S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

01/22/2016 - 23:36

మన తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది విద్యార్థులు స్కాలర్‌షిప్ రాక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు విద్యార్థులకు స్కాలర్‌షిప్ సరియైన కాల వ్యవధిలో అందడంలేదు. మైనారిటీ విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు స్వస్తిచెప్పే పరిస్థితి వస్తోంది. మన తెలంగాణా ముఖ్యమంత్రి జిల్లా అయిన మెదక్‌లో చాలాచోట మైనారిటీలకు స్కాలర్‌షిప్ రావడం లేదు.

01/21/2016 - 23:46

నియోజకవర్గాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ప్రమేయానికి, క్రియాశీలక పాత్రకోసం నిర్దేశించబడిన ఎం.పి. లాడ్స్ నిధులు పెద్దఎత్తున దుర్వినియోగం అవుతున్నాయన్న కాగ్ తాజా నివేదిక క్షేత్రస్థాయిలో ఈ పథకం వైఫల్యానికి తార్కాణంగా నిలుస్తోంది. ఈ విధమైన ఎంపీ స్థానిక ప్రాంత పథకం మన దేశంలో తప్ప ఎక్కడా అమలులో లేదన్నది స్పష్టం.

01/21/2016 - 04:24

‘కంచెలో కన్నాల’ గురించిన సంపాదకీయం బాగుంది. బ్రిటిష్‌వారు కుటిలనీతిని ప్రయోగించి, చరి త్రను వక్రీకరించి దేశాన్ని ద్వేషించడమే నాగరికత అన్న స్థాయలో కానె్వంట్లలో పాఠాలు చెప్పించారు. అందువల్ల ప్రజలకు దేశభక్తి పనికిరాని పదార్థమైపోయం ది. అయ్యర్ లాంటి వారు పాక్‌కు వెళ్లి మోదీని దించేస్తే కాని శాంతి చర్చలు జరుగవని ప్రకటించడం దారుణం. మరో దేశంలో అయతే దేశద్రోహం కింద అయ్యర్‌ను జైల్లో పెట్టి ఉండేవారు.

01/20/2016 - 06:03

విశాఖనగరంలో కొండ వాలు ప్రాంతాలలో పెద్దఎత్తున ఆక్రమణలకు పాల్పడుతూ స్థిర నివాసాలను ఏర్పాటుచేసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాలలో గుడిసెలు వేసుకునేందుకు అనుమతులు రానందున నగరంలో కొండలను, గుట్టలను ఆక్రమించుకుంటున్నారు. కొండవాలు ప్రాంతాలలో నిర్మాణాలు ప్రమాదంతో కూడుకున్నవని తెలిసినా గతిలేని పరిస్థితులలో పేదలు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇటువంటి 25వేల కుటుంబాలు ప్రమాదాల అంచున జీవిస్తున్నారు.

01/18/2016 - 23:59

పృథ్వీరాజ్ 16 సార్లు మహమ్మద్ ఘోరీని ఓడించి, క్షమించి వదిలేశాడు. 17వ సారి ఘోరీ మహమ్మద్, ఫృథ్వీరాజ్ చౌహాన్ని తరైన్ యుద్ధంలో ఓడించి, కళ్లు పీకించి, గుర్రానికి కట్టి లాక్కెళ్లాడు. భారత్ నుంచి బంగారాన్ని గుర్రాల మీద, స్ర్తిలను బానిసలుగా తీసుకెళ్లాడు.

01/18/2016 - 07:34

నేడు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు చాలా ఉన్నాయి. అయితే వాటిల్లో పిల్లల్ని చేర్పించాలంటే చాలా కష్టం. చేతినిండా డబ్బులుండాలి. ఫీజులు, డొనేషన్లు, యూనిఫార్మ్‌లు, అవీ ఇవీ అంటూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. కొందరు తల్లిదండ్రులు పేదవారైనా అప్పులు చేసి మరీ ఈ బడుల్లో చేర్చి తమ ఇంటిని గుల్ల చేసుకుంటున్నారు. ప్రభుత్వాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. వారు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు తెరవడం లేదు.

01/15/2016 - 08:01

గోద్రా సామూహిక హత్యాకాండ తరువాత జరిగిన మతకల్లోలాలను సాకుగా తీసుకొని నరేంద్ర మోదీని దోషిగా చూపడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసులు వేసి, సిట్‌ను నియమించి శతవిధాలా ప్రయత్నించింది. కానీ ఏ తప్పూ చేయని మోదీ నిర్దోషిగా బయటపడ్డారు. కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదు.

01/14/2016 - 04:18

భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా 10 రోజులపాటు ప్రదర్శించిన దశావతారాలలో శ్రీరాముడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అలంకరింపబడినాడని ప్రతికలలో చదివి, సీతారాముల పేర్లు మార్చలేదు కదా అని చాలా సంతోషించాము.

01/13/2016 - 07:07

కాల్‌మనీ కాల్‌మనీ.. అంటూ ప్రకంపనలు సృష్టించింది ఓ ఉదంతం... అప్పిచ్చిన వారంతా దుర్మార్గులని తీసుకొన్నవారు పత్తిత్తులు అన్న భావనకు వూతమిచ్చింది మీడియా. వ్యవసాయం గిట్టుబాటు కాదు తనకున్న కాడెద్దులు ఎకరం నేలతో తనకు ఆత్మహత్యే గతి... ఈ స్థితిలో వ్యవసాయం భారమైన పరిస్థితిలో తన ఎకరా పొలం అమ్మి సగం బ్యాంకులో వేసుకొన్నాడు డిపాజిట్టుగా.. మి గతా సగం ప్రయివేటు వ్యక్తులకు రూపాయిన్నర వడ్డీకిచ్చాడు..

01/12/2016 - 07:00

తే.గీ. అల నరేంద్రుండు భువిలోన అవతరించి
యమ నియమ సాధనాల బల విమల యశుడు
అల విదేశ జనుల మధ్య విలసితముగ
అప్రతిరథుడై గర్జించె అద్భుతముగ
తే.గీ మంచి వాగ్థాటి గలవాడు-మాన్యుడితడు
మాతృదేశ భక్తుండు-సమర్థుడగుచు
రామకృష్ణుని శిష్యుండై రాజసముగ
భారత రాయబారిగ నిల్చె భవ్యమూర్తి
తే.గీ. శంఖనాదము పూరించి జంకు లేక
భారత ఖ్యాతి తెల్పిన సారమతివి

Pages