S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/27/2016 - 05:06

ముంబయి/బెంగళూరు, మార్చి 26: భారత ఈ-కామర్స్ రిటైల్ దిగ్గజాలు, ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్రత్యర్థులైన ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ మధ్య ఆన్‌లైన్ వేదికగా విమర్శలు-ప్రతివిమర్శలు మరింత జోరందుకున్నాయి. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా.. భారత్‌లోకి ప్రవేశించడంపై తాజాగా ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వ్యవస్థాపకులిరువురి మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ పరస్పర వాదనల్లోకి వెళితే..

03/27/2016 - 05:04

విశాఖపట్నం, మార్చి 26: విమనయాన రంగాభివృద్ధికి రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నం ఎంపి కె హరిబాబు తెలిపారు. సరకు రవాణా, ప్యాసింజర్ విమానాలకు ఉన్న అవకాశాలను విమానయాన సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

03/26/2016 - 03:52

న్యూఢిల్లీ, మార్చి 25: ఏప్రిల్ నుంచి వాహనాల ధరలను పెంచాలని హోండా కార్ ఇండియా భావిస్తోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం మధ్య పెరిగిన ఉత్పాదక వ్యయంతో వివిధ మోడళ్ల ధరలను గరిష్ఠంగా 6,000 రూపాయల వరకు పెంచాలని యోచిస్తోంది. నిజానికి ఈ నెల ఆరంభంలోనే వివిధ రకాల కార్లపై 79,000 రూపాయల వరకు హోండా ధరలను పెంచింది.

03/26/2016 - 03:51

మదనపల్లె, మార్చి 25: టమోటా రైతులు రోడ్డెక్కారు. తక్కువ దిగుబడులు వస్తున్నా కిలో టమోటాలు కేవలం రెండు రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, మండీ వ్యాపారులు కుమ్మక్కవ్వడం వల్లే ధరలు పతనమవుతున్నాయన్న రైతులు.. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

03/26/2016 - 03:50

హైదరాబాద్, మార్చి 25: మహారాష్టల్రోని పుణే వద్ద 30 ఎకరాల్లో సమగ్ర లైఫ్ స్టయిల్ రెసిడెన్షియల్ అపార్టుమెంట్లను నిర్మించనున్నట్లు పురవంకర ప్రాజెక్ట్స్ ప్రకటించింది. దీనికి పుర్వ సిల్వర్ శాండ్స్ అని నామకరణం చేశారు. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో స్ధిరపడేవారి అభిరుచులకు తగ్గట్టుగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు పురవంకర ప్రాజెక్ట్స్ సిఎండి రవి పురవంకర తెలిపారు.

03/26/2016 - 03:50

హైదరాబాద్, మార్చి 25: గుజరాత్‌కు చెందిన హార్లే ఫుడ్ ఉత్పత్తుల సంస్థ నాణ్యత, నోరూరించే ఆరోగ్యకరమైన స్నాక్స్, బేవరేజస్, కనె్ఫక్షనరీ ఉత్పత్తులను హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. ఆ సంస్ధ సిఎండి సౌమిక్ మిత్రా మాట్లాడుతూ పిల్లల సంతృప్తే మా సంతృప్తి అనే నినాదాన్ని టాగ్‌లైన్‌గా సూరత్ కేంద్రంగా తమ సంస్థ పనిచేస్తోందన్నారు.

03/26/2016 - 03:49

విశాఖపట్నం, మార్చి 25: విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో వివిధ వర్గాలకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది. ఇంటర్నేషనల్ కార్గో హ్యాండ్లింగ్, పలు ప్రాంతాలకు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో ఇతర విమానాశ్రయాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.

03/26/2016 - 03:49

లండన్, మార్చి 25: ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పాదక సంస్థ ఆర్సెలార్ మిట్టల్.. అమెరికాలోని తమ లాప్లేస్, వింటన్ లాంగ్ కార్బన్ ప్లాంట్లను అమ్మేస్తోంది. అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ బ్లాక్ డైమండ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్‌కు చెందిన ఓ అనుబంధ సంస్థకు వీటిని ఆర్సెలార్ మిట్టల్ విక్రయిస్తున్నారు. ఈ మేరకు ఆర్సెలార్ మిట్టల్ తెలియజేసింది. అయితే ఎంతకు అమ్ముతున్నారన్న వివరాలను మాత్రం తెలియజేయలేదు.

03/26/2016 - 03:48

విశాఖపట్నం, మార్చి 25: విశాఖ నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం సమ్మర్ షెడ్యూల్ కింద కొత్త సర్వీసులు నడపడానికి పలు విమానయాన సంస్థలు ముందుకొచ్చాయి. కోల్‌కత్తా-విశాఖ-చెన్నై, ఢిల్లీ-విశాఖ-ముంబయి మధ్య విమానాలను త్వరలో ప్రవేశపెట్టడానికి జెట్ ఎయిర్‌వేస్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అలాగే వచ్చేనెల 16 నుంచి చెన్నై-విశాఖపట్నం-చెన్నై విమానాన్ని స్పైస్ జెట్ ప్రవేశపెట్టనుంది.

03/26/2016 - 03:47

కొత్తగూడెం, మార్చి 25: వేసవి ప్రారంభంలోనే ప్రచండ భానుడు ప్రతాపం చూపుతున్నప్పటికీ సింగరేణి కార్మికులు గ్రీష్మతాపాన్ని భరిస్తూనే సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధన దిశగా కృషి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 60.03 మిలియన్ టన్నుల అంతర్గత ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు శ్రమిస్తున్నారు.

Pages