S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/08/2016 - 05:58

వాషింగ్టన్, జూన్ 7: భారత్-అమెరికాలు అన్ని రంగాల్లోనూ భుజం భుజం కలిపి పనిచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఓవల్ హౌజ్‌లో గంటకుపైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము చర్చించిన అనేక అంశాలను సంయుక్త విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. 2008లో ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రక పౌర అణు ఇంధన ఒప్పందం అమలు పురోగతిపై మోదీతో తాను చర్చించినట్టు ఒబామా వెల్లడించారు.

06/08/2016 - 05:51

బీజింగ్, జూన్ 7: నిన్న మొన్నటి వరకూ పాకిస్తాన్‌ను వెనకేసుకొచ్చిన చైనా ఒక్కసారిగా దిగ్భ్రాంతికర వాస్తవాన్ని వెల్లడించింది. 2008లో ముంబయి ఉగ్రవాద దాడి వెనుక పాక్ పాత్ర, అలాగే లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నాయంటూ మొట్టమొదటిసారిగా ధ్రువీకరించింది. భారత ఆర్థిక రాజధాని ముంబయిపై 2008 నవంబర్‌లో పదిమంది లష్కరే ఉగ్రవాదులు దాడి జరిపి మారణకాండ సృష్టించడం, 166మంది ప్రాణాలు బలికొనడం తెలిసిందే.

06/07/2016 - 12:02

వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం దివంగత ఇండో అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లాకు ఘనంగా నివాళులర్పించారు. కల్పన చావ్లా అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత సంతతి మహిళ. 2003లో అంతరిక్షం నుంచి కిందకు వస్తుండగా స్పేస్‌ షటిల్‌కు ప్రమాదం జరిగి ఆమె మరణించిన సంగతి తెలిసిందే.

06/07/2016 - 11:58

దోహా: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్ పర్యటన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 23 మంది భారతీయ ఖైదీలను ఖతార్ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఖైదీలను విడుదల చేసినందుకు ఖతార్ నేతలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

06/07/2016 - 05:26

లాస్ ఏంజెలిస్, జూన్ 6: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. కాలిఫోర్నియాలో కీలక ప్రైమరీ ఎన్నికలకు ముందు జరిగిన రెండు ప్రైమరీల్లో హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్ధి బెర్నీ శాండర్స్‌ను ఓడించారు. ప్యూర్టోరికోతో పాటు వర్జిన్ ఐలెండ్స్‌లో జరిగిన ఈ ప్రైమరీల్లో శాండర్స్‌పై హిల్లరీ ఘన విజయం సాధించారు.

06/07/2016 - 05:18

ఇస్లామాబాద్, జూన్ 6: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జమాత్ ఉద్ దవా (జెయుడి) ఉగ్రవాద సంస్థ అధినేత, కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సరుూద్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. భారత్ పాకిస్తాన్‌పై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అతను హెచ్చరించాడు.

06/07/2016 - 05:16

ఇస్లామాబాద్, జూన్ 6: పాకిస్తాన్‌తో సుహృద్భావ చర్చల ప్రక్రియ క్రమంగా మూసుకుపోతోందని, ఇందుకు ఎలాంటి సానుకూలత లేదంటూ భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ ప్రధాని విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తీవ్రంగా స్పందించారు. భారత్‌తో చర్చలు జరపాలని తామెంత మాత్రం పాకులాడటం లేదని, చివరి క్షణంలో ఏదో సాకుతో తప్పించుకుంటున్నది ఆ దేశమేనని స్పష్టం చేశారు.

06/07/2016 - 04:46

న్యూఢిల్లీ, జూన్ 6: డెన్మార్క్‌కు చెందిన 52 సంవత్సరాల మహిళపై రెండేళ్ల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసులో ఐదుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఈ మహిళను కత్తితో బెదిరించి, కిడ్నాప్ చేసి వీరు అత్యాచారానికి పాల్పడ్డారని కోర్టు ధ్రువీకరించింది. నిందితులు ఐదుగురిపై నమోదైన ఆరోపణలను నిర్ధారిస్తున్నామని అదనపు సెషన్స్ న్యాయమూర్తి రమేష్ కుమార్ వెల్లడించారు.

06/07/2016 - 04:45

జెనీవా, జూన్ 6: అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జి)లో చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత్ చేసిన దౌత్య ప్రయత్నాలకు ఫలితం దక్కింది. 48 దేశాలతో కూడిన ఎన్‌ఎస్‌జి కీలక సమావేశం జరుగనున్న తరుణంలో భారత్ సోమవారం స్విట్జర్లాండ్ మద్దతు సంపాదించగలిగింది. భారతీయులు స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో కూడబెట్టిన నల్లధనాన్ని వెలికితీయడంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి.

06/06/2016 - 08:19

వాషింగ్టన్, జూన్ 5: భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా జరుపుతున్న పర్యటన ఇరు దేశాల మధ్య భద్రతా దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, అలాగే గత ఎనిమిది సంవత్సరాల కాలంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏమేరకు వృద్ధిచెందింది అనే దానిపైన సరైన అవకాహన కల్పిస్తుందని అమెరికా విదేశాంగ విభాగం పేర్కొంది.

Pages