S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

05/20/2016 - 00:42

ప్రజాస్వామ్యాన్ని రక్షించమంటూ ఇటీవల ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభలో‘‘ఎన్డీయే ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తోంది, నాగపూర్ నుంచి ఆర్‌ఎస్‌ఎస్ రిమోట్‌తో ప్రభుత్వాన్ని నడుపుతోంది’’ అంటూ సోనియా,‘‘దేశాన్ని ఇద్దరే పాలిస్తున్నారు. వారు మోదీ, మోహన్ భాగవత్’’2 అంటూ రాహుల్ ద్వ జం ఎత్తడం గురివిందలు తమ నలుపెరుగని చందంగా ఉంది.

05/19/2016 - 07:31

విశాఖ రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు, అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాంటీన్ నిర్మాణం వంటి అధునాతన హంగుల స్థాపనకోసం కృషిచేస్తున్న రైల్వేశాఖ స్టేషన్‌లో తిష్టవేసుకున్న కొన్ని ముఖ్య సమస్యలపై కూడా దృష్టిసారించాలి. బుకింగ్ కౌంటర్ల కొరత కారణంగా ప్రయాణీకులు కనీసం గంటసేపు క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. స్టేషన్‌లో దొంగల బెడద బాగా ఎక్కువైంది. రైల్వేట్రాక్‌లు మలమూత్రాలతో నిత్యం అపరిశుభ్రంగా వుంటున్నాయి.

05/18/2016 - 00:00

అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుండి విశాఖ నగరాన్ని ఎడ్యుకేషన్ హబ్, ఇండస్ట్రియల్ హబ్, నాలెడ్జిహబ్, టూరిజమ్ హబ్, హెల్త్‌హబ్, స్పోర్ట్స్ హబ్‌ల క్రింద తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటనల హోరు గుప్పిస్తోంది. ఈ హబ్‌ల క్రమంలో మరిన్ని త్వరలో చేరనున్నాయని మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇఎఫ్‌ఆర్ సందర్భంగా ఇటీవల నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం తప్పించి నగరాభివృద్ధి ఏ విధంగా కానరావడం లేదు.

05/17/2016 - 06:43

బిజెపి కార్యక్రమంలో సంజయ్‌దత్ పాల్గొనడాన్ని విమర్శించేవారికి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియదనాలి. రాజమాత సింధియా బిజెపిలో ఉండగా ఆమె పుత్రుడు కాంగ్రెస్‌లో లేడా? అనేక కుటుంబాల్లోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉండటం చూస్తూనే ఉన్నాం. సంజయ్‌దత్‌ని బిజెపి ఆకర్షించడం జాతి విద్రోహం అంటున్నాడు, కాంగ్రెస్ నేత నిజాముద్దీన్. మరి ఒవైసీ సోదరులను ఈ పెద్దమనిషి విమర్శించడేం.

05/16/2016 - 06:33

తమని, తమ మతాన్ని అవమానించేవారిని ముస్లింలు, క్రైస్తవులు ఎంతమాత్రం సహించరు. హిందువులే నోరుమెదపరు కనుక అందరికీ లోకువైపోయారు. ఈమధ్యే వారిలో కొద్దిపాటి మార్పు కనిపిస్తోంది. సకల సదుపాయాలూ, వైభోగాలు అనుభవిస్తూ కూడా షారూక్‌ఖాన్, అమీర్‌ఖాన్‌లు దేశంలో అసంతృప్తి పెరిగిపోతున్నది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోపగించిన కొన్ని హిందూ సంఘాలు వారి సినిమాలను బహిష్కరించగా అమీర్ కళ్లు తెరచుకున్నాయి.

05/14/2016 - 00:40

గతంలో ఎప్పుడైనా ప్రకృతి వనరున నీళ్లను కొనుక్కున్నామా? నీటిలో మందులు కలిపి తాగామా? ఈ నదులు, జలాశయాలు అన్నింటిని మానవుడే కలుషితం చేయడం వల్ల మందులు కలిపిన నీటిని తాగి అనారోగ్యం పాలు కావలసి వస్తోంది. మినరల్ వాటర్ పేరిట వ్యాపారం అభివృద్ధి చెందింది. చెట్లను నరకడం, వాహనాలు విపరీతంగా పెరగడం వల్ల పీల్చే గాలి కూడా కలుషితమైపోతోంది.

05/12/2016 - 23:29

నాగరిక సమాజం ఈ భూమిపై వర్ధిల్లుతున్న నాటినుండి హిందు మతం ప్రాచుర్యంలో వుంది. హిందు మతం అనేది ఒక మతం కంటే మానవుల శాస్తబ్రద్ధ జీవిత విధానం అంటే సమంజసంగా వుంటుంది. హిందు మతంలో వున్న అనేక సత్సంప్రదాయాలు, నియమావళి నుండి రూపురేఖలు మార్చుకొని అనేక ఇతర మతాలు ఉద్భవించాయి.

05/12/2016 - 08:20

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రముఖ కళాకారుడు అయిన నందమూరి తారకరామారావు హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ నడిబొడ్డున బుద్ధ విగ్రహం నెలకొల్పి, సాగర్ గట్టు పొడవునా ప్రముఖులైన తెలుగు వారి విగ్రహాలను ప్రతిష్ఠించి, రహదారి రెండు వైపులా స్వాగత ద్వారాలను నిర్మించి తెలుగువారి కీర్తిని ఇనుమడింపజేశారు.

05/11/2016 - 02:36

ముస్లిం స్ర్తిలు మసీదుల్లో ప్రవేశం గురించి ఇటీవల కొత్తగా వివాదం తలెత్తింది. అంతేకాక ఇటీవల కేరళలోని ఓ మసీదులో స్ర్తిలను అనుమతించడం వంటి వార్త ఆశ్చ ర్యం కలిగించింది. ఇది కొత్త విషయం కాదు. ఎందుకంటే ముస్లిం స్ర్తిలు మసీదుల్లో ప్రవేశించి నమాజు చేసుకోవడం చాలాచోట్ల జరుగుతున్నదే. అంతెందుకు..హాజ్‌కు వెళ్లినప్పుడు పవిత్రమైన మక్కాలోని ప్రసిద్ధి చెందిన మసీదులో స్ర్తిలకు ప్రవేశం ఉంది.

05/09/2016 - 23:30

ఒకనాడు ఉపాధ్యాయులను తమ బిడ్డలను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేవారి వారిగా ఎంతో గౌరవభావంతో మెలిగేవారు. తమ పిల్లలు ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఉపాధ్యాయులే పునాది అని భావించేవారు. అలాగే టీచర్లు కూడా అంకిత భావంతో విద్యార్థులను తమ సంతానంగా భావించి చదువు నేర్పేవారు. బెత్తానికి పనిచెప్పి శిక్షించినా తల్లిదండ్రులు ఏమీ అనేవారు కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు తమ బిడ్డల అభ్యున్నతిని ఆశించేవారు.

Pages