S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/01/2017 - 21:44

నైవేలీలో విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశంలో అక్కడ నైవేలీ సి.ఎం.డి. హ్యూమన్ రిసోర్స్ డైరెక్టర్ కోల్‌సెక్రటరీ వచ్చినప్పుడు ఓ 15 మందిని సైట్‌పైన అకస్మాత్తుగా ఇంటర్వ్యూ చేశారు. చెన్నై, ఢిల్లీ ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో ప్రముఖ సంస్థల్లో చదివామని, మేమంతా తెలుగువారమని, కోల్ సెక్రటరీకి చెప్పారు.

11/01/2017 - 00:49

బాల్యం బంగారమైతే, యవ్వనం వెండి లాంటిది. మరి వృద్ధాప్యం? కచ్చితంగా ఇది ఇనుమే. బంగారం, వెండితో పోలిస్తే ఇనుము ఖరీదు చాలా తక్కువ. ధర తక్కువే అయినా దాని అవసరం ఎక్కువ. అది మన అవసరాలన్నిటిని తీరుస్తోంది. భవనాలు నిర్మించడానికే కాదు, రైలు పట్టాలకి, వంతెనల నిర్మాణానికి, యంత్రాల తయారీకి ఇలా ఎన్నిటికో దాని అవసరం ఉంది.

10/29/2017 - 00:57

ప్రపంచంలో మతరాజ్యాలు చాలానే ఉన్నాయి. ముస్లింలకు, క్రైస్తవులకు మత ప్రాతిపదికన చెప్పుకునేందుకు చాలా దేశాలు ఉన్నాయి. మరి హిందువులకు ఒక్క దేశమైనా ఉన్నదా? హిందూమతం లేదా హిందూ ధర్మం మిగతా రెండు మతాలకన్నా చాలా ప్రాచీనమైనది. క్రీస్తునకు కొన్నివేల సంవత్సరాలకు ముందే భారతదేశంలో వేదాలు పుట్టాయి. ఇది అందరూ అంగీకరించిన, కాదనలేని సత్యం. ఇప్పుడే ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి అనవచ్చు.

10/28/2017 - 00:42

పొగాకు, నికోటిన్‌తో తయారు చేసిన చుట్టలు, సిగరెట్లు, చివరకు ఇ-సిగరెట్లు కూడా ప్రాణానికి ముప్పు తెచ్చిపెడతాయని అందరికీ తెలిసిన విషయమే. ధూమపానం అలవాటు లేకపోయినప్పటికీ పొగతాగేవారి పక్కన ఉండి పొగను పీల్చేవారికి కూడా ప్రమాదం తప్పదన్న విషయం కూడా చాలామందికి తెలుసు. అయినా బలహీనత, వ్యసవం వల్ల వాటిని చాలామంది మానలేకపోతున్నారు. అయితే తాజా అధ్యయనాలు మరికొన్ని ఆందోళనకర విషయాలను వెల్లడిస్తున్నాయి.

10/25/2017 - 21:37

సానుభూతి ఒక ఆయుధం. ఉపాధ్యాయునికి అదే బలం. ఉపాధ్యాయుడికి ఎంత మేధాశక్తి ఉన్నా బోధించిన విషయం విద్యార్థులు అందరికీ అందదు. పిల్లలు వివిధ నేపథ్యాల నుంచి వస్తారు. విద్యార్థులకు ఎన్నో శక్తులు అన్యాయం చేసి ఉంటాయి. అవన్నీ వారిని ప్రభావితం చేస్తుంటాయి. తరగతి గదికి వచ్చే ముందు వాటిని వదిలిపెట్టలేరు. ఇతర శక్తుల ముందు విద్యార్థి నిస్సహాయుడిగా ఉంటాడు.

10/24/2017 - 23:06

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసినట్లే. నవంబర్‌లో దేశంలో చాలాచోట్ల పెళ్లిబాజాలు మోగుతాయి. అయితే వస్తుసేవల పన్ను, పెద్దనోట్ల రద్దు వంటి చర్యల తరువాత వివాహాల ఖర్చు తడిసిమోపెడు కాబోతోందన్నది అందరినీ భయపెడుతోంది. పెళ్లి ఖర్చులు గతంతో పోలిస్తే అమాంతం పెరిగిపోతాయనడంలో సందేహమేమీ లేదు. ముఖ్యంగా జిఎస్‌టి బాదుడు ఫలితం ఇది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. అసోచామ్ అంచనా.

10/22/2017 - 00:36

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో ప్రస్తుతం మనం రెండో స్థానంలో ఉన్నాం. మరికొద్ది సంవత్సరాల్లో చైనాను తలదన్ని మనమే ఆ విషయంలో తొలి స్థానానికి చేరుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవలసి ఉంది. పౌష్ఠికాహార లోపంతో బాధపడేవారి సంఖ్యలో మన దేశం అగ్రస్థానంలో ఉంది. బలవర్థక ఆహారం అందక గర్భిణులు, నవజాత శిశువులు, ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల్లో మనదేశం మొదటి స్థానంలో ఉంది.

10/20/2017 - 23:06

మన సమాజంలో పోలీసుల పాత్ర అంత్యంత కీలకమైంది. వాస్తవంగా పోలీసులు లేని సమాజాన్ని మనం ఊహించలేం. పోలీసు శాఖ లేకపోతే నేరాలు విచ్చలవిడిగా జరగతాయనడంలో సందేహం లేదు. వారు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సమాజాన్ని రక్షిస్తూ ఉంటారు. మనం రోజూ రాత్రి 10-12 గంటల తర్వాత నిద్రపోతూ ఉంటాం. పోలీసుల డ్యూటీ ప్రధానంగా ఆ తర్వాతనే మొదలవుతుంది. గ్రామాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ పోలీసులు ‘బందోబస్తు’ డ్యూటీలో ఉంటారు.

10/18/2017 - 21:21

ఒకప్పుడు పిల్లలు బడిలో చేరి తరగతి గదికి వెళ్లాలంటే ఆరేళ్ల వయసు వచ్చేవరకు ఆగాల్సి వచ్చేది. ఈనాడు సమాజంలో వచ్చిన మార్పువలన మానసిక శాస్త్రంలో నూతన ఆవిష్కరణలవలన బడిలో గడపవలసిన సమయం ఎక్కువైంది. ఆనాడు 12 సంవత్సరాలే స్కూల్లో గడపటం జరిగేది. ఈనాడు పిల్లలు స్కూల్లో ఉండి తోటి సమాజంలో గడుపుతున్నది 15 సంవత్సరాలు. మొదటి మూడు సంవత్సరాలు బాల్యదశలో చాలా కీలకమైనదని విశే్లషిస్తున్నారు.

10/18/2017 - 00:16

ఉభయ తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతూ పోవడం అత్యంత బాధాకరం. విద్యావ్యవస్థ దుస్థితికి, సామాజిక వైఫల్యానికి అద్దంపట్టే ఉదంతాలు, జరగాల్సిన పెద్ద స్థాయి సంస్కరణల అవసరాన్ని పట్టి చూపిస్తున్నాయి. పైపై ప్రకటనలు, పైపూత మందులతో ఈ దుస్థితి మార్చడం సాధ్యం కాదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాయి.

Pages