S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

04/14/2016 - 22:58

స్ర్తీలనుకొన్ని దేవాలయాల్లోకి రానీయకుండా ఉం డటం వివక్షకు నిదర్శనం అని తెలంగాణ రాష్ట్ర ఐద్వా అధ్యక్షులు కె.ఎన్. ఆశాలత అన్నారు. ఐద్వా కమ్యూనిస్టు పార్టీ మహిళా విభాగం. కమ్యూనిస్టులు ఏలిన, ఏలు తున్న ఏ ఒక్క దేశంలో కూడ మహిళలు ప్రధాన మంత్రి, దేశాధ్యక్షులు, సెక్రెటరీ జనరల్‌గా గాని అవలేదు. మన దేశంలో బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో కమ్యూనిస్టు మహిళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించలేదు.

04/14/2016 - 05:31

తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టమేమో కాని ఉమ్మడి రాష్ట్రంలోనూ, తర్వాత రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమకు గురౌతూనే ఉన్నారు. రాజకీయ అవసరాలకోసం అధికార పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వ నేతలు రాజీపడిపోతూ ఆకర్షణీయమైన ప్రకటనలు, వాగ్దానాలు చేస్తూ ప్రజలను దశాబ్దాలుగా మభ్యపెడుతూనే ఉన్నారు.

04/13/2016 - 07:44

రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ దేశ సార్వభౌమత్వానికి కళంకం కలిగించే విధంగా వ్యాఖలు చేయడం క్షమార్హం కాదు. దేశానికి ప్రాతినిధ్యం వహించి చట్టసభలో ప్రతినిధిగా ఉన్నవారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఇతరులను వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ముమ్మూటికీ తప్పు. ప్రతి పౌరుడు తన మాతృభూమి పట్ల భక్తి, విధేయతలతో, దేశ పరిరక్షణకు అంకితం కావాలి.

04/12/2016 - 00:14

యూనివర్సిటీలు సరస్వతీ నిలయాలు. అవి చాలా పవిత్రంగా వుండాలి. అక్కడ రాజకీయాలుండకూడదు. ఉగ్రవాదుల్ని సమర్ధించే వారిని వెంటనే కటకటాల వెనక్కి పంపించాలి. వాళ్ళని సమర్ధించిన వారిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలి. మొక్కయి వంగనిది మానై వంగునా అనే సామెత గుర్తుందిగా.

04/11/2016 - 05:16

ప్రభుత్వాసుపత్రులలో జన సంజీవని పథకం క్రింద ప్రారంభించిన జనరిక్ మందుల షాపులు మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. తొలుత ప్రచారం చేసినట్లుగా కాకుండా ఈ మందులు ఇతర బ్రాండెడ్ కంపెనీ మందుల వలే చక్కగా పనిచేస్తుండడమే కాకుండా వాటి ధరలలో 50 శాతానికే లభించడంవలన పేద, మధ్యతరగతి ప్రజలకు మంచి వెసులుబాటుగా వుంటోంది.

04/09/2016 - 00:15

తెలంగాణాలో కె.సి.ఆర్, ఆంధ్రలో చంద్రబాబు ఆకర్ష్ విధానంలో తీరు ఒక్కటేనని చెప్పవచ్చు. నిన్న మొన్నటివరకు తెలంగాణా టిడిపి నాయకులు టి.ఆర్.ఎస్‌లో చేరినపుడు విమర్శలు గుప్పించిన టి.డి.పి నేతలు ఆంధ్రాలో చంద్రబాబు చేస్తున్న దానిపై సమాధానం చెబుతారా? ఆకర్ష్ పథకం పేర వై.ఎస్.ఆర్. పార్టీ నాయకులను టిడిపి పదవుల పేరుతో ఆశచూపటం సిగ్గుచేటు.

04/07/2016 - 22:47

నేడు ప్రపంచవ్యాప్తంగా ధనిక, పేద అనే తేడాలు లేకుండా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలలో అత్యంత ప్రధానమైనది ఊబకాయం. ఆధునికత పేరుతో మన ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, జీవనశైలిలో మార్పులే ఈ ఊబకాయం రావడానికి ముఖ్యకారణం. ద గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డీసెజెస్ స్టడీ- 2013 పేరిట ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై నిర్వహించిన సర్వే ఫలితాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

04/07/2016 - 22:45

ఓ ఉగాదీ!
సంక్రాంతితో సంలీనమై
రమణీయ విరాజితమై
జనావళి గుండెలపై
మానవతా సందేశాల్ని
రంగరించే నీ దృక్పథం
ఎందరికి తెలుసు?
నీ రాగపూర్ణ హృదయాప్యాయతల
ఆరాటం అర్థమయ్యేదెవరికి?
బతికినంతకాలం
ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ
సహజ సౌందర్యంతో
పువ్వుల్లా కాయల్లా
ఉద్వేగ వివశత్వంతో
జీవన గమ్యం చేరుకోమని
హెచ్చరించేదెవరు?

04/07/2016 - 06:31

1) మంచి ఆరోగ్యపలవాట్లు బెంచుయెపుడు
గాలి, ఆహారమన్నది కల్తిలేక
నీరు, నిర్మల తత్వంబు నిలువలుంచి
మేలు గూర్చెడి భావాలు మేప చాలు!
2) ధూమపానంబు మనిషికి దోషమొసగు
మధ్యపానంబ, నారోగ్యమందజేయు!
నాశ నత్యాసగామార్చ? నాశనంబె!
మనసు కల్మషమందకే మనుగడుంచు!
3) ఇంట, పరిసర మంతట కంటబడిన
చెత్తకుప్పల నూడ్చుము చేటు దొలగు!
మురికి కాలువ కుంటలో ముసురుకొన్న

04/06/2016 - 07:09

మద్యం మత్తులో డ్రైవర్లు వాహనాలను నడిపి ప్రమాదాలకు కారకులు కావడం పలువురిని కలవరపెడుతున్నది. ఎన్ని దుర్ఘటనలు జరిగి, ఎంతమంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలసినా వీటిని అదుపులో పెట్టలేకపోవడం అధికారుల వైఫల్యాన్ని సూచిస్తున్నాయి. కేవలం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దనో, టోల్‌గేట్ల వద్దనో డ్రైవర్లకు మద్యం పరీక్షలు నిర్వహించినంత మాత్రాన ప్రమాదాలు ఆగిపోవు.

Pages