S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/10/2016 - 04:40

ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వారు దేశంలో నూరు పట్టణాలను దశలవారీగా స్మార్ట్‌గా తీర్చిదిద్దుతామంటూ ప్రకటించారు. అయతే తొలివిడతగా వారి కొలమానాలను అనుసరించి కొన్ని పట్టణాల పేర్లను పేర్కొన్నారు. అందులో కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పట్టణాలను పేర్కొని మొదటినుంచీ వూరిస్తూ వచ్చిన వరంగల్‌ను వదిలేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పట్టణానికీ ఆ భా గ్యం కలిగించలేదు.

02/09/2016 - 05:35

ఆరుగాలం కష్టించి పండించిన రైతుల పంటకు డబ్బులు చెల్లించడంలో తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) పాలకుల వైఫల్యం చెందారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి వలె తయారైంది అన్నదాతల పరిస్థితి. తెలంగాణలో ఈసారి తీవ్రమైన కరవు వుంది. నీరులేక పొలాలు, ఇతర చేనులు ఎండిపోయాయి. పెట్టిన పెట్టుబడి తిరిగి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

02/08/2016 - 01:24

దేశంలోని ప్రజలందరికీ సత్వర న్యాయం అందించాలన్నదే మన న్యాయశాస్త్రం యొక్క ప్రథమ లక్ష్యం. అందుకే ‘న్యాయం అందించడంలో ఆలస్యం అయితే, న్యాయం నిరాకరించబడినట్లే’అనే సూక్తి మన న్యాయవ్యవస్థ నినాదంగా స్వీకరించింది. ‘మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడపదాటవు’అన్న చందాన మన దేశంలో న్యాయవ్యవస్థ పనితీరు ఉంది.

02/05/2016 - 23:37

దేశంలోని అరాచక శక్తులు, కుహనా సెక్యులరిస్టులు, మెజారిటీ సమాజం వారి విశ్వాసాలను అధిక్షేపించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని వితండ వాదాలతో యాగీచేస్తూ ఏదో విధంగా తమ పబ్బం గడుపుకోవాలి అని తెగ తాపత్రయ పడుతున్నారు. వీరికితోడు మీడియావారి కాకిగోల ఉండనే ఉన్నది. నిన్నమొన్నటివరకు ఆవుచుట్టు ప్రదక్షిణం చేసినవారు ఇప్పుడు హిందూ దేవాలయాల చుట్టూ పొర్లుదండాలు పెడుతున్నారు.

02/05/2016 - 06:04

‘చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం’లో మన పాలకులు నిష్ణాతులు. పూటగడిస్తే చాలు, రేపటి సంగతి రేపు చూసుకొందాం అన్న ధోరణి మన నేతలలో ఎక్కువగా కనిపిస్తున్నది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా గంగా జలాల శుద్ధి ప్రాజెక్ట్‌ను చెప్పుకోవచ్చు. ఎనబైయ్యవ దశకం మధ్యలో ప్రారంభమైన గంగాజలాల శుద్ధీకరణ నేటివరకు పూర్తి కాలేదు. ఎప్పటికీ పూర్తి అవుతుందో ఎవరికీ తెలియదు.

02/05/2016 - 05:56

ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంకోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలి. ఊరూరా వాడవాడలా ఎయిడ్స్ నివారణకోసం చైతన్య కార్యక్రమాలు నిర్వహించి భారతదేశం నుంచి పారద్రోలాలి. ఎయిడ్స్ అనేది ఆరోగ్య సమస్యకాదు, వ్యక్తిగత సమస్య కాదు, అదొక సామాజిక సమస్య, అదొక ఆర్థిక సమస్య, అదొక నైతిక సమస్య. ఎయిడ్స్ సోకి తల్లిదండ్రులు మరణిస్తే వారి పిల్లలు అనాధలై బజారులో పడుతున్నారు. ప్రపంచానికి ఈ సమస్య పెనుసవాలుగా మారింది.

02/04/2016 - 05:31

ద్రావిడ భాషలు 27. అందులో అయిదు మినహాయించి మిగతావి అన్నీ కూడా గిరిజన భాషలు. ఇందులో ఎక్కువ గిరిజన భాషలు అంతరించే ప్రమాద స్థాయిలో ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, తుళు భాషలలో అభివృద్ధిచెందిన సాహిత్యం ఉంది. అంతేకాదు వాటికి లిపులు ఉన్నాయి. కాగా మిగతా 22 భాషలకు లిపి లేదు. అవి అలిఖితంగా గిరిజన భాషలుగా ఉన్నాయి.

02/04/2016 - 05:29

ఉపాధ్యాయులంతా రెగ్యులర్‌గా స్కూలుకు వస్తారా?
ఈ ప్రశ్న నన్ను చాలా బాధపెట్టింది. ఇది దేశ స్థాయిలో ప్రభుత్వం అడగవలసిన ప్రశ్నకాదు. దేశంలో ప్రతి డిపార్ట్‌మెంటులో కూడా మంచిచెడు రెండూ ఉంటాయి. మన దేశంలో వృత్తికి అంకితమైన ఉపాధ్యా యులు లేకుంటే, తల్లితండ్రి తరువాత గురువు అనే మాటే ఈ నేలలో ఉద్భవించకపోయేది.

02/03/2016 - 06:27

విద్యాబోధన వైద్యం అనే రెండింటిని ఇంగ్లీషులో బుల్‌ప్రొఫెషన్సు అన్నారు అనగా అన్ని వృత్తులలోకి ఇవి తలమానికాల వంటివి. ఒకనాడు చదువు చెప్పడానికి వైద్యం చేయడానికి ధనం తీసుకునే వారు కాదు. ఔషధ విక్రయం కూడా పాపమని భావించేవారు. ఆరోజులు గతించాయి. వైద్యం సంగతి అలా ఉంచుదాం. విద్య విషయం ఇప్పుడు పూర్తిగా ధనంతో ముడిపడి ఉంది. ఉచితంగా చదువు చెప్పేవారివద్దకు ఎవరూ వెళ్లరు.

02/03/2016 - 06:26

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. ఈ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆత్మహత్యల్లో ఇది తొమ్మిదవది. అయితే విశ్వవిద్యాలయాల్లో పదుల సంఖ్యలో ఆత్మహత్యలు జరిగినా ఎవరూ స్పందించలేదు. కానీ రోహిత్ మృతి మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక వాస్తవాలను పరిశీలిద్దాం.

Pages