S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్చిమసాలా

03/05/2017 - 01:06

రాష్ట్ర విభజన సమయంలో పరస్పరం విమర్శించుకున్న ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఈరోజు సఖ్యతగా ఉండేందుకు నేతలు తీసుకుంటున్న చొరవ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ సిఎం కెసిఆర్, మంత్రుల బృందం తిరుమల వెంకన్న సన్నిధిలో మొక్కులు చెల్లించారు. తిరుమలలో మర్యాదల పట్ల కెసిఆర్ సంతృప్తి చెందారు. ఉమ్మడి గవర్నర్ సమక్షంలో ఆస్తుల పంపకంపై చర్చలు ఆశాజనకంగా సాగుతున్నాయి.

02/26/2017 - 00:40

ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి వలస వెళతారో తెలియక, రాజకీయాలంటేనే ప్రజల్లో ఇప్పుడు ఏహ్యభావం నెలకొంది. అయితే, అధికారంలో ఉన్నా లేకున్నా కేంద్రమంత్రి వెంకయ్య మాత్రం క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నారు. ఆయన ఏ సభలో పాల్గొన్నా వేదికపై ఉన్నవారు, సభికులు నిశ్శబ్దంగా ఉండాల్సిందే. ముఖ్య వ్య క్తులైనా, ఇతరులైనా అటూ ఇటూ కదలడానికి కూడా అవకాశం ఉండదు.

02/19/2017 - 08:21

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఒకప్పుడు కళకళలాడుతూ ఉండేది. నాయకులకు దుస్తులు అమ్మే వాళ్లు అక్కడ అరడజను మంది ఉండేవాళ్లు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నపుడు సైతం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కళ తప్పకుండా నేతలు జాగ్రత్త పడ్డారు. ఏపిలో తెదేపా అధికారంలోకి వచ్చినా తెలంగాణలో చిక్కిశల్యం కావడంతో ఎన్టీఆర్ భవన్‌పైనా ఆ ప్రభావం పడింది.

02/12/2017 - 00:28

కొంతమంది వాక్చాతుర్యం ఇతరులను ఇట్టే దిగ్భ్రమకు గురిచేస్తుంది. కాంగ్రెస్ నేత జానారెడ్డి ‘ఏదైతే ఉందో..’ అంటూ మొదలు పెట్టి, సుదీర్ఘంగా మాట్లాడినా ఆ యన ఉపన్యాసం ఏదైతో ఉందో ఎవరికీ అర్థం కాదు. ‘ఇంత దారుణమా?’ అని ఆశ్చర్యపోయేవాళ్లకు ఆయన మాటతీరే అంత అన్పిస్తుంది. ఇలాగే, కాస్త నోరుజారి వెంటనే మాట మార్చిన ఏపి స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై బిజేపి నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.

02/05/2017 - 06:53

ఇటీవల ఓ గజదొంగ తన పెళ్లి రిసెప్షన్‌కు సహచర దొంగలందరినీ ఆహ్వానించాడు. భారీ ‘సౌండ్ బాక్సు’లతో పాటలు పెట్టించి దొంగలతో కలిసి డాన్సు కూడా చేశాడు. ఇదంతా బహిరంగంగా జరుగుతుంటే స్థానికులు దొంగల సందడి గురించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ, వారిని పట్టుకునేందుకు ఇదే మంచి అవకాశమని చెప్పారట. అందుకు సదరు పోలీసు అధికారి స్పందిస్తూ- ‘పోనీలే పాపం..

01/29/2017 - 02:37

పవన్‌కల్యాణ్ సినిమాల్లో పంచ్ డైలాగులకు కొదవుండదు. అలాగే, ఆయన రాజకీయ ఉపన్యాసంపై సామాజిక మాధ్యమాల్లో అంతకు మించిన పంచ్ డైలాగులు పేలుతున్నాయ. తమిళనాట జరిగిన జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో ఏపికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని పవన్ పిలుపు ఇచ్చారు. తీరా ఆయనే విశాఖ బీచ్‌కు వెళ్లలేదు. కానీ, తెలంగాణకు చెందిన చిన్న హీరో సంపూర్ణేష్ బాబు విశాఖ వెళ్లి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

01/22/2017 - 07:04

ఆర్నెళ్లు సావాసం చేస్తే ‘వారు వీరు.. వీరు వారవుతార’ని పెద్దలంటారు. కేంద్ర మంత్రి వెంకయ్య , సిఎం చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత తరచూ చెట్టపట్టాలేసుకొని తిరగటం ఎక్కువైంది. సాధారణంగా ఏ సభలోనైనా ముందుగా సభికులకు క్రమశిక్షణపై వెంకయ్య ‘క్లాస్’ తీసుకుంటారు. అయితే, గన్నవరం ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం సందర్భంగా చంద్రబాబు వెంకయ్య పాత్రను పోషించి అందర్నీ విస్మయపరచారు.

01/08/2017 - 07:55

అసెంబ్లీలో తమ పార్టీ సభ్యులు పాండవుల పాత్రను పోషిస్తున్నారని, తాను ధర్మరాజుగా వ్యవహరిస్తున్నానని సిఎల్‌పి నేత కె. జానారెడ్డి మీడియా మిత్రులను నవ్వించారు. ‘మీలో భీముడు జీవన్‌రెడ్డేనా?’ అని ఓ విలేఖరి ప్రశ్నించగా, సందర్భాన్ని బట్టి తమ పాత్రలు మారుతుంటాయని, తాను మాత్రం ఎప్పటికీ ధర్మరాజునేనని తేల్చిచెప్పారు.

01/01/2017 - 00:29

పీత బాధ పీతది అన్నది తెలుగులో బహుళ ప్రచారం పొందిన సామెత. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆమ్యామ్యాలకు అలవాటుపడ్డ వారు గత 50 రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నారట. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం అనంతరం వీరికి బాధలు మొదలయ్యాయట. ప్రతి రోజూ ఠంచనుగా ఉదయం ఆఫీసుకు వచ్చేవారు..

12/18/2016 - 04:56

‘2019 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుంది. ముఖ్యమంత్రి అయ్యేది నేనే’- అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ప్రకటించి అందరి దృష్టిలో పడ్డారు. అసెంబ్లీ లాబీల్లో ఇదే విషయాన్ని ఆయన వద్ద మీడియా ప్రస్తావిస్తే, ‘నేనే ముఖ్యమంత్రి అని చెప్పలేదు, వాళ్లు అలా రాశారు, ఎ వరైనా అలా చెబుతారా? అక్కడున్న వాళ్ల అంతా ననే్న ముఖ్యమంత్రిగా ఉండమన్నారు..’ అని వివరించారు.

Pages