S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

03/14/2016 - 00:42

2016...17 తెలంగాణ బడ్జెట్ సమావేశాలను ప్రారం భిస్తూ గవర్నర్ నరసింహన్ తెలంగాణ ప్రభుత్వం లక్ష్యా లను ఉభయ సభల్లో ఆవిష్కరించిన తీరు బాగా ఉంది. తాగునీరు, సాగునీరు, నీటి ప్రాజెక్టులు, జలవనరుల వినియోగం, మిషన్ కాకతీయ రెండోదశ కార్యక్రమాలు, మిషన్ భగీరథ లక్ష్యాల సాధన దిశగా కదిలితే బంగారు తెలంగాణ సాధ్యమే. నేతలు, అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ లక్ష్యాలను అమలు చేయాలి.

03/11/2016 - 23:54

రైల్వే బడ్జెట్, జనరల్ బడ్జెట్‌లు సమర్పించారు. కాని ఆంధ్రప్రదేశ్‌కు గాని, మధ్యతరగతి ప్రజలకు గాని, పేదలకు గాని, నిరుద్యోగులకు గాని మేలు జరిగింది లే దు. ముఖ్యంగా ఆంధ్రకు ఇస్తామన్న విశాఖ రైల్వేజోన్ మాట లేదు. ప్రత్యేక హోదా వూసే లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర కరువు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు లేవు. మన ముఖ్యమంత్రి నోరు మెదపలేదు. వెంకయ్యగారు మాట్లాడలేదు.

03/10/2016 - 04:29

ఈసారి ఫిబ్రవరిలోనే ఎండలు తీవ్రమయ్యాయ. ఇక పదవ తరగతి పరీక్షల సమయంలో భానుని ఉగ్ర రూపం ఎట్లా ఉంటుందో తలచుకుంటేనే భయమేస్తున్నది. ఈసారి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు తోడు, ప్రచండమైన ఎండలతో కఠిన పరీక్షను ఎదుర్కోనున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చల్లని మంచినీటి సదుపాయం అన్ని పరీక్షా కేంద్రాల్లో విధిగా ఏర్పాటు చేయాలి.

03/08/2016 - 23:39

కళ్ళున్నా చూడలేని ఓ కబోది సమాజమా!
మానవత్వం మంటగలిపిన ఓ మానవ సమూహమా!
సమాజాన్ని కాపాడేది చట్టం కాదు, సంస్కారం సుమా!
సంస్కారాన్ని సమాథి చేసి చట్టాన్ని నిందిస్తున్నావు
అత్యాచారాలు, హత్యాచారాలని, అఘోరిస్తూ అరుస్తున్నావు
అన్ని అనర్థాలకు, అఘాయత్యాలకు, కారణం నీవు
ఔను. నీవే! కాసులకోసం రాకాసి వైపోతున్నావు
మానవత్వాన్ని మంటగలుపుతూ మరెవ్వరిని నిందిస్తున్నావు

03/08/2016 - 05:19

ఆంధ్రలో ఆయుర్వేద కళాశాలల్లో చదివిన వారికి వాస్తవిక పరిజ్ఞానం దాదాపు లేదు. ఆ కళాశాలల్లో ఔషధ మొక్కల్ని పెంచడం-ఆ మొక్కల గురించి విద్యార్థులకు వివరించే ఓపిక అధ్యాపకులకు ఉండదు. ఆయుర్వేదంలో యోగా ఒక భాగం. కానీ యోగా ప్రాముఖ్యం విద్యార్థుల కి తెలిసింది సున్న. చివరికి ఉమ్మెత్త, కానుగ, గుంటకల గర లాంటివి కూడా తెలియదు. చాలామంది ప్రాక్టీసు పెట్టుకున్న వారు, అల్లోపతి మందులు ఇస్తున్నారు.

03/07/2016 - 04:49

మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నారు. మనదేశం వ్యవసాయ దేశం అని మరిచిపోయారు. వ్యవసాయం అభివృద్ధి చెందకపోతే దేశం అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి కుంటుపడుతుందనే విషయం మరిచారు. దేశ ప్రజల దైన్య స్థితిని మరిచిపోయారు. ఈ ప్రభుత్వాలు రెండు వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు మరిచి ప్రజలను మభ్యపెడుతున్నారు.

03/04/2016 - 23:28

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2015 డిశంబరు నాటికి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లకు రెండు విడతల డిఎ వాయదాలు ఇవ్వవలసి ఉన్నది. డిఎ ఇవ్వనందువల్ల ముఖ్యంగా పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి పెన్షనర్ల ఇబ్బందులను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారు రిటైరై ఉన్నారు కదా. డిఎ విడుదలకు ఏడాది కాలం ఎందుకు పట్టిందో అర్థం కాదు. రాష్ట్ర విభజన కారణమా? ఆర్థిక దుస్థితి కారణమా?

03/04/2016 - 06:27

తొలగని తోడేలు పేరిట ప్రచురితమైన సంపాదకీయం ఎంతో ఆలోచనాత్మకంగా ఉంది. జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్రవాదుల దాడులకు ఆస్తినష్టం ప్రాణనష్టం బాగా జరుగుతోంది. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలతో తీవ్రవాదుల దాడులను అరికట్టడం సాధ్యం కాదు. కార్యశీలత కావాలి.

03/03/2016 - 05:51

ఇటీవల డిఎస్సీ పరీక్షా విధానంలో వికలాంగులకు వారికి కొన్ని స్థానాలను కేటాయించటంలో పక్షపాత వైఖరి కనిపిస్తున్నది. వికలాంగులకు నిర్ణీత సంక్షేమ పథకాల నిర్వహణ మరి ఉద్యోగ నియామక విధానాలు కేవలం చట్టాలకే పరిమితమైనాయ తప్ప, అమలుకు నోచడం లేదని స్పష్టవౌతోంది. ఇప్పటికైనా ఏ కులం వారైనప్పటికీ రిజర్వేషన్ సదుపాయమున్న వికలాంగులకు న్యాయం చేకూరుతుందా?
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు

03/02/2016 - 04:53

ప్రజలకోసం ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఎం.ఎల్.ఏ.లు (వీరందరు పబ్లిక్ సర్వెంట్స్‌గా పిలువబడుతారు) ఎన్నో చట్టాలు చేసారు. చేస్తున్నారు. ఆ చట్టాలలో ఉన్న సెక్షన్లు, జివోలు ప్రజల పాలిట యమపాశాలుగా, ఉరితాళ్ళు అవుతున్నాయి. ఈ చట్టాల ఉరితాళ్ళు పబ్లిక్ సర్వెంట్సు చేతుల్లో పగ్గాలుగా ఉన్నాయి. వీటితో ప్రజలను బెదిరించి లంచాలు పిండుతున్నారు. తనకు న్యాయం ప్రకారం రావలసిన దానికోసం ఏ ఒక్కరు లంచం ఇవ్వరు.

Pages