S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/10/2016 - 11:17

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అభ్యర్థిత్వం ఖరారైన హిల్లరీ క్లింటన్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మద్దతు తెలిపారు. డెమోక్రాట్లు ఒక్కటై రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడించాలని ఓ వీడియో ద్వారా ఒబామా పిలుపునిచ్చారు.

06/10/2016 - 00:01

మెక్సికో సిటీ, జూన్ 9: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వం పొందడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మెక్సికో దేశం మద్దతు తెలిపింది. అయిదు దేశాల పర్యటనలో చివరి మజిలీగా గురువారం మెక్సికో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్ పినా నీటోతో వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు.

06/09/2016 - 23:55

మెక్సికో సిటీ, జూన్ 9: అయిదు దేశాల పర్యటనలో భాగంగా గురువారం మెక్సికో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం లభించింది. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన అనంతరం మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పినా నీటో మోదీ ఉన్న కారును స్వయంగా నడిపారు. వాళ్లిద్దరూ కారులో ‘క్వింటోనిల్’ అనే రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ మోదీతో కలిపి నీటో శాకాహార భోజనం చేశారు.

06/09/2016 - 23:52

ఇస్లామాబాద్, జూన్ 9: ద్వైపాక్షిక చర్చల ప్రక్రియను దెబ్బతీసేందుకు ‘పఠాన్‌కోట్’ దాడిని భారత్ ఓ కుంటిసాకుగా చూపుతోందని పాకిస్తాన్ ఆరోపించింది. ఉగ్రవాద సంబంధిత అంశాలతోసహా ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్న అనేక ఇతర అంశాలను కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే పాకిస్తాన్ విధానమని ఆ దేశ విదేశ వ్యవహారాలలో ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ గురువారం మీడియాతో అన్నారు.

06/09/2016 - 23:51

బాగ్దాద్, జూన్ 9: ఇరాక్‌లో గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 27 మంది మృతిచెందగా డజన్లకొద్దీ గాయపడ్డారు. బాగ్దాద్‌లోని ఒక వాణిజ్య ప్రాంతంలో శక్తివంతమైన బాంబు పేలడంతో 15 మంది మృతిచెందగా, 35 మంది గాయపడ్డారు. తాజీ పట్టణంలో ఆర్మీ చెక్‌పోస్టు వద్ద జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతిచెందారు. వీరిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు కాగా, ఏడుగురు పౌరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

06/09/2016 - 23:48

వాషింగ్టన్, జూన్ 9: భారత్-అమెరికా సహజ మిత్రులని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న మైత్రి ఉన్నత శిఖరాలకు చేరిందని ఆయన వెల్లడించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యాపార, వాణిజ్య సంబంధాలు ప్రభావవంతమైనవని ఆయన స్పష్టం చేశారు. యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో బుధవారం రాత్రి ఆయన ప్రసంగించారు. భారత్-అమెరికాల సంబంధాల్లో కొత్తశకం ప్రారంభమైందని ఆయన తెలిపారు.

06/09/2016 - 23:46

లండన్, జూన్ 9: లండన్‌లో ఓ కొత్త హోటల్ వినూత్న పంథాలో వెలసింది. ‘బున్యాదీ’ అన్న హిందీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ హోటల్ లండన్‌లో తొలి నగ్న హోటల్‌గా ప్రారంభమైంది. బున్యాదీ అంటే పునాది అని అర్థం అని యజమానులు తెలిపారు. హోటల్‌కు వచ్చే వినియోగదారులు పూర్తి సహజత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునేందుకే ఈ హోటల్‌ను ప్రారంభించినట్లు వారు వెల్లడించారు.

06/09/2016 - 17:12

మాస్కో: యుద్ధ విమానం మాస్కో సమీపంలో గురువారం కుప్పకూలడంతో పైలట్‌ మరణించాడని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కూలిన సమయంలో అందులో ఆయుధాలు ఏమీ లేవని, కూలిన చోట ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

06/09/2016 - 17:08

ఆరిజోనా : అమెరికాలోని ఆరిజోనా అడవుల్లో గురువారం కార్చిచ్చు చెలరేగింది. సమీప ప్రాంతంలో వందల మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2013లోనూ ఇదే ప్రాంతంలో మంటలు చెలరేగడంతో 19 మంది మరణించారు.

06/09/2016 - 13:34

మెక్సికో: అయిదు దేశాల్లో పర్యటన ముగిసిన అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం మెక్సికో నుంచి భారత్‌కు బయలు దేరారు. ఈ నెల 4న ఆయన విదేశీ పర్యటనకు బయలుదేరి ఆఫ్ఘనిస్థాన్, ఖతార్, అమెరికా, స్విట్జర్లాండ్, మెక్సికోలో పర్యటించారు. ఆయా దేశాల అధినేతలతో దౌత్యపరమైన చర్చలు జరిపి పలు ఒప్పందాలను ఖరారు చేశారు. అమెరికాలో అత్యున్నత చట్టసభలో ఆయన మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.

Pages