S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/27/2015 - 06:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఎకానమీ శ్రేణి ప్రయాణీకులకు మాంసాహారాన్ని అందించడం నిలిపివేయనుంది. 90 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకునే ప్రయాణీకులకు జనవరి 1 నుంచి విమానంలో మాంసాహార పదార్థాలను అందించబోవడం లేదని ప్రకటించింది. మరోవైపు ఎయిరిండియా తీసుకున్న నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.

12/27/2015 - 06:29

ఈ ఏడాది ఆర్థిక, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో చోటుచేసుకున్న కీలక అంశాల
సమాహారమే ఈ ‘వీడ్కోలు-2015’. స్టాక్, రూపాయి, బంగారం, ముడి చమురు
మార్కెట్ల వివరాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలన్నింటినీ
ఒక్కచోటికి చేర్చుతూ మీకందిస్తున్నాం
========================
స్టాక్ మార్కెట్లు డీలా

12/26/2015 - 06:43

విశాఖపట్నం, డిసెంబర్ 25: ఉత్తర కోస్తాలో కల్తీ మద్యం వరదలై పారుతోంది. ఇటీవల విజయవాడ నగరం కేంద్రంగా కల్తీమద్యం కాటుకు ఐదుగురు బలికాగా, మరికొంత మంది అమాయకులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒడిశా రాష్ట్రం నుంచి వెల్లువెత్తుతున్న రెక్టిఫైడ్ స్పిరిట్ (ఆర్‌ఎస్)తో ఇక్కడ మద్యం వ్యాపారులు చీప్ లిక్కర్‌ను తయారు చేస్తూ అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు.

12/26/2015 - 06:39

కడప, డిసెంబర్ 25: కడప జిల్లాలోని గండికోటను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. అటవీ, పర్యాటక, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో ఈ మేరకు చర్చించినట్లు సమాచారం.

12/26/2015 - 07:04

విశాఖపట్నం, డిసెంబర్ 25: వ్యవసాయ ఆధారిత ప్రాంతాలైన ఉత్తర కోస్తాలో గత ఏడాది కాలంగా సోలార్ వ్యవసాయ పంపుసెట్లకు రైతుల నుంచి విశేషంగా ఆదరణ లభిస్తోంది. దీంతో అంతరాయాల్లేని విద్యుత్ సరఫరాను రైతులు పొందగలుగుతున్నారు. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) పరిధిలో ఐదు జిల్లాలకు సంబంధించి ఇది సాధ్యపడటంతో ఈ పథకాన్ని పూర్తిస్తాయిలో విస్తరించాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది.

12/26/2015 - 06:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఉల్లిగడ్డ ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో 18 శాతం పడిపోయాయి. దేశీయంగా ఉల్లి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన నేపథ్యంలో ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలే దీనికి కారణం.

12/26/2015 - 06:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: స్పెక్ట్రమ్‌లో 700 మెగాహెట్జ్ ప్రీమియం బ్యాండ్‌ను ఇప్పుడే వేలం వేయవద్దని ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ వంటి ప్రముఖ సంస్థలు టెలికామ్ నియంత్రణా సంస్థ ‘ట్రాయ్’కి విజ్ఞప్తి చేశాయి. ఈ బ్యాండ్ ద్వారా సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు తగినంతగా అందుబాటులోకి వచ్చేవరకు ఈ వేలాన్ని నిలిపివేయాని ఆ సంస్థలు కోరాయి.

12/26/2015 - 06:36

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: వీసా ఫీజును పెంచాలన్న అమెరికా నిర్ణయం వివక్షాపూరితమైనదని భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (్ఫక్కీ) ఆవేదన వ్యక్తం చేసింది. వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్, అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందని ఫిక్కీ స్పష్టం చేసింది.

12/26/2015 - 06:36

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి) బిల్లు ఆమోదం పొందకపోవడం పట్ల పారిశ్రామిక సంఘం అసోచామ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్లమెంటు సభ్యుల నుంచి దేశం మరింత మెరుగైన పనితీరును కోరుకుంటోందని వ్యాఖ్యానించింది.

12/26/2015 - 06:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: బహుళ వ్యాపార గ్రూపైన జిఎమ్‌ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. జిఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో హోల్డింగ్స్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తోంది. జిఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌లో ప్రతిపాదిత హోల్డింగ్స్ పునర్‌వ్యవస్థీకరణ కోసం ఒప్పందాలు జరిగినట్లు శుక్రవారం జిఎమ్‌ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది.

Pages