S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

04/07/2016 - 22:50

మతాచారాలు, సంప్రదాయాల పాటింపు విషయంలో ఎంతో వైవిధ్యత కలిగిన హిందూమతానికి చెందిన వేలాది దేవాలయాల్లో స్ర్తిపురుషులకు సమానంగా ప్రవేశార్హత ఉన్నది. ఏవో అతి స్వల్ప సంఖ్యలోని దేవాలయాలను ఉదాహరణగా చూపుతూ గోరంతలను కొండతలు చేస్తూ నానా రభస చేయడం వెనుక నిగూఢమైన అజెండా దాగివున్నదనండంలో ఎంతమాత్రం సందేహం లేదు.

04/07/2016 - 06:27

తొలికిరణం మొలకలెత్తి
పులకించెను భువనతలం
ఎలకోయిల కొమ్మలెక్కి
పలుకుతోంది మధుగీతం
యుగయుగాల ప్రస్థానపు
ప్రగతికి ఇది సంకేతం...
శుభ వసంత శోభల
సుమ పరిమళాల సంస్కారం

04/06/2016 - 07:04

యమునా తీరంలో వేణుగానం వీనులవిందు చేసింది. అందరికీ ఆనందాల బృందావని నిలిపిన ఆ జగన్నాటక సూత్రధారి మళ్లీ దిగివచ్చి జనాన్ని ఓలలాడించాడా అన్న చందంగా మార్చి 11, 12, 13 తేదీల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ప్రపంచ సంస్కృతీ సమ్మేళనం జరిగింది.

04/04/2016 - 23:29

1835, ఫిబ్రవరి 3న ఒక బ్రిటీషు ఆఫీసర్, లండన్‌కు ఒక జాబు రాశాడు. ‘‘మనం ఎంత కష్టపడ్డా మన సంస్కృతిని ఈ జాతిలో నాటడం కష్టం. అందుకు అర్ష సంస్కృతి అడ్డం వస్తున్నది. అందుకని ఈ జాతివారికి ఇంగ్లీషు మీద ప్రేమ, ఆర్ష సంస్కృతి మీద ద్వేషం వ్యాపింపజేయాలి.’’ అదీ లేఖ సారాశం. ఆ తరువాత రాజమండ్రి వుడ్ వర్డ్ డిస్పాచ్ ప్రకారం ఆంగ్లవిద్యా ప్రణాళిక రూపొందింది. ఎఫ్.ఎ, బి.ఎ, ఎం.ఎ. విధానం అమల్లోకి వచ్చింది.

04/04/2016 - 06:26

తెలంగాణ నీటి పథకాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో ఇచ్చిన ప్రజంటెషన్‌ను కాంగ్రెస్ వారు బహిష్కరించడాన్ని చూసినప్పుడు, తెలంగాణలో కొన్ని రోజులుగా ఈ పవర్ పాయిం ట్ ప్రజంటేషన్ గురించి విస్తృతంగా జరుగతున్న చర్చలో, కాంగ్రెస్ వైఖరికి సంబంధించిన ప్రశ్న అనివార్యంగా ముందుకు వస్తున్నది. మనకు తెలుస్తున్నదానిని బట్టి నగరాల నుంచి గ్రామాల వరకు ఇదే పరిస్థితి ఉంది.

04/03/2016 - 03:14

ప్రైవేటు పలల ఫీజుల నియంత్రణకై ఒత్తిడి తేవడం కన్నా, ప్రభుత్వ పాఠశాలల్ని సక్రమంగా నడపాలని కోరవచ్చు. ఉద్యమాన్ని లేవదీయవచ్చు. ఇదే జరిగితే, ఇరు రాష్ట్రాల్లో అమోఘమైన పౌర స్పందన లభిస్తుంది. మనకోసమే అలోచిస్తే, మనం మాత్రమే బాగుపడవచ్చు. సమాజం కోసం ఆలోచిస్తే సామాజిక న్యాయం జరిగి ఓ ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్కరింపబడి, అందరికి రాజ్యాంగ నిర్దేశిత ప్రకారం ఒకే తీరుగల నాణ్యతతో కూడిన విద్య అందుతుంది.

04/02/2016 - 02:41

భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్ తూర్పు ఐరోపా ఖండ రాజ్యాలకు మాత్రమే కుదించుకుపోతుందా? ఎందుకంటే ఈయూ ఏర్పడిన తొలినాళ్లనాటి స్వర్ణయుగం ఇప్పుడు గడచిపోయన చరిత్ర. అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. దీంతో పాటు ప్రపంచం కూడా మారిపోయింది. నాటి సోవియట్ యూనియన్ అదృశ్యమైపోయింది.

04/01/2016 - 00:16

సమస్యల సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హరీష్ రావత్ ప్రభుత్వానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం తాను తీసుకున్న చర్య ద్వారా తీరని అన్యాయమే చేసింది. ప్రజాభిప్రాయానికి, ప్రభుత్వ చర్యకు మధ్య లంకె కుదరినిది సరీగ్గా ఇక్కడే. ప్రజామోదంతో తీసుకున్న నిర్ణయానికి, హక్కుగా తీసుకునే నిర్ణయానికి మధ్య చాలా తేడా ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తనకు హక్కు ఉన్నది కదా అని నిర్ణయం తీసుకోవడాన్ని ఎవ్వరూ సమ్మతించరు.

03/31/2016 - 00:03

అమాయకంగా కొందరు, అయోమయం గా కొందరు, అజ్ఞానంతో కొందరు, విద్రోహబుద్ధితో మరికొందరు భరతమాత ధ్యాసను కోల్పోవడం శతాబ్దుల చరిత్ర. ఈ శతాబ్దుల విదేశీయ దురాక్రమణ సాగిన నాటివి, భావదాస్యం వదలని నేటివి...‘‘్భరత్ మాతా కీ జై’’ అని అన్నందుకు ఒక విద్యార్థిని కొందరు చితకబాదడం ప్రతీక మాత్రమే. రోగం దీర్ఘకాలికమైంది.

03/29/2016 - 23:53

కన్నయ్య కుమార్‌కు మద్దతిస్తున్న పార్టీల బలం పార్లమెంటులో 0.68 శాతం మాత్రమే. కన్నయ్యకుమార్‌కు లూథియానాకు చెందిన జాహ్నవి అనే 15 ఏళ్ల బాలిక సవాలు విసిరింది. భావ ప్రకటనా స్వేచ్ఛకూ కొన్ని హద్దులున్నాయని ఆమె 29 ఏళ్ల కన్నయ్యకుమార్‌కు హితవు చెప్పింది. 12,14 ఏళ్ల వయసున్న చెన్నైకి చెందిన శ్రవణ్ కుమరన్, సంజయ్ కుమరన్‌లు 11 రకాల యాప్‌లను సృష్టించారు. ఐఐఎమ్‌లలో ప్రజంటేషన్ ఇచ్చారు. మీడియా వారి గురించి రాయదు.

Pages