S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/08/2016 - 05:26

సంగారెడ్డి: విద్యుదుత్పత్తికి అవసరమైన నీరు, థర్మల్ వనరులు తగ్గిపోవడంతో కరెంటు కష్టాలు మొదలైన నేపథ్యంలో సౌర విద్యుత్ కేంద్రాలు ఆదుకుంటున్నాయి. కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వివిధ కంపెనీలు మెదక్ జిల్లాలో సౌర విద్యుత్ కేంద్రాలను విస్తరించడం ద్వారా రోజుకు 150 మెగావాట్ల విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.

02/08/2016 - 05:27

పారదీప్ (ఒడిషా): ప్రధాన మంత్రి ముద్ర యోజన క్రింద చిన్న వ్యాపారులకు దాదాపు లక్ష కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఇక్కడ తెలియజేశారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసేలా ఉండకూడదని, ఉద్యోగాలు ఇచ్చేలా తయారవ్వాలన్నదే ప్రభుత్వ ఆశయం అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి)..

02/08/2016 - 05:21

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: విదేశీ మదుపరులు ఈ నెల తొలి వారంలో దేశీయ క్యాపిటల్ మార్కెట్లలోకి 2,500 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకొచ్చారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య గత నెల జనవరిలో భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకున్న విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. గత వారం మాత్రం పెట్టుబడులకు ఆసక్తి కనబరచడం విశేషం.

02/08/2016 - 05:17

హైదరాబాద్, ఫిబ్రవరి 7: రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7.64 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలంటే ముందుగా భూమి లభ్యత ఉండాలన్నది తెలిసిందే. దీన్ని బాగా అర్థం చేసుకున్న ఏపి సర్కారు ఆ దిశగా దృష్టి సారించింది.

02/08/2016 - 05:16

న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను ప్రకటించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జిడిపి, పారిశ్రామికోత్పత్తి (ఐఐపి), వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారం విడుదల కానున్నాయి.

02/07/2016 - 06:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: కేంద్ర ప్రభుత్వం దాదాపు 74 ఔషధాలకున్న పన్ను మినహాయింపు సౌకర్యాన్ని ఉపసంహరించింది. ఇందులో ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, హెచ్‌ఐవిలకు వినియోగించే ఔషధాలు కూడా ఉండటం గమనార్హం. ఫలితంగా వాటికి సంబంధించిన వ్యాధిగ్రస్తులపై ఇక ఆర్థిక భారం పడనుంది.

02/07/2016 - 06:30

ముంబయి, ఫిబ్రవరి 6: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనంతో ఒడిదుడుకులకు లోనైన ఆయా దేశాల స్టాక్ మార్కెట్ల ప్రభావం గడచిన వారం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది.

02/07/2016 - 06:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: నరేశ్ గోయల్ నేతృత్వంలోని దేశీయ ప్రైవేట్‌రంగ ఎయిర్‌లైన్స్ జెట్ ఎయిర్‌వేస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ఏడింతలకుపైగా పెరిగి 467 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో లాభం 63 కోట్ల రూపాయలకే పరిమితమైంది.

02/07/2016 - 06:25

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: సమాచార, ప్రసార, టెలికామ్ రంగాల్లోని కేసుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేశారు. శనివారం ఇక్కడ జరిగిన టిడిశాట్ సెమినార్‌లో మాట్లాడిన ఆయన జస్టిస్ ఆలమ్ అన్నదానికి పైవిధంగా స్పందించారు. ప్రత్యేక వ్యవస్థకు సంబంధించి టిడిశాట్ ఓ సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు రావాలని కూడా సూచించారు.

02/07/2016 - 06:24

నాగార్జునసాగర్, ఫిబ్రవరి 6: రానున్న వేసవిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు తెలిపారు. శనివారం ఆయన హైడల్ డైరెక్టర్ రాజన్‌తోపాటు సాగర్‌లోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని, ఎడమకాల్వపై ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు.

Pages