S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

06/27/2016 - 23:27

ఉత్తరప్రదేశ్ యదార్థ పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే, పత్రికల వార్తలను అనుసరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కేవలం అక్కడికి వెళ్లి పరిశీలిస్తే తప్ప మనకు అసలు విషయం బోధపడదు. నెహ్రూ హయాం లో అక్కడ ధర్మరాజ్యం. కమలాపతి త్రిపా ఠి, సుచేతా కృపలాని వంటి ఉద్దండులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తర ప్రాంతాన్ని దేవ భూమిగా పరిగణిస్తారు. అదే నేటి ఉత్తరాఖండ్ రాష్ట్రంగా రూపొందింది.

06/27/2016 - 03:43

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా చర్చ, లేదా వివాదం, నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నది. అందుకు కారణాలు ఏవైనా ఇది సంతోషించదగ్గ పరిణామం అవుతున్నది. రాగలదని అందరూ ఆశించిన హోదా రాకపోవడం ముఖ్యంగా సాధారణ ప్రజలను గాయపరచింది. ఇందుకు లేపనం కాగలది అభివృద్ధి మాత్రమే. అయితే అది పాలకులు అంటున్న అభివృద్ధి కాదు, ప్రజలు కోరుకుంటున్నది అయి ఉండాలి.

06/25/2016 - 23:27

హైదరాబాద్‌తో ఆంధ్రా ఉద్యోగుల అనుబంధం ముగిసింది. అమరావతికి చేరిన తుది మజిలీ దాదాపు కొత్త కాపురమే. కొత్త సంసారంలో కష్టసుఖాలున్నట్లే అమరావతికి తరలిన ఉద్యోగులకూ ఉంటాయి. తెలంగాణ ఉద్యోగులు, హైదరాబాద్ గాలి, వాతావరణంతో విడదీయలేనంతగా పెనవేసుకున్న అనుబంధం ఉన్నట్లుండి తెగిపోవడం ఎవరికైనా బాధాకరమే.

06/25/2016 - 02:27

రెండో ప్రపంచ యుద్ధంతో సామ్రాజ్యవాద ముసుగులో ఉన్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా చితికిపోగా, వీటి దాడికి గురైన జపాన్, అంతర్గత యుద్ధతోపాటు పక్కదేశాలతో యుద్ధాలు చేసి చతికిలబడిన ఈయు, చైనా లాంటి దేశాలను, ఉత్తపుణ్యానికై సామ్రాజ్యవాద దేశాలకు సహకరించి సమిధలైన భారత్ లాంటి దేశాల్ని ఆర్థికంగా ఉద్ధరించడానికంటూ, పుట్టిన విష బీజమే ప్రపంచబ్యాంకు.

06/24/2016 - 23:40

రెండో ప్రపంచ యుద్ధంతో సామ్రాజ్యవాద ముసుగులో ఉన్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా చితికిపోగా, వీటి దాడికి గురైన జపాన్, అంతర్గత యుద్ధతోపాటు పక్కదేశాలతో యుద్ధాలు చేసి చతికిలబడిన ఈయు, చైనా లాంటి దేశాలను, ఉత్తపుణ్యానికై సామ్రాజ్యవాద దేశాలకు సహకరించి సమిధలైన భారత్ లాంటి దేశాల్ని ఆర్థికంగా ఉద్ధరించడానికంటూ, పుట్టిన విష బీజమే ప్రపంచబ్యాంకు.

06/23/2016 - 23:51

దేశంలో గాంధీ కుటుంబానికి ఇక శంకరగిరి మాన్యాలే దిక్కవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ఓటమిపాలై భారత రాజకీయపటంలో బక్కచిక్కిపోయిన కాంగ్రెస్ పార్టీని చూసి ఈ సారి శ్రీమతి సోనియా, ఆమె పుత్రరత్నం రాహుల్ గాంధీలు ఎన్నికల ఫలితాలు చూసి బిక్కచచ్చిపోయారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

06/23/2016 - 06:03

ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నుండి తాత్కాలిక అమరావతికి తరలిపోవాలా? వద్దా? అన్న తటపటాయింపునకు గురికావడం కుతూహలగ్రస్తులకు మరింత ఉత్కంఠను కలిగిస్తోంది. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో ‘‘కలకల మంటున్న అవశేష ఆంధ్రప్రదేశ్ సచివాలయ ప్రాంగణం నిర్మానుష్యమై వెలవెల పోతున్న’’ దృశ్యం కొందరి ఉత్కంఠకు ప్రేరకం.

06/21/2016 - 23:56

ప్రపంచంలో ఎక్కడ ఘర్షణ పూర్వక వాతావరణం నెలకొన్నా ఎక్కువగా నష్టపోయేది మహిళలు, బాలలే. ప్రస్తుతం ఇస్లామిక్ ఉగ్రవాద భూతం ఐఎస్‌ఐఎస్ సాగిస్తున్న మారణకాండలో సహితం వీరే సమిధలవుతున్నారు. ఇంగ్లాండ్‌లోని మిర్రర్ పత్రిక కథనం ప్రకారం రాబోయేతరం హంతక ఉగ్రవాదులకు జన్మ ఇవ్వడానికి 31 వేలమంది గర్భిణి స్ర్తిలను ఐఎస్‌ఐఎస్ సిద్ధంగా ఉంచింది.

06/21/2016 - 04:34

ఈనెల అలహాబాద్‌లో భాజపా జాతీ య కార్యవర్గ సమావేశం ఆర్భాటంగా జరిగింది. అంటే 2017లో రాబోయే యుపి ఎన్నికల ప్రచారాన్ని అప్పుడే నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలహాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ కొన్ని అంశాలను ప్రతిపాదించారు. 1. సేవ, 2. సంతులనం, 3.సంయమనం, 4.సమన్వయం, 5. సకారాత్మకత, 6. సంవాదం.

06/20/2016 - 05:26

ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లో రెం డు ఆసక్తికరమైన దృశ్యాలు కన్పించా యి. ఒకటి గాంధీభవన్‌లో, రెండవది తెలంగాణ భవన్‌లో. అవేమిటన్నది తెలిసిందే. గాం ధీభవన్‌లో ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చా ర్జ్ అయిన దిగ్విజయ్‌సింగ్, పార్టీ ప్రముఖుల తో సమావేశం నిర్వహించారు. అందులో ప్రధానమైన చర్చనీయాంశం కాంగ్రెస్ వాదు లు అధికార పక్షమైన టిఆర్‌ఎస్‌లోకి వెళ్లకుం డా ఆపడం ఎట్లా, పార్టీని పటిష్ట చేయడం ఎలాగన్నది.

Pages