S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/13/2016 - 03:04

విశాఖపట్నం, ఫిబ్రవరి 12: పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఇజెడ్) ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో డిసెంబర్ నెలాఖరునాటికి రూ. 40,565 కోట్ల మేర ఎగుమతులు చేసినట్టు జోనల్ డెవలప్‌మెంట్ కమిషనర్ శోభన కెఎస్ రావు తెలిపారు.

02/12/2016 - 07:16

న్యూఢిల్లీ: భారత్‌లోని అత్యధిక వినియోగదారులు ఇప్పటికీ స్థానిక మార్కెట్ల నుంచే పండ్లు, కూరగాయలను కొనుగోలు చేస్తున్నారని, దేశంలో ఫుడ్‌ప్రాసెసింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు ఆహారం, నిత్యావసర వస్తువులకు సంబంధించిన మల్టీ-బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మేధోమథన సంస్థ ఐసిఆర్‌ఐఇఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్

02/12/2016 - 06:24

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందన్న అంచనాలు ఎంతో ఘనమైనవి, ప్రాధాన్యతతో కూడినవేనని ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రపంచంలో మారుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ సవాళ్లను అధిగమించేందుకు సిద్ధంగా ఉందని ఆ శాఖ స్పష్టం చేసింది.

02/12/2016 - 06:23

ముంబయి: క్రెడిట్ వృద్ధికన్నా కూడా బ్యాంకుల బ్యాంలెన్స్ షీట్లలో మొండిబకాయిలను తొలగించడానికి ప్రాధాన్యత ఇస్తామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం స్పష్టం చేశారు. 2017 మార్చి నాటికల్లా బ్యాంకుల బ్యాంలెన్స్ షీట్లను శుభ్రం చేయడంతో పాటుగా క్రెడిట్‌కు అనుకూలంగా ఉండేలా చేయడం ఆర్‌బిఐ ఉద్దేశమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

02/12/2016 - 06:22

దేవరపల్లి: అక్రమ పొగాకు కొనుగోళ్లు అరికట్టడానికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని పొగాకు బోర్డు విజిలెన్స్ అధికారి పి రమేష్ పేర్కొన్నారు. అక్రమ కొనుగోళ్ల వల్ల రైతులు నష్టపోవడమేకాక, బోర్డు ఉనికికే ముప్పు ఏర్పడుతోందన్నారు. ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలోగల పొగాకు వేలం కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు.

02/12/2016 - 06:21

న్యూడిల్లీ : మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఉండేందుకు వీలుగా చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో సవరిస్తుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ చెప్పారు. అయితే ఆడపిల్లల, సీనియర్ సిటిజన్ల( వృద్ధులు)కు సంబంధించిన పథకాల వడ్డీ రేట్లను మాత్రం మార్చబోమని ఆయన చెప్పారు.

02/12/2016 - 06:20

హైదరాబాద్: దేశంలోని ఎనిమిది ప్రధాన రేవుల్లో 2020 సంవత్సరం నాటికి 135 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు మారిటైం డైరెక్టర్, కేంద్ర నౌకయాన శాఖ కార్యదర్శి దేవంద్ర కె రాయ్ తెలిపారు. గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పరదీప్, విశాఖఫట్నం, కోల్‌కొత్తా, న్యూ మంగళూరు, కాండ్లా, కామరాజర్ తదితర రేవుల్లో ఈ సదుపాయాన్ని కల్పించేందుకు నిధులు విడుదల చేశామన్నారు.

02/12/2016 - 06:19

ముంబయి: దేశీ స్టాక్ మార్కెట్లు గురువారం కుప్ప కూలాయి. మరోసారి ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించవచ్చన్న భయాలకు తోడు, కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడం కలిపి మదుపరుల సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బ తీశాయి. దీంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 807 పాయింట్లు నష్టపోయి 23 వేల పాయింట్ల దిగువకు చేరుకుంది.

02/11/2016 - 05:47

న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు అరబ్ దేశాల నుంచి పెట్టుబడులను ఒడిసి పట్టుకోవాలని చూస్తోంది.

02/11/2016 - 05:43

ముంబయి, ఫిబ్రవరి 10: దేశీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు కుదిపేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలున్నప్పటికీ బుధవారం కూడా సూచీలు నష్టాలకే పరిమితమయ్యాయి. సోమ, మంగళవారాల్లో కూడా స్టాక్ మార్కెట్లు క్షీణించినది తెలిసిందే.

Pages