S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

08/08/2016 - 23:46

గోవుల రక్షణ పేరుతో కొందరు చేస్తున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవలసిన సమయం వచ్చింది. గోరక్షణ పేరుతో కొందరు చేస్తున్న రాజకీయం సమాజాన్ని నిలువునా చీలుస్తున్నాయి. మత ఘర్షణలతోపాటు కుల వివక్షకు దారి తీస్తున్నాయి. ఈ సంఘటనల మూలంగా దేశానికి అంతర్జాతీయ స్థాయిలో చెడ్డపేరు వస్తోంది.

07/26/2016 - 00:12

రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవనేది మరోసారి భాజపా రుజువు చేసింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశంలోని అతి పెద్ద దళిత నాయకురాలు మాయావతిని వేశ్యతో పోల్చటం ద్వారా భాజపా రాజకీయ ఆత్మహత్యాకు ప్రయత్నించింది. ఎన్నికలకు ముందు తమ కాళ్లను తామే నరుక్కోవటం భాజపాకు వెన్నతో పెట్టిన విద్యగా మారుతోంది.

07/18/2016 - 23:42

శత్రువుకు శత్రువు మన మిత్రుడు. అదే విధంగా శత్రువుకు మిత్రుడు మన శత్రువు అవుతాడు. అందుకే భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో మరణించిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనిని తమ మిత్రుడుగా ప్రకటించిన పాకిస్తాన్ మనకు శత్రువు అవుతుంది. బుర్హాన్ వనిని అమరవీరుడుగా ప్రకటించి అతని సంస్మరణార్థం జూలై 19 తేదీ నాడు బ్లాక్ డే నిర్వహిస్తున్న పాకిస్తాన్‌ను మన శత్రుదేశంగా ప్రకటించాలి.

07/11/2016 - 23:42

తన ఆలోచనా విధానానికి అనుగుణంగా నడుచుకోకపోతే సన్నిహిత మంత్రులకు సైతం నూకలు చెల్లుతాయనేది ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గం విస్తరణతో స్పష్టం చేశారు. బి.జె.పి విధానాలతోపాటు తన విధానాల లక్ష్య సాధనకు పని చేయకపోతే సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా మంత్రి పదవులు ఊడుతాయి, శాఖలు మారిపోతాయనేది మోదీ చెప్పకనే చెప్పారు.

07/05/2016 - 04:42

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారి కేంద్ర ప్రభుత్వం ఉరుకులు, పరుగులపై పని చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను కష్టపడి పని చేయటంతోపాటు మంత్రులు, అధికారుల చేత పని చేయిస్తున్నారు. దేశానికి ఇది శుభ పరిణామమని చెప్పకతప్పదు. నరేంద్ర మోదీ మంత్రుల పని తీరును ఎప్పటికప్పుడు సమీక్షించటంతోపాటు అధికారుల పని తీరును కూడా సమీక్షించటం హర్షణీయం.

06/27/2016 - 23:26

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్.ఎస్.జి సభ్యత్వం కోసం అహర్నిశలు చేసిన కృషి నిష్ఫలమైంది. తెర ముందు చైనా, తెర వెనక పాకిస్తాన్ చేసిన కుతంత్రాల మూలంగా అణు సరఫరాదారుల బృందంలో భార త దేశానకి సభ్యత్వం లభించలేదు. భారత్‌కు సభ్యత్వం నిరాకరిస్తున్నట్లు ఎన్.ఎస్.జి రెండు రోజుల ప్లీనరీ సమావేశానంతరం శక్రవారం ప్రకటించింది. నరేంద్ర మోదీ ఇటీవల పలు దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులతో జరిపిన చర్చలు వృధా అయ్యాయి.

06/21/2016 - 04:37

ఉత్తర ప్రదేశ్ శ్యాలీ జిల్లాలోని ఖైరానా పట్టణం నుండి హిందువులంతా వలస పోతున్నారు. ముస్లింలు మెజారిటీలో ఉన్న ఖైరానా పట్టణంలో తాము జీవించటం కష్టసాధ్యమైపోతోందన్నది వారి ఫిర్యాదు. మెజారిటీ ప్రజలుండే ప్రాంతాల్లో మైనారిటీలకు నిలవ నీడ లేకుండా చేయటంనేది అత్యంత తీవ్రమైన సమస్య.

06/13/2016 - 23:57

నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పటి నుండి విదేశాల్లో భారత దేశం పేరు మారుమోగిపోంది. భారత దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. భారత దేశం పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తోంది, దేశంలో పెద్ద ఎత్తున మార్పు వస్తోందనే అభిప్రాయం విదేశీయులకు కలుగుతోంది. వ్యాపార వాణిజ్య రంగంలో కూడా అంతర్జాతీయ స్థాయిలో భారత దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు వస్తోంది.

06/07/2016 - 00:45

భాజపా కలలు కంటున్న కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని స్వయంగా కాంగ్రెస్ సాధించిపెడుతుందా? అనే అనుమానం కలుగుతోంది. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా నియమించే అంశంపై సీనియర్లు, జూనియర్ల మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరాటం ఈ అనుమానాన్ని కలిగిస్తోంది.

05/31/2016 - 00:28

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన నిరాశపరిచిందంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేసిన ప్రకటన సత్యదూరం. మోదీ ప్రభుత్వం ప్రచారం, ప్రసంగాలు తప్ప సమర్థ పాలనను అందజేయలేకపోతోందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శ వెనక రాజకీయం తప్ప మరేమీ లేదు. ఎన్.డి.ఏ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో సమర్థంగానే పని చేసింది.

Pages