S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/13/2016 - 03:08

ముంబయి, ఫిబ్రవరి 12: గురువారం భారీ నష్టాలకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, పలు ప్రముఖ సంస్థల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మదుపరులు గురువారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైనది తెలిసిందే. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 807 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 239 పాయింట్ల మేర కోల్పోయాయి.

02/13/2016 - 03:08

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: కింగ్‌ఫిషర్ హౌస్‌ను వచ్చే నెలలో బ్యాంకర్లు వేలం వేయనున్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. బ్యాంకులకు పెద్ద ఎత్తున బకాయిపడినది తెలిసిందే.

02/13/2016 - 03:07

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారత ఛార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ (ఐసిఎఐ)కి నూతన అధ్యక్షుడిగా ఎం దేవరాజారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016- 17)కుగాను ఆయన ఈ పదవీలో కోనసాగనున్నారు. గడచిన 64 ఏళ్లలో ఐసిఎఐకి ఒక తెలుగు వ్యక్తి అధ్యక్షుడు కావడం ఇదే ప్రథమం. తిరుపతికి చేందిన దేవరాజారెడ్డి గత 28 ఏళ్లుగా ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా సేవలందిస్తున్నారు.

02/13/2016 - 03:06

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ రాష్ట్రంలో చిన్న, మధ్య, భారీ పరిశ్రమలకు ఎటువంటి కోతలు లేకుండా నిరాటంకంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.

02/13/2016 - 03:06

మదనపల్లె, ఫిబ్రవరి 12: చిత్తూరు జిల్లా మదనపల్లె టమోటా వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధరలు పడిపోతున్నాయ. ఫలితంగా రైతులు నష్టాల పాలవుతున్నారు. రైతులంతా పంటను మార్కెట్‌కు తరలించడంతో డిమాండ్ కంటే అధికంగా సరఫరా జరిగి ధరలు పతనమవుతున్నాయ. మరోవైపు కర్నాటక రాష్ట్రంలోని చింతామణి, వాయల్పాడుతోపాటు అనంతపురం, కడప జిల్లాల్లో పండించిన టమోటాలు కూడా మదనపల్లె మార్కెట్‌కు వస్తున్నాయ.

02/13/2016 - 03:05

గోదావరిఖని, ఫిబ్రవరి 12: రామగుండం ఎన్‌టిపిసి వద్ద మరో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోది హామీ ఇవ్వడంతో పనులు మరింత వేగవంతం అవుతున్నాయి. శుక్రవారం ఢిల్లీలో ప్రధానిని కలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రామగుండం ఎన్‌టిపిసి 4వేల మెగావాట్ల విద్యుత్ యూనిట్ల ఏర్పాటుపై హామీ ఇచ్చారు.

02/13/2016 - 03:04

విశాఖపట్నం, ఫిబ్రవరి 12: పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఇజెడ్) ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో డిసెంబర్ నెలాఖరునాటికి రూ. 40,565 కోట్ల మేర ఎగుమతులు చేసినట్టు జోనల్ డెవలప్‌మెంట్ కమిషనర్ శోభన కెఎస్ రావు తెలిపారు.

02/12/2016 - 07:16

న్యూఢిల్లీ: భారత్‌లోని అత్యధిక వినియోగదారులు ఇప్పటికీ స్థానిక మార్కెట్ల నుంచే పండ్లు, కూరగాయలను కొనుగోలు చేస్తున్నారని, దేశంలో ఫుడ్‌ప్రాసెసింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు ఆహారం, నిత్యావసర వస్తువులకు సంబంధించిన మల్టీ-బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మేధోమథన సంస్థ ఐసిఆర్‌ఐఇఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్

02/12/2016 - 06:24

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందన్న అంచనాలు ఎంతో ఘనమైనవి, ప్రాధాన్యతతో కూడినవేనని ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రపంచంలో మారుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ సవాళ్లను అధిగమించేందుకు సిద్ధంగా ఉందని ఆ శాఖ స్పష్టం చేసింది.

02/12/2016 - 06:23

ముంబయి: క్రెడిట్ వృద్ధికన్నా కూడా బ్యాంకుల బ్యాంలెన్స్ షీట్లలో మొండిబకాయిలను తొలగించడానికి ప్రాధాన్యత ఇస్తామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం స్పష్టం చేశారు. 2017 మార్చి నాటికల్లా బ్యాంకుల బ్యాంలెన్స్ షీట్లను శుభ్రం చేయడంతో పాటుగా క్రెడిట్‌కు అనుకూలంగా ఉండేలా చేయడం ఆర్‌బిఐ ఉద్దేశమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

Pages