో మమేకమవుతారా..క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోతో బేస్ ఆడతావా అంటూ నిప్పులు చెరిగారు.

03/25/2016 - 12:45

బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఇటీవల వరుస బాంబు దాడులకు సంబంధించి ఆరుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. దాడుల్లో పాల్గొన్న వారి గురించి పోలీసులు వీరిని ప్రశ్నిస్తున్నారు. బాంబుదాడుల్లో నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు సిసి టీవీ ఫుటేజీల్లో గుర్తించారు. వారిలో ఇద్దరు ఆత్మాహుతికి పాల్పడగా, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

03/25/2016 - 12:43

ముంబయి: తాను చదువుకుంటున్న స్కూల్‌పై భారత సైనికులు బాంబు దాడి చేశారని, అందుకే చిన్నతనం నుంచి భారత్‌పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ధ్యేయంతోనే తాను లష్కర్-ఎ-తోయిబాలో చేరానని పాక్-అమెరికా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ తన మనసులోని మాట వెల్లడించాడు. న్యూయార్క్ జైలులో ఉంటున్న హెడ్లీ న్యూయార్క్ జైలు నుంచి వీడియో విచారణ ద్వారా ముంబయిలోని కోర్టుకు శుక్రవారం మరికొన్ని విషయాలు తెలిపాడు.

03/25/2016 - 02:48

లాహోర్, మార్చి 24: స్వాతంత్య్ర సమర యోధుడు భగత్ సింగ్‌ను 1931లో ఉరి తీసినందుకు బ్రిటీష్ రాణి ఎలిజబెత్ క్షమాపణ చెప్పాలని, అందుకుగాను ఆయన వారసులకు పరిహారం చెల్లించాలని భగత్ సింగ్ 85వ వర్ధంతిని జరుపుకొన్న సందర్భంగా పాకిస్తాన్‌లోని మానవ హక్కుల ఉద్యమ కార్యకర్తలు గురువారం చెప్పారు. బుధవారం పాకిస్తాన్‌లో రెండు చోట్ల భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి.

03/25/2016 - 02:47

బ్రస్సెల్స్, మార్చి 24: బ్రస్సెల్స్ నగరంలోని విమానాశ్రయంలో, మెట్రో రైలులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ముగ్గురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను దర్యాప్తు అధికారులు గుర్తించారు.

03/24/2016 - 12:33

ముంబయి: ముంబయిలో వరుస బాంబుదాడులకు ముందే శివసేన పార్టీ అధినేత బాల్‌ఠాక్రేను హతమార్చేందుకు తాము వ్యూహరచన చేసినట్లు ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడైన డేవిడ్ హెడ్లీ వివరించాడు. ముంబయి పేలుళ్లకు సంబంధించి పాక్-అమెరికన్ ఉగ్రవాది అయిన హెడ్లీని న్యూయార్క్ జైలు నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ముంబయి కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే.

Pages