S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

,
06/19/2016 - 02:20

రాజకీయాల్లో నైతిక విలువలు నేతిబీర చందం. రాజకీయాల్లో నైతిక విలువలు దిగజారుతున్నాయని, తాము విలువల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నామని, అసలు తామొక్కరే నైతిక మడి కట్టుకున్నామని ఎవరైనా చెబితే, సదరు నైతికమూర్తుల వ్యక్తిత్వాన్ని నిలువునా శంకించాల్సిన రోజులివి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఈమధ్య ఫిరాయింపు రాజకీయాలపై వాపోయారు. రాజకీయాలు ఇంతగా దిగజారాయని మహా ఆవేదన చెందారు.

06/18/2016 - 00:19

నసీరొద్దీన్ కొడుకుతో కలిసి గాడిదను తోలుకుంటూ సంతకు పోతుంటాడు. ఎదురుపడిన కొందరు, గాడిదను నడిపించుకుంటూ మీరు నడుచుకుంటూ పోవడమేంటని ఆశ్చర్యపడతారు. దీంతో కొడుకును గాడిదపై ఎక్కించి తాను నడుస్తాడు. ఈ దృశ్యాన్ని చూసిన మరికొందరు, తండ్రి నడుస్తూ, కొడుకును గాడిదపై కూర్చుండబెట్టడమేంటని అంటూ వాపోతారు.

,
06/16/2016 - 23:35

అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలు సహజంగానే ప్రపంచం అంతటా ఆసక్తి కలిగిస్తుంటాయి. సంవత్సరం పైగా జరిగే ఈ ప్రక్రియ కలిగించే ఆసక్తి బహుశా మరే దేశాధినేత ఎన్నిక కలిగించదు. అయితే ఈ సంవత్సరం జరుగుతున్న ఎన్నికలు తీవ్రమైన అలజడిని కలిగిస్తున్నాయి.

06/16/2016 - 05:23

రాజ్యాంగపు వ్యవహారాలకు రాజకీయాలను పులమడం, రాజకీయ ప్రయోజనాలకు రాజ్యాంగపు ముసుగును తొడగడం దశాబ్దులుగా నడిచిపోతున్న తతంగం. అందువల్లనే రాజ్యాంగ సంస్కరణల గురించి ఏకాభిప్రాయం కుదరలేదు..లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరగడానికి వీలైన పద్ధతులను సూచించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అధ్యయన సంఘాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఏకాభిప్రాయం గురించి మళ్లీ ధ్యాస కలుగుతోంది.

06/15/2016 - 03:46

గ్రీన్‌హౌజ్ శాతం జనహననం
వాయువుల వివరాలు
ఉత్పత్తి రంగం (సంవత్సరానికి)
........................................................................
కట్టడాలు, 6.4 4.3 మిలియన్లు
నిర్మాణాలు
రవాణా 14 1.0 మిలియన్లు

06/13/2016 - 23:58

పాశ్చాత్యులు భారత్‌ను వదిపెట్టిపోతే దేశం అభివృద్ధి చెందుతుందనేది స్వాతంత్య్రోద్యమకాలంలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న మాట. ఇది కొంతవరకు నిజమే కాని అసలు పాశ్చాత్యులు భారతదేశాన్ని ఎలా జయింపగలిగారనే అంశాన్ని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. 1947 తరువాత మహాత్మాగాంధీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సిద్ధి తర్వాత కాంగ్రెస్ అవసరం దేశానికి లేదు. అందుకని ఈ రాజకీయ పక్షాన్ని రద్దు చేయండి అని కోరాడు.

06/13/2016 - 04:56

కవి అయినవాడు తన కావ్యరచనను కుకవి నిందతో ఆరంభించాలి. తర్వాత గొప్ప కావ్యం ఒకటి రచించి పండితులను, పామరులను మెప్పించాలి. అపుడు లోకం ‘్భళిరా, కవిరాజా’ అని కీర్తిస్తుంది. మన ప్రతిపక్షాలకు కుకవి నింద బాగా తెలుసు. కాని సత్కావ్య రచనలోకి ఎట్లా వెళ్లాలో తెలియదు. కనుక తమ వాక్‌ప్రగాల్భ్యమంతా కుకవి నింద చుట్టూనే పరిభ్రమిస్తుంటుంది. తర్వాత రాయవలసింది కవితా రూపం తీసుకోకుండా ‘అకవిత’గా మిగులుతుంది.

,
06/12/2016 - 02:22

ఎంత తెలివిగలవారైనా ఒక్కోసారి తప్పులు చేస్తుంటారు. అపరచాణక్యులుగా పేరున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులయిన చంద్రబాబు, చంద్రశేఖర్‌రావు ఇటీవలి కాలంలో వేసిన అడుగులు చూసిన వారికి, వెంటనే ఇలాంటి అభిప్రాయమే ఏర్పడుతుంది. తెలంగాణలో కోదండరామ్, ఏపిలో ముద్రగడ రోడ్డెక్కిన వైనానికి తెలుగు చంద్రుల తొందరపాటుతనమే కారణమనిపిస్తుంది.

06/10/2016 - 23:51

‘గ్రీన్‌విచ్ రేఖ..అంటే ఏంటి.? ఈ ప్రశ్న ఎప్పుడూ వినలేదు..? గ్రూప్-2 రాష్టస్థ్రాయి పరీక్షలు రాసిన నలుగురు ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు రైల్లో మాట్లాడుకుంటున్న మాటలివి.

06/10/2016 - 05:32

కిశోర్ చంద్రదేవ్ ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకుడు. కొద్దిరోజుల క్రితం ఆయన ఇలా అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ పతనానికి సీనియర్లు కారణం. వారు సోనియాగాంధీకి తప్పుడు సలహాలిచ్చి పార్టీని భ్రష్టు పట్టించారు.’’ ఆ ప్రకటనలో నిజం ఉన్నదా? సీనియర్లు అంటే ఎవరు?

Pages