S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

03/23/2016 - 23:24

* వంట పాత్రలు చక్కగా ఉండాలంటే సగానికి తరిగిన నిమ్మకాయ ముక్కని సాధారణ ఉప్పులో ముంచి బాగా రుద్దాలి. ఆ తరువాత ఒక పొడి గుడ్డతో గినె్నలో తడి లేకుండా తుడుచుకోవాలి.

03/19/2016 - 21:50

మన ఆహ్లాదం, ఆరోగ్యం వంటింటి శుభ్రతతోనే సాధ్యం. ఇంట్లో వస్తువులు వివిధ రకాల పాత్రలు ఎప్పటికప్పుడు కడిగి మురికి చేరకుండా తళతళలాడేలా ఉంచుకోవాలి. దీనికి మార్కెట్లో లభ్యమయ్యే సబ్బులు, పౌడర్లతోపాటు కొన్ని చిట్కాలు కూడా అవసరం.
* టీకప్పులు, చిన్న జాడీలు, సున్నితమైన గాజు, పింగాణీ వస్తువులను శుభ్రపరిచేప్పుడు సింకు అడుగున ఒక పాత బట్టని అమర్చుకోవడం మరవద్దు.

03/18/2016 - 01:14

కెరోటిన్ శరీరారోగ్యానికి కావలసిన పదార్థాల్లో ఒకటి. కెరోటినాయిడ్స్ చాలా రకాలైన కూరగాయల్లోనూ, పండ్లలోనూ, ఆకుకూరల్లోనూ లభిస్తాయి. పసుపు, ఎరుపు, నారింజ, ముదురు ఆకు పచ్చగా ఉండే కూరగాయల్లోనూ, పళ్ళలోనూ ఇవి ఉంటాయి. పుదీనా, కొత్తిమీర, పాలకూర, కరివేపాకు లాంటి ఆకుకూరల్లో కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది.

03/15/2016 - 22:15

అందానికి, ఆరోగ్యానికి అలోవెరా (కలబంద) ఫలితం గణనీయం. అలోవెరాకున్న ప్రాధాన్యతననుసరించే నేడు మార్కెట్‌లో సబ్బులు, జెల్, లోషన్స్.. ఎన్నో రూపాల్లో అలోవెరా ఉత్పత్తులు లభిస్తున్నాయి. శరీరాన్ని ఉత్తేజపరిచి చక్కటి అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే బయోలాజికల్ ఏజెంట్స్ దీనిలో పుష్కలంగా వున్నాయి. చర్మంలో తేమ నిలిచి వుండేలా చేయటంలో అవోలెరా సమర్థవంతంగా పనిచేస్తుంది.

03/13/2016 - 03:25

ఆడవాళ్ల చేతివేళ్లు ఏకంగా ఓ కూరగాయ పేరుకే సొంతమైంది. పొడవైన గోళ్లను పెంచటం కూడా ఓ కళే. ఆరోగ్యవంతమైన, పొడవైన గోళ్లను పెంచుకోవాలని ఎవరికి ఇష్టం ఉండదు. అందవిహీనంగా గోళ్లు కనబడుతున్నాయని బాధపడుకుండా కొన్ని పద్ధతులు పాటిస్తే అందమైన, పొడవైన గోళ్లు మీ సొంతమవుతాయి.

03/11/2016 - 00:50

వేసవి ఎండలు అప్పుడే చురుక్కుమనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ సీజన్‌లో ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. మున్ముందు భాను డు మరింత ప్రతాపం చూపించబోతున్నాడు. వేస వి తాపం నుంచి ఉపశమనం పొందడానికి, వడదెబ్బ తగలకుండా ఉండటానికి, చక్కటి ఆరోగ్యానికి కొబ్బరినీళ్లు ఉపకరిస్తాయి. ప్రకృతి ప్రసాదించిన కొబ్బరిబోండాలలోని నీళ్లలో ఉండే ఖనిజ లవణాలు అప్పటికప్పుడు శక్తిని అందజేస్తాయి.

03/10/2016 - 03:36

పరిమళ ద్రవ్యంగా పరిగణించే సోంపును మసాలా దినుసుల్లో వాడతారు. వీటిలో కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్పరస్, పొటాషియం, ధయామిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్, విటమిన్-సి, పార్మిటిక్ ఆమ్లం, పెట్రోసెలినిక్ ఆమ్లం వంటి పోషకాలు లభిస్తాయి. సోంపును తమలపాకులతో కలిపి తాంబూలంలో వేసుకుంటారు. ఔషధగుణాలున్న సోంపును గృహవైద్యంలో ప్రముఖంగా వాడతారు. భోజనం తర్వాత కాస్త సోంపు తింటే ఆరోగ్యరీత్యా మంచిది.

03/08/2016 - 21:53

మందులు వేసుకుంటే ఏడురోజులకు, అవి వేసుకోకపోతే ఎనిమిది రోజులకు జలుబు తగ్గిపోతుందనే నానుడి మనందరికీ తెలుసు. సీజన్ మారిందంటే చాలు చాలామందిని జలుబు పట్టి పీడిస్తుంది. ఇంటి వైద్యం చేసుకుంటే యాంటీబయాటిక్స్ వేసుకోకుండానే జలుబును తగ్గించుకోవచ్చు.
* జలుబు చేసినపుడు వేడి నీళ్లలో పసుపు బదులు యూకలిఫ్టస్ ఆకులను వేసి మరిగించి ఆ నీటిని ఆవిరి పట్టండి.

03/04/2016 - 22:28

పాదరక్షలు గుమ్మం బయటే వదిలేసే సంప్రదాయం మనది. దీనితోనె ఎక్కడెక్కడో తిరిగొచ్చిన పాదరక్షలతో దరిచేరే రోగకారకాలకు కొంతైనా దూరంగా వుండగలం. మన కాళ్లకు వేసుకున్న చెప్పులు, బూట్లతోనే ఎక్కువగా ఇల్లు మురికి కూపం అవుతుంది. అందుకే షూస్టాండ్స్‌తోపాటు డోర్ మ్యాట్ ఇంటిముందు అత్యవసర వస్తువు అని చెప్పక తప్పదు. వీటిలో ఎన్నో రకాలు, ఎనె్నన్నో డిజైన్లు, సైజులు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి.

03/03/2016 - 23:44

పైనాపిల్‌లో పోషక పదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. చర్మాన్ని మృదువుగా వుండేలా చేస్తాయి. మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఫైబర్, నీరు, విటమిన్ బి, సి, ఫోలిక్ ఆసిడ్ ఎంజైంలు లభిస్తాయి. ఈ పండులో లభించే బీటా కెరోటీన్‌ని శరీరం విటమినుగా మార్చుకుంటుంది. పైనాపిల్ ఔషధపరంగా ఉపయోగించడమే కాక శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఉదయం పైనాపిల్ రసాన్ని తాగితే చురుకుగా ఉత్సాహంగా ఉంటారు.

Pages