S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

08/14/2018 - 00:31

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడం, తమ వ్యవహార శైలిపై దేశ ప్రజలు ముఖ్యంగా గ్రామీణులు ఆగ్రహంతో ఉన్నారనే వాస్తవాన్ని గ్రహించిన అధికార, ప్రతిపక్షాలు పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఎలాంటి గొడవ లేకుండా ముగించాయి. పార్లమెంటు ఉభయ సభలు గత పది పదిహేనుళ్లుగా గందరగోళం మధ్య కొనసాగడం తెలిసిందే.

08/06/2018 - 23:20

బంగ్లాదేశీ చొరబాటుదారుల వల్ల దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంటే రాజకీయ పార్టీలు మాత్రం ఓటు బ్యాంకు కోణంలోనే వ్యవహరిస్తున్నాయి. అస్సాంలో ‘జాతీయ పౌర రిజిష్టర్’ (ఎన్‌ఆర్‌సీ) వ్యవహారాన్ని అధికార, ప్రతిపక్షాలు తమ రాజకీయల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు. ఎన్‌ఆర్‌సీ వ్యవహారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదిపివేస్తోంది.

07/30/2018 - 23:51

ఇంతకాలం పార్లమెంటు ఉభయ సభల్లో రాజకీయ యుద్ధం చేసిన కాంగ్రెస్,్భజపాలు ఇప్పుడు సభాహక్కుల ధిక్కార నోటీసులతో ఆధిపత్యం చాటుకునేందుకు సిద్ధమయ్యాయి. ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల వ్యవహారంపై ప్రభుత్వం లోక్‌సభను తప్పుదోవ పట్టించిందంటూ ప్రధాని నరేంద్ర మోదీపై, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌పై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసులు ఇచ్చింది.

07/23/2018 - 23:09

అధికార, విపక్ష పార్టీలు ఇప్పుడు అర్ధసత్యాలు, అసత్యాలు, తప్పుదోవ పట్టించే మాటలతో
పార్లమెంటును సైతం భ్రష్టుపట్టిస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై గత శుక్రవారం లోక్‌సభలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై పనె్నండు గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ ఇందుకు

07/16/2018 - 22:16

దేశ ప్రయోజనాల దృష్ట్యా జమిలి ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలూ మద్దతు ఇవ్వడం ఉత్తమం. రాజకీయ ప్రయోజనాల కంటే దేశ శ్రేయస్సు, జనం మేలు ముఖ్యమనే వాస్తవాన్ని ముఖ్యంగా విపక్ష పార్టీలు అర్థం చేసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలకు పట్టుపడుతున్నారు కాబట్టి వ్యతిరేకించాలని విపక్షాలు ఆలోచించడం తగదు.

07/09/2018 - 23:53

జాతీయ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయ పార్టీలు ప్రధాన పాత్ర నిర్వహించే పరిస్థితులు నెలకొంటున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ రాజకీయ ప్రాధాన్యత తగ్గుముఖం పట్టటంతో ప్రాంతీయ పార్టీలు 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నాయి.

07/02/2018 - 23:39

ప్రధాన మంత్రి నఠేంద్ర మోదీ పట్ల ఇపుడు ఇంటా బైటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. భాజపాలో ఆయన తర్వాత ఎవరు? అనే ప్రశ్న కూడా కొంతమంది లేవదీస్తున్నారు. మోదీ మరోసారి ప్రధాని అవుతారా? అనే అనుమానాలను సైతం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు అధికార పగ్గాలు దక్కకుండా చూడటమే తమ విద్యుక్త్ధర్మమనే పద్ధతిలో విపక్ష పార్టీల సమీకరణలు జరుగుతున్నాయి.

06/25/2018 - 23:45

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి గవర్నర్ పాలన మొదలైంది. పీడీపీ అధినేత్రి, ముఖ్యమంత్రి మెహబూ బా ముఫ్తీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి భాజపా మద్దతు ఉపసంహరించుకోవటంతో గవర్నర్ పాలన అనివార్యమైంది. ఈ పరిణామాలకు పీడీపీని కంటే భాజపాను తప్పుపట్టవలసి ఉంటుంది. ముఫ్తీతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ‘కమల దళం’ చేసిన అతిపెద్ద తప్పు.

06/19/2018 - 00:07

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక నేత లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ధర్నా చేయడం బాధ్యతారాహిత్యం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల పేరిట చేస్తున్న ఈ అరాచక రాజకీయాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాల్సిందే. మన దేశంలో రాజకీయం మితిమీరిపోతోంది. నేతలు తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం ప్రజా ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. ఇదిలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం అనేదే లేకుండాపోతుంది.

06/11/2018 - 23:42

కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ అని మరోసారి రుజువైంది. మా జీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో స్వయం సేవకులను ఉద్దేశించి మాట్లాడేంత వరకు వేచి ఉండకుండానే- నోటికొచ్చింది మాట్లాడి తమ పరువు తామే తీసుకున్నారు. అందరికీ సహసం గురించి పాఠాలు చెప్పేవారు తమకు అసహనం ఎక్కువ నిరూపించుకున్నారు.

Pages