S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/07/2015 - 04:11

డిసెంబర్ 6వ తేదీని వివిధ ముస్లిం సంస్థలు, వారి సర్వకాల స్నేహితులు, కమ్యూనిస్టులు-రక రకాల అంత్య ప్రత్యయాలను తగిలిగించుకున్నవారు- ప్రముఖ మార్కిస్టు మేధావులు ‘బ్లాక్ డే’గా పాటించారు. 1992, డిసెంబర్ 6వ తేదీన బాబ్రి కట్టడాన్ని కూల్చివేయడం వీరు ఈ విధంగా బ్లాక్ డేను పాటించడానికి ప్రధాన కారణం.

12/07/2015 - 04:08

ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని అక్షరాల అమలుచేయాల్సి ఉండగా పాలకులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ ఆశ కార్యకర్తలను వెట్టిచాకిరికి గురిచేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అందించే సేవలు అమలుకావాలంటే క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల పాత్ర కీలకం. ఆశా కార్యకర్తలకు అధికారులు అందించే వేతనం దినసరి కూలీ కంటే అధ్వాన్నంగా ఉంది. వెట్టిచాకిరి చేయించుకుని అరకొర పారితోషికం ఇస్తున్నారు.

12/05/2015 - 04:00

ఏ మతానికో చెందిన వారిగా కాకుండా, కేవలం ఒక దేశపౌరులుగా నాగరికత కలిగిన మానవులుగా కాసేపు ఆలోచిద్దాం.. కేవలం ఒక మతంపై ద్వేషంతో, తమ దౌష్ట్యాన్ని ప్రదర్శించడానికి, ‘కవ్వింపు చర్యగా’ మతకలహాలకు దారితీస్తూ, దేశాన్ని అశాంతి పాలు చేసే అనాగరక కృత్యంగా స్పష్టంగా కనబతుతున్న అంశం: బహిరంగంగా గోమాంస భక్షణను ప్రకటించడం, సవాలు విసరడం.

12/04/2015 - 03:48

జనం ఆకలిని తీర్చే రైస్‌మిల్లు పరిశ్రమ సంక్షోభంలో కూరుకొని పోయింది. కోట్ల రూపాయలు పెట్టి రైస్‌మిల్లు పరిశ్రమను స్థాపిస్తే, పాలకుల తలాతోక లేని పాలసీలు, అధికారుల నిర్లక్ష్యంవల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పారాబాయిల్డ్, రా రైస్‌మిల్లులు మూతపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోను సుమారు 4వేల వరకు రైస్ మిల్లులు ఉన్నాయి.

12/04/2015 - 03:45

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 మేరకు హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని, అలాగే అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని విభజించేందుకు చర్యలు తీసుకోవాలి. ఈమేరకు గవర్నర్ చొరవ ప్రదర్శించి తగు ఏర్పాట్లుచేయాల్సిన అవసరాన్ని ప్రస్తుత పరిస్థితులు నొక్కిచెబుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ (రాజేంద్రనగర్)లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రెండుగా విభజించారు.

12/03/2015 - 03:08

ఆటవిక సమాజంలో వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువుంటుంది. సమాజ నియంత్రణ త క్కువుంటుంది. రక్షణ, భద్రతా తక్కువే. శారీరక బలం, మందిబలం వున్నవారిదే అక్కడ అధికారం. సభ్యసమాజంలో వ్యక్తిస్వేచ్ఛ తక్కువుంటుంది. సమాజ నియంత్రణ ఎక్కువుంటుంది. కాని రక్షణ భద్రత వుంటాయక్కడ. వ్యక్తి, సమూహం, గణం, పౌరసత్వం, సమాజం, రాజ్యం- ఇది రాజ్యావిర్భావానికి పరిణామక్రమం!

12/03/2015 - 03:06

తరగతి గది నాలుగుగోడల మధ్యన సంభాషణేనా? నాలుగు గోడలను పెకలించి సమాజంతో సంధానం చేయటమా? అనే సవాలును ఎదుర్కొంటున్నది జ్ఞానం. జ్ఞానం కోసమే అని కొందరనేవారు. కానీ నేడు జ్ఞానం సమాజం కోసమనే భావన ప్రపంచమంతటా విస్తరించింది. అదే కోణంలో చర్చించబడుతున్నది. చదువు పూర్తయిన తర్వాత ఆ చదువు వాడకం గురించి ఆలోచించటం వెనుకటి పద్ధతి.

12/02/2015 - 05:34

కేంద్రంలో తన పలుకుబడి దెబ్బతినకుండా చంద్రబాబునాయుడు రాష్ట్ర రాజకీయాలను నడుపుతుంటారు. 1995లో చంద్రబాబునాయుడు రాష్ట్రం లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి భారత రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూనే వచ్చారు. 1996లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ ఏర్పడిన సందర్భంగా కాంగ్రెస్-బి.జె.పి.ల ప్రత్యామ్నాయంగా యునైటెడ్ ఫ్రంట్ రూపొందడంతో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు.

12/02/2015 - 05:33

ఆర్థికాభివృద్ధితోపాటు సాంఘిక న్యాయం సాధించాలని మన ప్రణాళికలు ఆశించాయి. అయితే, ఈ దిశగా ప్రగతి ఆశించిన స్థాయిలో లేదు. ఈ రెండు లక్ష్యాల సాధనలో బ్యాంకులు కీలకపాత్ర పోషించవలసి వుంది. ఈ కారణం గానే 1969లో 14 వాణిజ్య బ్యాంకులు, 1980లో మరో ఆరు బ్యాంకులు జాతీయం చేయడం జరిగింది. ఇందువల్ల గ్రామ ప్రాంతాలలో బ్యాంకు శాఖల సంఖ్య బాగా పెరిగింది. 1969లో మొత్తం శాఖలలో గ్రామీణ శాఖల శాతం 22 మాత్రమే.

12/01/2015 - 05:11

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన కులాలు (బీసీ)లో కొన్నింటికి రిజర్వేషన్ ఫలాలు అందడంలో ఆర్థికంగానూ, ఉద్యోగపరంగానూ బయటపడ్డాయి. మరికొన్ని కులాలు ఇంకా వెనుక బాటలోనే ఉన్నాయి. ఎప్పటికపుడు కొత్తకులాలు జాబితాలోకి చేరుతుండటంతో బీసీ జాబితా చాంతాడంత రూపుదిద్దుకొంది. ఉత్తరాంధ్రలో వ్యాపారమే ప్రధాన వృత్తిగా నడిపే వైశ్యకులాల్ని బీసీ జాబితాలో చేర్చారు.

Pages