S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

03/03/2016 - 06:31

క్విల్లింగ్ ఆర్ట్. ఇదొక కళ. ఖాళీ సమయాల్లో అద్భుతమైన కళాకృతులు చేయడానికి ఇదొక మార్గం. ఇప్పటికే ఎంతోమందిని ఆకర్షిస్తున్నది. దీన్ని పేపర్ ఫిలిగ్రీ అని కడా పిలుస్తారు. టర్కీ దేశపు ఇస్తాంబుల్ నగరానికి చెందిన ‘సెనరూన’ అనే అమ్మాయి చేతిలో రూపుదిద్దుకున్నవే ఈ కాగితపు కళారూపాలు.

03/02/2016 - 04:03

పులి అంటేనే భయం. పైగా దాని నోట్లో తల పెట్టటమా..? అమ్మో అని అనకండి. ఈ మహిళా వలంటీర్ చూడండి..పులితో ఎంచక్కా ఆడుకుంటుంది. మీరు కూడా ఇలా పులికి దగ్గరగా వెళ్లి దాని జుట్టును నిమరాలనుకుంటున్నారా..? అయితే థాయిలాండ్‌లోని పులి దేవాలయానికి వెళ్లండి. మీ సరదా తీరుతుంది. బ్యాంకాక్‌కు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. థాయిలాండ్‌లోని కాంచనపురిలో ఉన్న ఈ దేవాలయంలో ఇపుడు దాదాపు వంద పులుల వరకు ఉన్నాయి.

02/28/2016 - 00:53

యాలక్కాయ ఆహార పదార్థాలకు సహజసిద్ధమైన సుగంధం, కమ్మదనం ఇవ్వడమే కాదు, యాలకుల్లో ఔషధ గుణాలు కూడా చాలానే ఉన్నాయి.
‘యాలకుల్లో జీర్ణశక్తిని పెంచే గుణం ఎక్కువ. అందువల్ల యాలకులు, సోంపు, ధనియాల మిశ్రమాన్ని భోజనం తరువాత తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.
‘ఒక యాలక్కాయని నమిలి చూడండి. వౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసనను అరికట్టడమే కాకుండా, నోటిలోని బ్యాక్టీరియాను హరింప చేస్తుంది.

02/25/2016 - 21:55

బార్లీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఇటీవల నిర్వహించిన ఒక స్టడీలో ఈ విషయం వెల్లడైంది. బ్లడ్ షుగర్ ప్రమాణాలు తగ్గించడం ద్వారా డయాబెటిస్ రిస్కు లేకుండా చేస్తుందిట. ది లండ్ యూనివర్సిటీవారు ఈ అధ్యయనాన్ని చేశారు.

02/25/2016 - 03:36

భలే ఆలూ..పోషకాలు మేలు..!

02/24/2016 - 08:11

మరుగుతున్న నీటిలో టీపొడి, పంచదారతో పాటు అల్లం ముద్ద , నాలుగైదు తులసి ఆకులు కలిపి తాగితే గొంతులో గర గర తగ్గుతుంది.
* గ్లాసుడు నీటిలో కాస్త యాలకుల పొడి కలిపి తాగితే మూత్ర సంబంధమైన ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
* మిరియాలను, మిర్చిని ఆహారంలో తగు మోతాదులో వాడితే శరీర అధిక బరువును తగ్గించుకోవచ్చు.

02/20/2016 - 22:13

కంటికి ఇంపుగా కనిపించే క్యారెట్ తింటే అనేక అనారోగ్య సమస్యలను మన నుంచి దూరం చేసుకున్నట్లే. రోజూ ఓ క్యారెట్ చొప్పున తింటే శరీర ఛాయ పెరుగుతుంది. అంతేకాదు శరీరంలో తేమశాతం పెరుగుతోంది. అల్సర్, గ్యాస్ లాంటి సమస్యలు రెండు నెలల్లోనే అదుపులోకి వస్తాయి. ఇందులో లభించే బీటాకెరోటిన్ అనే పదార్థం విటమిన్ ‘ఏ’గా మారుతోంది. ’ఎ’ విటమిన్ కంటికి ఎంతోఅవసరం. కంటి సమస్యలు దరిచేరవు.

02/18/2016 - 21:30

మానవ శరీరానికి జింక్ ఎంతో అవసరం. పుట్టే బిడ్డ పిండంగా ఉన్నప్పటి నుంచే గర్భిణీ తగు మోతాదులో జింక్ తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ప్రతివారికీ రోజుకు కనీసం 15 మిల్లీ గ్రాముల జింక్ కావలసి ఉంటుంది. సాధారణంగా మనం తినే ఆహార పదార్థాల ద్వారా లభించే జింక్ శరీరానికి సరిపోతుంది.

02/17/2016 - 21:02

శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు సమృద్ధిగా ఉండాలి. పోషకాల్లో ఇవి ఎక్కువగా ఉండేలా తగిన ఆహారాన్ని ఎంచుకోవాలి. విటమిన్ మాత్రలను వేసుకోవడానికి అలవాటు పడడం కన్నా, అవి పుష్కలంగా లభించే ఆహారాన్ని విధిగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావాలి. ఇందుకు విటమిన్లతో కూడిన సమతుల ఆహారం అనునిత్యం తీసుకోవాలి.

02/17/2016 - 05:37

‘చీరకట్టులో నేను నా అసలు వయసుకన్నా పెద్దదానిలా కన్పిస్తానంటారు చాలామంది. కానీ నాకు చీరలంటే చాలా ఇష్టం. మన సంప్రదాయే అని కాదుగానీ...అవి కట్టుకోవడం నాకు సరదా’ అంటోంది జాతీయనటి అవార్డు గ్రహీత విద్యాబాలన్. చీరకట్టుకోవడం మాననే మానని తెగేసి చెబుతోంది. ‘మనం ఏం కట్టుకున్నామో, ఏం కట్టుకోవాలో ఎవరో చెప్పడం, మన వేషభాషలపై వేరెవరో వ్యాఖ్యానాలు చేయడం మన సమాజంలో లోపం.

Pages