S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/10/2016 - 05:15

న్యూయార్క్, ఏప్రిల్ 9: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్‌కు అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. ఆయన జయంతి కార్యక్రమాన్ని తొలిసారి ఐక్యరాజ్య సమితిలో నిర్వహించనున్నారు.

04/10/2016 - 05:12

బ్రసెల్స్, ఏప్రిల్ 9: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని విమానాశ్రయంతో పాటు మెట్రో రైల్వే స్టేషన్‌లో ఇటీవల జరిగిన బాంబు దాడులపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో గత ఏడాది పారిస్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న మొహమ్మద్ అబ్రినీ కూడా ఉన్నాడని అధికారులు వెల్లడించారు.

04/10/2016 - 05:10

పనామా సిటీ, ఏప్రిల్ 9: పనామా పేపర్స్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఫ్రాన్స్ పనామాను ‘సహకరించని దేశాల’ జాబితాలో చేర్చడం పొరపాటు నిర్ణయమని పనామా అధ్యక్షుడు జువాన్ కార్లోస్ వారెలా పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫ్రాన్స్ ప్రభుత్వ నిర్ణయం పొరపాటుదే కాకుండా అనవసర చర్య అని విమర్శించారు.

04/09/2016 - 08:24

వాషింగ్టన్, ఏప్రిల్ 8: భారత్‌తో శాంతి చర్చల ప్రక్రియను నిలిపివేయాలన్న పాకిస్తాన్ నిర్ణయంపై అమెరికా స్పందించింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సడలిపోవాలంటే ప్రత్యక్ష చర్చలే శరణ్యమని అమెరికా స్పష్టం చేసింది.

04/09/2016 - 04:09

లండన్, ఏప్రిల్ 8: ప్రపంచ నేతల్ని హడలెత్తిస్తున్న పనామా అక్రమ కంపెనీల జాబితా ఇప్పుడు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ మెడకు చుట్టుకుంటోంది. ఓ విదేశీ కంపెనీలో వాటా ద్వారా తాను లబ్ధి పొందిన మాట నిజమేనంటూ కామెరూన్ తాజాగా అంగీకరించడంతో ఆయనపై అన్ని వైపుల నుంచి వత్తిడి మొదలైంది. ఆర్థిక అనైతికతకు పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలు బ్రిటన్ ప్రధానిగా ఆయన కొనసాగడాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

04/08/2016 - 06:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: భారత్, పాకిస్తాన్‌ల మధ్య శాంతి ప్రక్రియ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆగిపోయిందని భారత్‌లో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ గురువారం అన్నారు. రెండు దేశాల మధ్య ఇప్పటికైతే ఎలాంటి చర్చల ప్రతిపాదనలు లేవని ఆయన అన్నారు. విదేశీ విలేకరుల క్లబ్‌లో జరిగిన సమావేశంలో, ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం ఎప్పుడు జరుగుతుందన్న ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు.

04/08/2016 - 05:52

జగిత్యాల, ఏప్రిల్ 7: దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా జగిత్యాల మామిడి మార్కెట్ ఖ్యాతి గడించింది. డివిజన్ కేంద్రమైన జగిత్యాల మార్కెట్‌లో మామిడి కాయల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రతి యేటా రూ.100కోట్ల టర్నోవర్ ఇక్కడ మామిడి మార్కెట్లో జరుగుతుంది. జగిత్యాల మార్కెట్ నుండే జమ్ముకాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఎర్సిన్, ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ ప్రాంతాలకు మామిడి ఎగుమతి చేస్తారు.

04/07/2016 - 07:46

మిల్‌వాకీ, ఏప్రిల్ 6: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లకు ప్రత్యర్థులు మరోసారి షాక్ ఇచ్చారు. ప్రైమరీల్లో దూసుకుపోతున్న ఇద్దరు అభ్యర్థులూ విస్కాన్సిన్ ప్రైమరీలో ఓటమిపాలు కావటంతో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి.

04/06/2016 - 08:04

పారిస్, ఏప్రిల్ 5: ‘పనామా’ ప్రపంచాన్ని వణికిస్తోంది. వివిధ దేశాల్లో దేశాధ్యక్షులతో సహా రాజకీయ నాయకులు, ప్రముఖులు పన్ను ఎగవేసి అడ్డదారి ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు లీకయిన నేపథ్యంలో స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాలు మంగళవారం విచారణకు ఆదేశించాయి. దీంతో వివిధ దేశాల నేతలు,ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

04/06/2016 - 08:01

ఇస్లామాబాద్, ఏప్రిల్ 5: పాకిస్తాన్ తన నైజాన్ని మరోసారి చాటుకుంది. పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై ఉగ్రవాద దాడిని పాక్ సంయుక్త దర్యాప్తు బృందం (జెఐటి) అంగీకరించినట్లే అంగీకరించి స్వదేశానికి వెళ్లిన తర్వాత అడ్డం తిరిగింది. పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి హైడ్రామా అని, అది భారత్ సృష్టించుకున్నదేనని, ఈ దాడి గురించి భారత అధికారులకు ముందే తెలుసని జెఐటి ఒక నివేదిక సిద్ధం చేసినట్లు పాక్ మీడియాలో వెల్లడైంది.

Pages