S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/31/2016 - 03:22

బ్రసెల్స్, మార్చి 30: బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖేల్‌తో కలిసి ఆసియాలో అతిపెద్ద ఆర్యభట్ట టెలిస్కోప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. బెల్జియం సహాయంతో ఈ టెలిస్కోప్‌ను నిర్మించారు. ఉత్తరాఖండ్‌లోని నైనటాల్ సమీపంలో గల దేవస్థల్ వద్ద ఏర్పాటు చేసిన 3.6 మీటర్ల వెడల్పు కలిగిన అద్దంతో కూడిన ఈ టెలిస్కోప్‌ను రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఆసియాలోనే ఇది అతిపెద్ద ఆప్టికల్ టెలిస్కోప్.

03/31/2016 - 02:48

బ్రసెల్స్, మార్చి 30: ఉమ్మడి బలంతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన అవసరం ఎంతో ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బెల్జియం ప్రధాని చార్లెస్ మైకేల్‌తో బుధవారం సమావేశమైన ఆయన ఉగ్రవాదం ఇరు దేశాలకు ఉమ్మడి శత్రువని, దీన్ని ఉమ్మడి బలంతోనే ఎదుర్కోవాలని ఉద్ఘాటించారు.

03/30/2016 - 16:57

మయన్మార్: మయన్మార్ పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేషనల్ లీగ్ ఫర్ డమొక్రసీ పార్టీ అధినేత్రి అంగ్‌శాన్ సూకీ ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు. తన పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినా, చట్టపరమైన అవరోధాల కారణంగా ఆమె దేశాధ్యక్ష పదవిని చేపట్టలేకపోయారు. తనకు అత్యంత నమ్మకస్తుడైన హితిన్ క్యాను అధ్యక్ష పదవికి ఆమె ఎంపిక చేశారు.

03/30/2016 - 16:56

బ్రస్సెల్స్: ప్రధాని హోదాలో తొలిసారిగా బెల్జియంలో పర్యటించేందుకు వచ్చిన నరేంద్ర మోదీకి బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్టులో బుధవారం ఉదయం ఘన స్వాగతం లభించింది. ఇటీవల ఉగ్రవాదుల బాంబుదాడిలో మృతులకు ఆయన నివాళులర్పించారు. అనంతరం బెల్జియం ప్రధాని మైఖేల్‌తో జరిగిన చర్చల్లో మోదీ పాల్గొన్నారు.

03/30/2016 - 12:06

బ్రస్సెల్స్: భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా బెల్జియంలో పర్యటిస్తున్నారు. బుధవారం ఆయనకు బ్రస్సెల్స్‌లో ఘన స్వాగతం లభించింది. బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖేల్‌తో ద్వైపాక్షిక చర్చల్లోను, ఇండియన్ యూరోపియన్ యూనియన్ సదస్సులోను ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మోదీ అమెరికా, సౌదీ అరేబియాల్లో పర్యటించి వచ్చే నెల 3న భారత్‌కు చేరుకుంటారు.

03/30/2016 - 11:05

మాంట్రియల్‌: అట్లాంటిక్‌ తీరంలోని మాగ్డాలెన్‌ ద్వీపంలో బుధవారం టర్బో ప్రాప్‌ అనే తేలికపాటి విమానం కూలిపోయి, ఏడుగురుమృతి చెందారు. మృతుల్లో కెనడా మాజీ మంత్రి ఉన్నట్లు గుర్తించారు. మంచుతో కప్పుకుపోయిన ప్రదేశంలో విమానం కూలిపోయింది.

03/30/2016 - 11:02

మయన్మార్‌ : అంగ్‌శాన్‌ సూచీ మాజీ డ్రైవర్‌, ఆమె అత్యంత సన్నిహితుడు హితిన్‌ క్యా ఇద్దరు ఉపాధ్యక్షులతో కలిసి మయన్మార్‌ అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్దాల తర్వాత గతేడాది నవంబర్‌లో మయన్మార్‌లో సాధారణ ఎన్నికల్లో నోబెల్‌ బహుమతి గ్రహీత అంగ్‌శాన్‌ సూచీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ పార్టీ ఘనవిజయం సాధించింది.

03/30/2016 - 01:47

లార్నాక (సైప్రస్), మార్చి 29: ఈజిప్టు విమాన హైజాక్ కథ సుఖాంతమైంది. ఈ విమానాన్ని బలవంతంగా దారిమళ్లించి సైప్రస్‌కు తీసుకెళ్లిన హైజాకర్‌ను అధికారులు మంగళవారం ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ విమానం నుంచి ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడిన తర్వాత ఈ అరెస్టు జరిగింది.

03/30/2016 - 01:36

లాహోర్, మార్చి 29: ఈస్టర్ రోజు ఓ పార్కుపై దాడికి పాల్పడి 74 మంది ప్రాణాలు తీసిన పాకిస్తాన్ తాలిబన్ ఉగ్రవాదులు ‘పంజాబ్‌లోనూ అడుగుపెట్టాం’ అనినవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతిచెందిన వారి సంఖ్య మంగళవారానికి 74కు చేరింది. గాయపడ్డవారిలో మరోఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ‘లాహోర్ ఘటన ద్వారా మేం పంజాబ్‌లో అడుగుపెట్టాం.

03/29/2016 - 18:33

సైప్రస్: ఈజిఫ్ట్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన హైజాకర్‌ను ఎట్టకేలకు సైప్రస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కొన్ని గంటల పాటు నడిచిన డ్రామాకు తెర పడింది. అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళుతున్న విమానాన్ని మంగళవారం ఉదయం ఓ వ్యక్తి హైజాక్ చేసి, సైప్రస్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేయించాడు. తొలుత పిల్లలను, మహిళలను వదిలేసి కొంతమంది ప్రయాణీకులను విమానంలో నిర్బంధించాడు.

Pages